వేదార్థం మధుసూదన శర్మ

వేదార్థం మధుసూదన శర్మ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మాబెట్ల గ్రామానికి చెందిన తెలుగు భాషోపాధ్యాయుడు,రచయిత, విమర్శకుడు. ఆకాశవాణి హైద్రాబాదు కేంద్రం ద్వారా అనేక ప్రసంగాలు చేశాడు. 2015 లో అతని సాహిత్య కృషికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర (మండల స్థాయి) అవార్డు అందజేసింది.[1]

వేదార్థం మధుసూదన శర్మ
పుట్టిన తేదీ, స్థలం (1975-07-02) 1975 జూలై 2 (వయసు 49)
ఎనబట్ల గ్రామం, కొల్లాపూర్
వృత్తిరచయిత
జాతీయతభారతీయుడు India

జీవిత విశేషాలు

మార్చు

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మనబెట్ల గ్రామానికి చెందిన వేదార్థం మధుసూదన శర్మ తెలుగు భాషోపాధ్యాయునిగా, కవిగా,రచయితగా, తెలుగు భారతి సాహిత్య, సాంస్కృతిక సంస్థకు ప్రధాన కార్య దర్శిగా,తెలుగు భాషా పరిరక్షణ,వికాసం కొరకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు.

కెరీర్

మార్చు

2002 నుండి ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. ఆకాశవాణి హైద్రాబాద్ 'ఎ ' కేంద్రం ద్వారా వివిధ కవుల రచనలపై ఇంకా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై అనేక ప్రసంగాలను చేశాడు.

రచయితగా

మార్చు

అడుగు జాడలు,సాహితీ ముత్యాలు,కొల్లాపూర్ సాహితీ వైభవం,కృష్ణా పుష్కర శోభ,సమాలోకనం వంటి గ్రంథాలను వెలువరించాడు.

ముద్రిత రచనలు

మార్చు
  • అడుగు జాడలు
  • సాహితి ముత్యాలు[2]
  • కొల్లాపూర్ సాహితి వైభవం[3]
  • మన కొల్లాపురం , కృష్ణానదీమతల్లి పుష్కర శోభ
  • సమాలోకానం
  • పరంపర (ఆధ్యాత్మిక వ్యాస సంపుటి)

పురస్కారాలు

మార్చు
  • తెలంగాణ రాష్ట్ర అవార్డు (మండల స్థాయి)
  • గురజాడ జాతీయ విశిష్ట సాహిత్య పురస్కారం (గురజాడ ఫౌండేషన్)

మూలాలు

మార్చు
  1. "Govt teacher chronicles Kollapur lit history". The New Indian Express. Retrieved 2021-07-14.
  2. "సాహితి ముత్యాలు" (PDF).{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Govt teacher chronicles Kollapur lit history". The New Indian Express. Retrieved 2021-07-14.