ఇంగ్లండ్, బార్క్‌షైర్‌లో ఒక నీలవర్ణపు చక్రాల చెత్త డబ్బా
ఖాట్మండులో (నేపాల్) వ్యర్థ పదార్థాల నిర్వహణ

వ్యర్థ పదార్థాల సేకరణ, రవాణా, నిర్వహణ, సంవిధానం, పునర్వినియోగం లేదా పారవేయడం మరియు పర్యవేక్షణ అన్నింటిని కలిపి వ్యర్థ పదార్థాల నిర్వహణ (Waste Management) అంటారు.[1] ఈ పదాన్ని సాధారణంగా మానవ చర్యల వలన ఏర్పడిన పదార్థాలకు వాడుతుంటారు మరియు సాధారణంగా ఆరోగ్యం, పర్యావరణం లేదా సౌందర్యంపై వ్యర్థాల ప్రభావాన్ని తగ్గించేందుకు దీనిని చేపడతారు. వ్యర్థాల్లోని వనరులను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు కూడా వ్యర్థ పదార్థాల నిర్వహణను ఉపయోగిస్తారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ ఘన, ద్రవ, వాయు లేదా రేడియోధార్మిక పదార్థాలతో కలిసి ఉంటుంది, ప్రతిదాని నిర్వహణకు వేర్వేరు పద్ధతులు, సంబంధిత నైపుణ్యాలు ఉన్నాయి.

అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలకు, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలకు మరియు నివాస మరియు పారిశ్రామిక ప్రాంతాలకు మధ్య వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతుల్లో వ్యత్యాసం ఉంటుంది. మహానగర ప్రాంతాల్లో ప్రమాదకరం కాని నివాస మరియు సంస్థల వ్యర్థ పదార్థాల నిర్వహణ బాధ్యత సాధారణంగా స్థానిక ప్రభుత్వం యొక్క అధికార యంత్రాంగంపై ఉంటుంది, ఇదిలా ఉంటే ప్రమాదకరేతర వ్యాపార మరియు పారిశ్రామిక వ్యర్థ పదార్థాల నిర్వహణ బాధ్యత సాధారణంగా దాని ఉత్పత్తిదారులపైనే ఉంటుంది.

పద్ధతులుసవరించు

తొలగించే పద్ధతులుసవరించు

భూమిలో వ్యర్థాల ఖనీభవనంసవరించు

 
హవాయ్‌లో భూమిపూరింపు చర్య

జనావాసాలకు దూరంగా ఉన్న అయోగ్య ప్రదేశాల్లో వ్యర్థాలను ఖనీభవనం చేస్తారు, చాలా దేశాల్లో ఇది సాధారణ వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతిగా ఉంది. విసర్జించిన లేదా ఉపయోగించని రాతిగనులు, గని త్రవ్వకంలో ఏర్పడిన ఖాళీలు లేదా మరోచోట వినియోగం కోసం మట్టితీసిన గొయ్యిలను భర్తీ చేసేందుకు తరచుగా వ్యర్థాలను ఉపయోగిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా మరియు మెరుగైన నిర్వహణ ఉంటే ఈ పద్ధతిలో వ్యర్థ పదార్థాలను పారవేయడం ఆరోగ్యకరంగా, పెద్దగా ఖర్చులేకుండా జరిగిపోతుంది. పాత, అస్తవ్యస్థమైన ప్రణాళికలతో లేదా సరైన నిర్వహణ లేకుండా వ్యర్థ ఖనీభవనం జరిగిన ప్రదేశాలు చెత్తచెదారంతో గాలి దుమారాలు, రోగాలు సంక్రమింపజేసే చిన్న జీవులును ఆకర్షించడం, మురుగు వంటి అనేక పర్యావరణ దుష్ప్రభావాలకు కారణమవుతాయి. ఇటువంటి ప్రదేశాల నుంచి వచ్చే మరో ఉపఫలం ఏమిటంటే వాయువు (ఎక్కువగా మీథేన్, బొగ్గుపులుసువాయువులతో నిండివుంటుంది), వాయురహిత స్థితిలోని కర్బన వ్యర్థాల నుంచి ఇది ఉత్పత్తి అవుతుంది. ఈ హరితగృహ వాయువు దుర్వాసన సమస్యలు సృష్టించడంతోపాటు, ఉపరితల వృక్ష జాతులను నాశనం చేస్తుంది.

 
భూసమ్మర్థనం చేస్తున్న వాహనం.

అయోగ్య ప్రదేశాల్లో వ్యర్థాలను నింపిన తరువాత మురుగుని నివారించేందుకు ఆధునిక పద్ధతుల్లో మట్టి లేదా ప్లాస్టిక్ పూత పదార్థాన్ని వాడుతున్నారు. పారవేసిన వ్యర్థాల సాంద్రత మరియు స్థిరత్వాన్ని పెంచేందుకు సాధారణంగా వాటిని ఖనీభవనం చేస్తారు మరియు రోగాలను సంక్రమింపజేసే చిన్నజీవులు (చిట్టెలుకలు, ఎలుకలు వంటివి) ఆకర్షించబడకుండా వాటిని కప్పుతారు. ఖనీభవన వాయువు సేకరించేందుకు అనేక వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రదేశాలు వాయు వెలికితీత వ్యవస్థలను కూడా కలిగివున్నాయి. ఖనీభవన ప్రదేశాల నుంచి సచ్ఛిద్ర పైపుల ద్వారా వాయువును బయటకు తీసుకొస్తారు, దానిని వాయు యంత్రంలో మండించి విద్యుచ్ఛక్తి పుట్టిస్తారు.

భస్మీకరణ ప్రక్రియసవరించు

 
వియన్నాలోని ప్లోట్‌స్పిటెలౌ భస్మీకరణ ప్లాంటు.

వ్యర్థ పదార్థాలను దహనం చేయడం ద్వారా వాటిని తొలగించే పద్ధతిని భస్మీకరణం అంటారు. భస్మీకరణం మరియు ఇతర అధిక ఉష్ణోగ్రత వ్యర్థ నిర్వహణ వ్యవస్థలను కొన్నిసార్లు ఉష్ణ చర్యగా వర్ణిస్తారు. భస్మీకారులు వ్యర్థ పదార్థాలను ఉష్టం, వాయువు, ఆవిరి మరియు బూడిదగా మారుస్తాయి.

భస్మీకరణ ప్రక్రియ వ్యక్తులచే చిన్నతరహాలో మరియు పరిశ్రమలచే భారీఎత్తున నిర్వహించబడుతుంది. ఘన, ద్రవ, వాయు వ్యర్థాలను తొలగించేందుకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. కొన్ని ప్రమాదకర వ్యర్థాలును (ఉదా. జీవ సంబంధమైన వైద్య వ్యర్థాలు) నాశనం చేసేందుకు వాడుకలో ఉన్న పద్ధతిగా ఇది గుర్తింపు పొందింది. వ్యర్థాలను నాశనం చేసేందుకు భస్మీకరణ పద్ధతిని ఉపయోగించడం వలన వాయురూపంలో కాలుష్యకారకాలు వెలువడుతున్నాయి, దీనిపై వివాదం నెలకొనివుంది.

తక్కువ భూభాగం ఉన్న జపాన్ వంటి దేశాలు సాధారణంగా భస్మీకరణ పద్ధతినే వ్యర్థ పదార్థాల నిర్వహణకు వాడుతున్నాయి, వ్యర్థాల ఖనీభవన ప్రదేశాలతో పోలిస్తే, భస్మీకరణ కేంద్రాల ఏర్పాటుకు చాలా తక్కువ స్థలం మాత్రమే అవసరమవుతుంది. కొలిమిలో లేదా బాయిలర్‌లో వ్యర్థాలను కాల్చడం ద్వారా ఉష్ణం, ఆవిరి మరియు/లేదా విద్యుత్‌ను పుట్టించే కేంద్రాలను పిలిచేందుకు వ్యర్థాలు-నుండి-శక్తి (WtE) లేదా వ్యర్థాలు-నుంచి-శక్తి (EfW) అనే పదాలు బాగా వాడుకలో ఉన్నాయి. భస్మీకారిణిలో దహనచర్య ఎల్లప్పుడూ నిర్దిష్ట పద్ధతిలో ఉండదు మరియు భస్మీకార నిల్వల నుంచి వెలువడే వాయురూపంలోని ఉద్గారాల్లో సూక్ష్మ-కాలుష్యకారకాలు ఉంటాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా డైయాక్సిన్స్ వంటి నిరంతర కర్బన ఉద్గారాలపై ఆందోళన నెలకొనివుంది, ఇది భస్మీకారిలోనే ఏర్పడే అవకాశం ఉంది మరియు భస్మీకారి చుట్టుప్రక్కల ఇది వెంటనే తీవ్రమైన పర్యావరణ దుష్ప్రభావాలకు కారణం కావొచ్చు. మరోవైపు ఈ పద్ధతిలో ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని శక్తిగా ఉపయోగించవచ్చు.

పునర్వినియోగ పద్ధతులుసవరించు

సాధారణంగా సేకరించలేనివి అయినప్పటికీ, PVC, LDPE, PP మరియు PS (రెసిన్ ఐడెంటిఫికేషన్ కోడ్‌ను చూడండి)లు పునర్వినియోగంలోకి తీసుకురావొచ్చు. ఈ పదార్థాలు సాధారణంగా ఒకేరకమైన పదార్థం నుంచి వస్తాయి, అందువలన వీటిని కొత్త ఉత్పత్తులుగా పునర్వినియోగంలోకి తీసుకురావడం చాలా సులభం. సంక్లిష్ట ఉత్పత్తులను పునర్వినియోగంలోకి తీసుకురావడం (ఉదా. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు) చాలా కష్టం, ఎందుకంటే వీటిని ఊడదీయడం మరియు వేరుచేయడం అవసరమవుతుంది.

జీవ సంబంధ పునఃసంవిధానంసవరించు

 
ఒక క్రియాశీల పచ్చిఎరువు కుప్ప

చెట్ల వస్తువులు, ఆహార పదార్థాలు మరియు కాగితపు ఉత్పత్తుల వంటి ప్రకృతిపరమైన కర్బన వ్యర్థ పదార్థాలను జీవ సంబంధ పరివర్తన మరియు పచన ప్రక్రియలను ఉపయోగించవచ్చు, వీటి ద్వారా కర్బన పదార్థాలను విచ్ఛిన్నం చేయవచ్చు. దీని ఫలితంగా ఏర్పడిన కర్బన పదార్థాన్ని వ్యవసాయ లేదా భూదృశ్యావసరాలకు రక్షక కవచం లేదా పచ్చిఎరువుగా పునర్వినియోగిస్తారు. అదనంగా, ఈ ప్రక్రియలో వచ్చే వ్యర్థ వాయువు (మీథేన్ వంటి)ను సంగ్రహించి విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించవచ్చు. కర్బన పదార్థం యొక్క సహజ విచ్ఛిన్న ప్రక్రియను నియంత్రించడం మరియు వేగాన్ని వృద్ధి చేయడమే వ్యర్థ పదార్థాల నిర్వహణలో జీవ సంబంధ సంవిధానం యొక్క ఉద్దేశం.

సాధారణ గృహ పచ్చిఎరువు కుప్పుల నుంచి పారిశ్రామిక స్థాయిలో మిశ్రమ వ్యర్థాలను మూసివున్న- పాత్రల్లో పచనం చేయడం (యాంత్రిక జీవ సంబంధ చర్యను చూడండి) వరకు సంక్లిష్టతలను బట్టి అనేక రకాల పరివర్తన మరియు పచన పద్ధతులు మరియు సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులో ఉన్నాయి. జీవ సంబంధ పరివర్తన పద్ధతులను వాయుసహిత, వాయురహిత పద్ధతులుగా విభజించారు, ఈ రెండు పద్ధతులు వినియోగంలోనే ఉన్నాయి.

పరివర్తనం ద్వారా వ్యర్థ పదార్థాల నిర్వహణకు ఉదాహరణ కెనడా, టొరంటోలోని గ్రీన్ బిన్ కార్యక్రమం, ఇక్కడ గృహ సంబంధ కర్బన వ్యర్థాలను (వంటగది వ్యర్థాలు మరియు కత్తిరించిన చెట్ల వ్యర్థాలు) సేకరించి ఒక ప్రత్యేకమైన పాత్రలో ఉంచి కుళ్లబెడతారు.

శక్తి పునరుద్ధరణసవరించు

దస్త్రం:Haase Lubeck MBT.JPG
2007, జర్మనీలోని ల్యూబెక్ యాంత్రిక జీవ చర్యా కేంద్రంలో వాయురహిత పచన ప్రక్రియ నిర్మాణం

వ్యర్థ ఉత్పత్తుల నుంచి వచ్చే శక్తిని నేరుగా ప్రత్యక్ష దహన ఇంధనంగా వాడుతూ లేదా పరోక్షంగా వాటిని సంవిధాన పరచడం ద్వారా మరో రకమైన ఇంధనంగా మార్చి నియంత్రణలోకి తీసుకురావొచ్చు. ఉష్ట చర్య ద్వారా పునర్వినియోగ ప్రక్రియ వండేందుకు లేదా వేడిచేసేందుకు వ్యర్థాలను ఇంధన వనరుగా వాడటంతో ప్రారంభమై, బాయిలర్లు ఆవిరిని, టర్బైన్‌లో విద్యుత్‌ను పుట్టించేందుకు ఇంధనంగా కూడా వ్యర్థాలనే వాడటం వరకు సాగుతుంది. పైరాలసిస్ (ఉష్టచర్య వలన పదార్థం రూపాంతరణ చెందే ప్రక్రియ) మరియు గ్యాసిఫికేషన్ (పదార్థాన్ని వాయురూపంలోకి మార్చే ప్రక్రియ) రెండూ ఉష్ణ చర్యకు సంబంధించిన రూపాలు, ఈ ప్రక్రియల్లో పరిమిత ఆక్సిజన్ లభ్యతతో వ్యర్థ పదార్థాలను అత్యధిక ఉష్ట్రోగతల వద్దకు మండిస్తారు. అధిక పీడనం కింద మూసివేసిన పాత్ర వంటి నిర్మాణంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. పైరాలసిస్ ఘన వ్యర్థాలను ఘన, ద్రవ, వాయు రూపాల్లోకి మార్చుతుంది. ద్రవ మరియు వాయు రూపాలను మండించడం ద్వారా శక్తి పుడుతుంది లేదా వాటిని ఇతర ఉత్పత్తులుగా శుద్ధి చేస్తారు. ఘన అవశేషాలను మరింత శుద్ధి చేసి ఉత్తేజిత కర్బనం వంటి ఉత్పత్తులగా మారుస్తారు. కర్బన పదార్థాలను నేరుగా కృత్రిమవాయువుగా (కార్బన్ మోనాక్సైడ్ మరియు ఉదజని కలిసివుండే సిన్‌గ్యాస్) మార్చేందుకు గ్యాసిఫికేషన్ మరియు అధునాతన ప్లాస్మా ఆర్క్ గ్యాసిఫికేషన్ ప్రక్రియలను ఉపయోగిస్తారు. తరువాత ఈ వాయువును మండించి విద్యుత్ మరియు ఆవిరిని పుట్టిస్తారు.

తొలగించడం మరియు తగ్గింపు పద్ధతులుసవరించు

వ్యర్థ పదార్థాలు ఏర్పడకుండా నిరోధించడం కూడా వ్యర్థ పదార్థాల నిర్వహణలో ముఖ్యమైన పద్ధతి, దీనిని వ్యర్థాల తగ్గింపుగానూ పిలుస్తారు. వ్యర్థాలు ఏర్పడకుండా తొలగించే పద్ధతుల్లో ద్వితీయ శ్రేణి ఉత్పత్తుల పునర్వినియోగం, కొత్తవాటిని కొనకుండా పగిలిన వస్తువులను బాగు చేయించడం, పునర్వినియోగ లేదా పునఃస్థాపన చేయగల ఉత్పత్తులను రూపొందించడం (ఉదా. ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగులకు బదులుగా నూలు బ్యాగులు), వాడిపారేసే ఉత్పత్తులను ఉపయోగించకుండా వినియోగదారులను ప్రోత్సహించడం (ఉదా. వాడిపారేసే కత్తులు), డబ్బాలు, ప్యాకేజీల నుంచి ఆహార/ద్రవ శేషాలను తొలగించడం, ...[2] మరియు ఒక ప్రయోజనాన్ని సాధించేందుకు సాధ్యమైనంతర తక్కువ పదార్థాన్ని ఉపయోగించడం (ఉదాహరణకు, పానీయాల కోసం సాధ్యమైనంత తక్కువ బరువుతో డబ్బాలను తయారు చేయడం) ఉన్నాయి.

వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు రవాణాసవరించు

 
ఉత్తర అమెరికాలో వ్యర్థాలను తీసుకెళుతున్న విలక్షణమైన ఒక వాహనం.

వివిధ దేశాలు మరియు ప్రాంతాల మధ్య వ్యర్థ సేకరణ పద్ధతుల్లో చాలా తేడాలు ఉన్నాయి. గృహ వ్యర్థ సేకరణ సేవలను తరచుగా స్థానిక ప్రభుత్వ అధికార యంత్రాంగాలు లేదా ప్రైవేట్ సంస్థలు అందజేస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో, అధికారికంగా వ్యర్థ సేకరణ వ్యవస్థలు అందుబాటులో లేవు. వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలకు ఉదాహరణలు:

 • ఆస్ట్రేలియాలో వ్యర్థాలను సేకరించి, పారవేసేందుకు వ్యర్థాల సేకరణ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో ప్రతి పట్టణ నివాసానికి మూడు డబ్బాలను అందజేస్తారు: ఒకదానిని పునర్వినియోగానికి పనికివచ్చే వ్యర్థాల కోసం, మరోదానిని సాధారణ వ్యర్థాలకు మరియు మూడోదానిని తోట వస్తువులకు- విజ్ఞప్తి మేరకు పట్టణపాలక సంస్థ ఈ డబ్బాను అందజేస్తుంది. అంతేకాకుండా, అనేక గృహాలకు ఎరువు డబ్బాలు ఉంటాయి; అయితే వీటిని పట్టణపాలక సంస్థ అందజేయదు. పునర్వినియోగ ప్రక్రియను ప్రోత్సహించేందుకు, పట్టణపాలక సంస్థలు పెద్ద రీసైకిల్ డబ్బాలను అందజేస్తాయి, ఇవి సాధారణ చెత్తడబ్బాల కంటే పెద్దవిగా ఉంటాయి. పట్టణపాలక, వ్యాపార, పారిశ్రామిక, నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాలతో గొయ్యిలను భర్తీ చేస్తారు, కొన్నింటిని పునర్వినియోగానికి ఉపయోగిస్తారు. గృహ వ్యర్థాలను వేరు చేస్తారు: పునర్వినియోగానికి పనికొచ్చే వాటిని సేకరించి కొత్త ఉత్పత్తులు తయారు చేస్తారు మరియు సాధారణ వ్యర్థాలతో గొయ్యిలను పూడ్చుతారు. ABS ప్రకారం, గృహ వ్యర్థాల పునర్వినియోగం 99 శాతానికి (2003 సర్వే) చేరుకోగా, 1992లో ఇది 85 శాతం వద్దే ఉండటం గమనార్హం. దీనిని బట్టి ఆస్ట్రేలియన్లు వ్యర్థాల పునర్వినియోగానికి బాగా అలవాటు పడినట్లు తెలుస్తోంది. 2002-03లో ఉత్పత్తి అయిన మొత్తం వ్యర్థాల్లో '30% పట్టణపాలక వ్యర్థాలు, 44% వ్యాపార, పారిశ్రామిక వ్యర్థాలు మరియు 57% నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు' పునరుపయోగించబడ్డాయి. వ్యర్థాల నుంచి శక్తిని కూడా పుట్టించారు: కొంత ఖనినీకరణ వాయువును ఇంధనం కోసం లేదా విద్యుత్ ఉత్పత్తికి సేకరించారు. వ్యర్థాలు ఉత్పత్తి చేసినందుకు గృహాలు మరియు పరిశ్రమల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు.
 • యూరోప్ మరియు ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని ఇతర ప్రదేశాల్లో, అతికొద్ది వర్గాలు ఎన్వాక్ పేరుతో యాజమాన్య సేకరణ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి, ఇందులో వ్యాక్యూమ్ సిస్టమ్ (శూన్య వ్యవస్థ) ఉపయోగించి చిన్న భూగర్భ సొరంగాల ద్వారా వ్యర్థాలను సేకరిస్తారు.
 • కెనడా పట్టణ ప్రాంతాల్లో వ్యర్థాలను పారవేసేందుకు ఎక్కువగా వ్యర్థాల సేకరణ పద్ధతినే వాడతారు, ఇక్కడ వ్యర్థాలు మరియు/లేదా పునరుపయోగ వ్యర్థాలు మరియు/లేదా కర్బన వ్యర్థాలను వేరువేరుగా సేకరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో తరుచుగా ప్రజలే తమ వ్యర్థాలను బదిలీ కేంద్రానికి తరలిస్తారు. ఇక్కడ సేకరించిన వ్యర్థాలను తరువాత ప్రాంతీయ భూ ఖనినీకరణ ప్రాంతానికి రవాణా చేస్తారు.
 • తైపీలో గృహాలు, పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వ్యర్థాలకు నగరపాలక యంత్రాంగం ఛార్జీలు వసూలు చేస్తుంది.ఇక్కడ వ్యర్థాలను నగర మండలి మాత్రమే సేకరిస్తుంది, అంతేకాకుండా ప్రభుత్వం జారీ చేసిన రబ్బరు బ్యాగుల్లోనే వ్యర్థాలను ఉంచాలి. ఈ విధానం వలన వ్యర్థాల ఉత్పత్తిని విజయవంతంగా తగ్గించడంతోపాటు, పునరుపయోగ రేటును పెంచగలిగారు.

సాంకేతిక విధానాలుసవరించు

సేకరించిన వ్యర్థాల అంచనా లేదా సమాచారాన్ని పుస్తకంలో ఎక్కించాల్సిన అవసరం లేకుండా మెరుగైన నిర్వహణకు ఆస్కారం ఉండే RFID టాగ్‌లు, GPS మరియు సమగ్ర సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలను ఉపయోగించడంలో వ్యర్థ పదార్థాల నిర్వహణ పరిశ్రమ వెనుకబడి ఉంది.

 • RFID టాగ్‌ల వంటి సాంకేతిక విధానాలను ఇప్పుడు వ్యర్థాల సమాచారాన్ని సేకరించేందుకు వాడుతున్నారు, ఇవి రీసైక్లింగ్ వ్యర్థాలు లేదా అంటువంటి డబ్బాల వినియోగాన్ని పరిశీలించే సమయంలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.
 • వినియోగదారుల విజ్ఞప్తుల ప్రాతిపదికన వ్యర్థాలను సేకరించేందుకు GPS ట్రాకింగ్ పద్ధతి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది.
 • వ్యర్థాల సేకరణ కార్యకలాపాల కోసం చేపట్టే చర్యలకు సంబంధించిన ఈ సమాచారాన్ని సంకలనం చేసేందుకు సమగ్ర సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలు ఉపయోగపడతాయి.
 • గృహ సేవలు మరియు వ్యర్థాల కలుషితమవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో OH&S కారణాలకు సాధారణంగా వెనుక దృశా కెమేరాలను ఉపయోగిస్తున్నారు మరియు వీడియో రికార్డింగ్ పరికరాలు విస్తృతంగా వినియోగంలోకి వస్తున్నాయి.

వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులుసవరించు

దేశాలు మరియు ప్రాంతాల మధ్య వినియోగంలో వైవిధ్యం ఉన్న అనేక వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులు అమల్లో ఉన్నాయి. కొన్ని సాధారణ, విస్తృత వినియోగంలో ఉన్న పద్ధతులు:

 
వర్థాల సోపానక్రమం యొక్క రేఖాచిత్రం.
 • వ్యర్థాల సోపానక్రమం- వ్యర్థాల సోపానక్రమాన్ని "3 Rs" తగ్గింపు, పునర్వినియోగం మరియు పునరుపయోగంగా పిలుస్తారు, ఇందులో వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యూహాలు వ్యర్థాల తగ్గింపులో వారి వాంఛనీయత ప్రకారం వర్గీకరించబడతాయి. అనేక వ్యర్థాల తగ్గింపు వ్యూహాలకు వ్యర్థాల అధిక్రమ పద్ధతి ఇప్పటికీ మూలస్తంభంగా ఉంది. ఉత్పత్తుల నుంచి గరిష్ఠ ప్రాయోగిక ప్రయోజనాలు పొందుతూ, వ్యర్థాల పరిమాణాన్ని కనిష్ఠపరచడమే వ్యర్థాల అధిక్రమం యొక్క లక్ష్యం.
 • ఉత్పత్తిదారు బాధ్యత విస్తరించడం- ఉత్పత్తుల మొత్తం జీవితకాలానికి సంబంధించిన (ఉత్పత్తుల జీవితకాలం ముగిసిన తరువాత దానిని పారవేసేందుకు అయ్యే వ్యయాలతోపాటు) అన్ని వ్యయాలను ఉత్పత్తి మార్కెట్ ధరతో సమగ్రపరచడాన్ని ప్రోత్సహించేందుకు ఉత్పత్తిదారు బాధ్యతను విస్తరించే (EPR) వ్యూహాన్ని తయారు చేశారు. ఉత్పత్తుల జీవితకాలం మొత్తానికి మరియు విపణిలో ప్రవేశపెట్టిన ప్యాకేజింగ్‌కు బాధ్యత వహించేలా చేయడమే విస్తరించబడిన ఉత్పత్తిదారు బాధ్యత వ్యూహం ఉద్దేశం. దీనర్థం ఏమిటంటే ఉత్పత్తిదారు, దిగుమతి మరియు/లేదా ఉత్పత్తులు విక్రయించే కంపెనీలు ఉత్పత్తుల తయారీ సమయంలోనే కాకుండా, వినియోగకాలంలోనూ వాటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
 • కాలుష్యకారకుల చెల్లింపు సూత్రం- కాలుష్యకారకులు చెల్లింపు సూత్రం ప్రకారం పర్యావరణంపై వ్యర్థాలు చూపించే ప్రభావానికి కాలుష్యం చేసే వ్యక్తులు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించి, వ్యర్థాలను పారవేసేందుకు దాని ఉత్పత్తిదారు డబ్బు చెల్లించాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుంది.

విద్య మరియు అవగాహనసవరించు

వనరుల నిర్వహణ యొక్క అంతర్జాతీయ దృష్టికోణం నుంచి వ్యర్థాలు మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగంలో విద్య మరియు అవగాహన ఎంతో ముఖ్యం. వేగంగా, పెద్ద పరిమాణంలో నిరంతరం జరుగుతున్న పర్యావరణ కాలుష్యం మరియు సహజ వనరుల పతనం మరియు క్షీణతను నిరోధించేందుకు చేసిన తీర్మానమే టాలోయిరెస్ తీర్మానం. స్థానిక, ప్రాంతీయ, అంతర్జాతీయ వాయు కాలుష్యం; ప్రమాదకర వ్యర్థాలు పెరిగిపోతుండటం మరియు వ్యాప్తి చెందుతుండటం; అడవులు, భూమి మరియు నీరు నాశనమవుతుండటం మరియు క్షీణిస్తుండటం; ఓజోన్ పొర క్షీణత మరియు "హరితగృహ" వాయువుల ఉద్గారాలు మానవుల మరియు వేలాది మంది జీవరాశుల మనుగడకు, భూమి సమగ్రత మరియు దాని జీవవైవిధ్యం, దేశాల భద్రత, భవిష్యత్ తరాల వారసత్వానికి ముప్పుగా పరిణమించాయి. అనేక విశ్వవిద్యాలయాలు పర్యావరణ నిర్వహణ మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా, ఉదా. విశ్వవిద్యాలయ వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రాజెక్ట్, టాలోయిరెస్ తీర్మానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. ఇందులో విశ్వవిద్యాలయ మరియు వృత్తి విద్యను పలు సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి, ఉదా. WAMITAB మరియు చార్టర్డ్ ఇన్‌స్టిట్యూషన్ వేస్టేజ్ మేనేజ్‌మెంట్. అనేక సూపర్‌మార్కెట్‌లు వినియోగదారులు కొనుగోలు చేసి ఉపయోగించిన డబ్బాలను పారవేసేందుకు వారి రివర్స్ వెండింగ్ మెషిన్లు ఉపయోగించే విధంగా ప్రోత్సహిస్తున్నాయి, వినియోగదారులకు రీసైక్లింగ్ ఫీజుల నుంచి కొంత డబ్బును తిరిగి చెల్లిస్తున్నాయి. టోమ్రా మరియు ఎన్విప్కో వంటి బ్రాండ్‌లు ఇటువంటి మిషిన్లను తయారు చేస్తున్నాయి.

ఇవి కూడా చూడండిసవరించు

సూచనలుసవరించు

గమనికలుసవరించు

 1. "What is Waste Management?". 2009. మూలం నుండి 2009-11-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-11. Cite web requires |website= (help)
 2. వ్యర్థాలను తగ్గించేందుకు ఆహార పదార్థాల మిగులును తొలగించడం

బాహ్య లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూస:Waste management