వ్యాఘ్రేశ్వరస్వామి దేవాలయం
వ్యాఘ్రేశ్వరస్వామి దేవాలయం తూర్పు గోదావరి జిల్లాలోని, అంబాజీపేట మండలంలో పుల్లేటికుర్రు గ్రామంలో దేవాలయం ఉంది.
వ్యాఘ్రేశ్వరస్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E |
పేరు | |
ప్రధాన పేరు : | వ్యాఘ్రేశ్వరస్వామి దేవాలయం |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | తూర్పు గోదావరి |
ప్రదేశం: | అంబాజీపేట పుల్లేటికుర్రు |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | వ్యాఘ్రేశ్వరస్వామి దేవాలయం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
స్ధల పురాణం
మార్చుపూర్వం అభయారణ్య ప్రాతం అయిన ఈ ప్రాతంలో ఒక బ్రాహ్మణుడు నిత్యం పరమశివుని అత్యంత భక్తి శ్రధ్దలతో పూజిస్తుండేవాడు.ఒకరోజున ఆ బ్రాహ్మణున్ని అరణ్యంలో ఒక పులి (వ్యాఘ్రం) తరమసాగింది.భయపడి ఆ బ్రాహ్మణుడు దిక్కు తోచని స్థితిలో తను రోజూ అర్చించే ఆ పరమశివున్ని నమ్ముకుని ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడే ఉన్న ఒక బిల్వ వృక్షం (మారేడు చెట్టు) ఎక్కాడు.పులి మారేడు చెట్టు క్రింద ఆ బ్రాహ్మణుని కొరకు కాచుకుని కుర్చుంది. దీంతో ఏమి చెయ్యాలో తోచక ఆ మారేడు చెట్టు యొక్క ఆకులు ఒక్కటొక్కటీ తెంపి పరమశివుని స్మరిస్తూ ఆ పులిపై వేయసాగాడు. కొంతసేపటికి ఆ మారేడు ఆకులతో ఆ పులి కప్పబడి కదలకుండా అలానే ఉంది.దీంతో ఆ పులి నిద్రిస్తుందేమో అని ఆ బ్రాహ్మణుడు భావించి మెల్లిగా చెట్టు నుండి క్రిందికి దిగి అగ్రహారం లోకి వెళ్ళి తన తోటి వారికి ఈ విషయం చెప్పి పులిని చంపడానికి కర్రలు, బరిసెలతో అక్కడికి వచ్చాడు.అయితే ఎంతకీ పులి ఆ మారేడు ఆకులనుండి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అక్కడి వారు ఆ అకులను తొలగించి చూడగా ఆ అకుల క్రింద శివలింగం కనిపించెను. పులి శివలింగముగా మారిన ప్రాంతాన్ని వ్యాఘ్రేశ్వరము అని అక్కడ స్వయంభూగా వెలసిన ఆ శివుని వ్యాఘ్రేశ్వరుడు అనే పేరు వచ్చింది. పులి వేటాడిన ఊరు కనుక ఆ ఊరుకు పులి వేట ఊరు అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే పుల్లేటికుర్రుగా రూపాతరం చెందింది.[1]
మదనగోపాలస్వామి దేవాలయం
మార్చుశ్రీ వ్యాఘ్రేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలోనే వున్న మరో ఆలయంలో మదనగోపాలస్వామి ఉంది.నాలుగు వందల ఏళ్ళక్రితం ప్రతిష్ఠించబడిన శ్రీ మదనగోపాలస్వామి ఈ నాటికీ భక్తుల్ని అలరించడం విశేషం.స్వామి వారి ఆలయంలో శ్రీ విఘ్నేశ్వరుడు బాలాత్రిపురసుందరి కొలువై భక్తులకు దర్శనం ఇస్తారు.
ఉత్సవాలు
మార్చుప్రతి సంవత్సరం మహాశివరాత్రిన, దేవీనవరాత్రులు వైభవంగా జరుగుతాయి.
మూలాలు
మార్చు- ↑ ఎన్. ఎస్, నాగిరెడ్డి (2003). తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి.