వోడ్కా
వోడ్కా (ఆంగ్లం: Vodka) ప్రాథమికంగా మంచినీరు, ఇథనాల్ కలిగి స్వేదనం చేయబడ్డ ఒక మత్తు పానీయం. పోలాండ్, రష్యా దేశాలలో ఉద్భవించినది. సాంప్రదాయికంగా వోడ్కా తయారీలో పులియబెట్టిన తృణ ధాన్యాలను, బంగాళాదుంపలను వినియోగిస్తారు. అయితే ఆధునిక పద్ధతులలో తయారు చేయబడే వోడ్కాలో ఫలాలు కూడా వినియోగిస్తారు.
వోడ్కాలో ఆల్కహాల్ శాతం 40% కలిగి ఉంటుంది.
పాశ్చాత్య దేశాలలో సాధారణంగా వోడ్కా సంప్రదాయబద్ధంగా "నీట్" లేదా "స్ట్రయిట్" (నీరు, ఐస్ లేదా ఇతర మిక్సర్ లతో కలపబడదు) అంటే, యథాతథంగా సేవిస్తారు. భారతదేశంలో దీనిని ఎక్కువగా స్ప్రైట్ తో కలిపి సేవిస్తారు. నారింజ ఫల రసంతో కలిపి స్క్రూడ్రైవర్ అనే పానీయం, టమోటా ఫల రసంతో కలిపి బ్లడీ మేరీ అనే పానీయాలు కూడా భారతీయులకు సుపరిచితాలే.
చాలా శతాబ్దాల నుంచి వాడుకలో వున్న వోడ్కా వంటి పానీయాలకు నేటి వోడ్కాకు చాలా భిన్నత్వం వుంది. ప్రాచిన కాలంలో ఆల్కహాల్ స్పిరిట్ వేరే రుచి, రంగు, వాసన కలిగి వుండేది. దీనిని ఒక ఔషధంగా ఉపయోగించారు. ఇందులో తక్కువ ఆల్కహాల్ అంటే గరిష్టంగా 14% ఉండేది.