శంకరా నాదశరీరాపరా

(శంకరా నాదశరీరా పరా నుండి దారిమార్పు చెందింది)

శంకరా నాదశరీరాపరా 1979లో విడుదలైన శంకరాభరణం చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు వేటూరి సుందరరామమూర్తి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. కె.వి.మహదేవన్ సంగీతం అందించిన ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడాడు.[1]

"శంకరా నాదశరీరాపరా"
శంకరా నాదశరీరాపరా పాటలోని దృశ్యం
రచయితవేటూరి సుందరరామమూర్తి
సంగీతంకె.వి.మహదేవన్
సాహిత్యంవేటూరి సుందరరామమూర్తి
ప్రచురణశంకరాభరణం (1979)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
చిత్రంలో ప్రదర్శించినవారుజె.వి. సోమయాజులు

పాట నేపథ్యం

మార్చు

బ్రాహ్మణకులంలో పుట్టి సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన మంజుభార్గవిని శంకరశాస్త్రి ఇంటికి తీసుకొస్తాడు. ఒకసారి శివాలయంలో తాను చేస్తున్న కచేరికి మంజుభార్గవిని తీసుకొనిపోయి, తనతోపాటు వేదిక మీద కూర్చోబెడుతాడు. దాంతో కోపించిన తోటి బ్రాహ్మణ కులస్తులు ఆ సభనుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఎదురుగా కనిపిస్తున్న శివుని మీద కోపంతో శంకరశాస్త్రి ఈ పాటను పాడుతాడు.

పాటలోని సాహిత్యం

మార్చు

శంకరా నాద శరీరాపరా
వేద విహారహరా జీవేశ్వరా || శంకరా ||

ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమె గానమనీ
మౌనవిచక్షణ గానవిలక్షణ రాగమె యోగమనీ || ప్రాణము నీవని ||

నాదోపాసన చేసినవాడను నీ వాడను నేనైతే
నాదోపాసన చేసినవాడను నీ వాడను నేనైతే

దిక్కరీన్ద్ర జిత హిమగిరీన్ద్ర సిత కందరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా విని తరించరా || శంకరా ||

పురస్కారాలు

మార్చు
  1. వేటూరి సుందరరామమూర్తి ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాలు -1979

మూలాలు

మార్చు
  1. సితార, పాటల పల్లకి. "వాగ్దేవి వర పారిజాతాలు...వేటూరి గీతాలు". www.sitara.net. Archived from the original on 22 December 2020. Retrieved 22 December 2020.

వీడియో లింకులు

మార్చు
  1. యూట్యూబ్ లో పాట వీడియో