వేమూరి రామకృష్ణారావు

గురు-శిష్యుల జంటలలో చెప్పుకోదగ్గ జంట బందరులో రఘుపతి వెంకటరత్నం నాయుడు, వేమూరి రామకృష్ణారావు (1876-1939). తల్లిదండ్రులు: హనుమాయమ్మ, పద్మనాభరావు. తెలుగుదేశంలో ఆ నాటి అధ్యాపకులలో అగ్రగణ్యుడు వేమూరి రామకృష్ణారావు. ఆయన వైదుష్యం తెలుగుదేశమే కాదు, భారతదేశం అంతా పరిమళించింది. ఆయన ఆంగ్ల భాషా పాండిత్యం అసమాన్యం. కాకినాడ పిఠాపురం రాజా వారి కళాశాలలో ప్రిన్సుపాలుగా పని చేసేరు. కళాశాల యాజమాన్యం అనుచితమైన వత్తిడులు తెస్తే ఆ పదవిని తృణప్రాయంగా వదలి పెట్టేరాయన.


మూలాలుసవరించు

  • అక్కిరాజు రమాపతిరావు రాసిన ప్రతిభామూర్తులు, విజ్ఞాన దీపిక ప్రచురణ, 1991