వైభవి శాండిల్య
వైభవి శాండిల్య, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. తమిళం, కన్నడ, మరాఠీ సినిమాలలో నటించింది. 2015లో జానీవా అనే మరాఠీ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టిన వైభవి, ఎక్క్ అల్బేలా (2015), సక్కా పోడు పోడు రాజా (2017), ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు (2018), క్యాప్ మారి (2019) వంటి సినిమాలతోపాటు 2017లో తెలుగులో వచ్చిన నెక్ట్స్ నువ్వే సినిమాలో కూడా నటించింది.
వైభవి శాండిల్య | |
---|---|
జననం | [1] | 1994 మే 27
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
జననం
మార్చువైభవి 1994, మే 27న మహారాష్ట్ర లోని పూణేలో జన్మించింది.
సినిమారంగం
మార్చుమరాఠీలో 2015లో వచ్చిన జానీవా సినిమాలో తొలిసారిగా నటించింది.[2] ఆ తరువాత భగవాన్ దాదా బయోపిక్, ఏక్ అల్బేలా సినిమాలో షాహీన్ అనే ముస్లిం అమ్మాయి పాత్రలో నటించింది.[3] [4]
2016లో గహెమ్ ఫే ఎల్ హెండ్ (ఈజిప్షియన్ అరబిక్) సినిమాలో "తక్ దిన్నా" అనే ప్రత్యేక పాటలో డాన్సర్‌గా కనిపించింది. సర్వర్ సుందరం, సక్క పోడు రాజా,[5][6] ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు నటించింది.
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర(లు) | భాష(లు) | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2015 | ఎక్ అల్బెలా | షాహీన్ | మరాఠీ | మరాఠీ అరంగేట్రం |
2017 | సక్క పోడు పోడు రాజా | యాజిని | తమిళం | తమిళ అరంగేట్రం |
2017 | రాజ్ విష్ణు | లావణ్య | కన్నడ | కన్నడ రంగప్రవేశం |
2017 | నెక్ట్స్ నువ్వే | స్మిత | తెలుగు | తెలుగు అరంగేట్రం |
2018 | ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు | తెండ్రాల్ | తమిళం | |
2019 | క్యాప్మారి | జెన్నీ | తమిళం | |
2022 | గాలిపాట 2 | కన్నడ | ||
2024 | మార్టిన్ | కన్నడ |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | భాష | ఛానల్ |
---|---|---|---|---|
2019 | నిషా | నిషా | తమిళం | జీ5 |
2021 | ఛత్రసాల్ | దేవ్‌కున్వారి [7] | హిందీ | ఎంఎక్స్ ప్లేయర్ |
మూలాలు
మార్చు- ↑ "Vaibhavi Shandilya - Movies, Biography, News, Age & Photos".
- ↑ Janiva Movie Review {1.5/5}: Critic Review of Janiva by Times of India, retrieved 2022-05-29
- ↑ "Movie review: Ekk Albela". filmfare.com. Retrieved 2022-05-29.
- ↑ "Vaibhavi Shandilya finds a prominent role in 'Ek Albela'". ZEE Talkies. Archived from the original on 2021-04-12. Retrieved 2022-05-29.
- ↑ "Santhanam next film is again with Vaibhavi Shandilya !". sify.com. Archived from the original on 2016-12-20. Retrieved 2022-05-29.
- ↑ "Vaibhavi to debut in Santhanam's next". The Hindu. 6 March 2016. Retrieved 2022-05-29.
- ↑ "Vaibhavi Shandilya on Devkunwari in 'Chhatrasal': It was really difficult; I had to do a lot of research". Mid-day. 1 August 2021.