వేమన పద్యములు (పుస్తకం)
వేమన ప్రఖ్యాతుడైన తెలుగు శతక కవి. ఆయన "విశ్వదాభిరామ వినురవేమ" అనే మకుటంతో రాసిన పద్యాలు తెలుగునాట ఆబాలవృద్ధులకూ కంఠస్థం. లోకరీతినీ, తాత్త్వికతను తెలిపే ఈ పద్యాలు 20వ శతాబ్ది విమర్శకుల కృషి వల్ల విస్తృతమైన గౌరవాన్ని పొందాయి. ఈ గ్రంథంలో తాత్పర్యంతో కూడిన వేమన పద్యాలతోపాటుగా రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ రాసిన 35 పేజీల విపులమైన పీఠిక కూడా ఉంది.
దీనిని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి వారు 1919 సంవత్సరంలో ప్రచురించారు.
విషయసూచిక
మార్చు- మూర్ఖపద్ధతి
- దాంభికపద్ధతి
- విద్వత్పద్ధతి
- అర్థపద్ధతి
- దుర్జనపద్ధతి
- సజ్జనపద్ధతి
- దైవపద్ధతి
- కర్మపద్ధతి
- ధైర్యపద్ధతి
- మోహపద్ధతి
- యోగిపద్ధతి
- బ్రహ్మస్వరూపపద్ధతి
- గురుభక్తిపద్ధతి
- ప్రపంచస్వభావపద్ధతి
- స్త్రీస్వభావపద్ధతి
- కూటవేదాంతపద్ధతి
- జీవన్ముక్తిపద్ధతి
- సంకీర్ణపద్ధతి
- ఫలస్తుతి