శక్తి మహర్షి హిందూ పురాణాలలో ఒక మహర్షి. వశిష్ఠ మహర్షి, అరుంధతిల 100 మంది కుమారులలో మొదటివాడు. ఇతని భార్య అదృశ్యంతి, కుమారుడు పరాశరుడు.

శక్తి మహర్షి
శక్తి మహర్షి
మహాభారతంలో కల్మషపాదుడిని కలిసిన శక్తి మహర్షి (ఎడమ)
సమాచారం
కుటుంబంవశిష్ఠ మహర్షి (తండ్రి), అరుంధతి (తల్లి)
దాంపత్యభాగస్వామిఅదృశ్యంతి[1]
పిల్లలుపరాశరుడు

పురాణ కథ మార్చు

శక్తి మహర్షి గురించి మహాభారతంలో ఒక పురాణ కథ ఉంది. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన అయోధ్య నగరాన్ని పాలిస్తున్న కల్మషపాదుడు ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళి అడవిలో చాలా జంతువులను చంపుతాడు. అలసిపోయి, ఆకలితో, దాహంతో ఉన్న కల్మషపాదుడు వసిష్ఠ మహర్షి ఆశ్రమ సమీపంలో తిరుగుతూ ఉన్నాడు. కట్టెల కోసం వెలుతున్న శక్తి మహర్షి అదే మార్గంలో ఎదురుగా వచ్చాడు. శక్తి మహర్షి తల వంచుకుని తన పనిమీద తను వెళ్ళిపోతుండగా, పక్కకు తప్పకొని తనకు దారి ఇవ్వమని కల్మషపాదుడు, శక్తి మహర్షిని ఆజ్ఞాపించాడు. అప్పుడు శక్తి మహర్షి, కల్మశపాదుడితో "ఓ రాజా ఇది నా మార్గం. విధి, సంప్రదాయానికి అనుగుణంగా ఒక రాజు ఎల్లప్పుడూ బ్రాహ్మణులకు మార్గం చూపాలి" అన్నాడు. కల్మషపాదుడు రాక్షసుడిలా క్రూరంగా వ్యవహరించి శక్తి మహార్షిని చేతికర్రతో గట్టిగా కొట్టాడు. శక్తి మహర్షి ఆగ్రహంతో ఏ కారణం లేకుండానే దారిన వెడుతున్నవాణ్ణి అవమానించావు, రాక్షసుడిలా నన్ను కొట్టావు కనుక రాక్షసుడివై మాంసాహారం తింటూ జీవించు అని శపించాడు.[2][3][4]

మరణం మార్చు

శక్తి మహర్షి శాపం వల్ల రాక్షసుడిగా మారిన కల్మషపాదుడు మొదట శక్తి మహర్షిని చంపి మింగేసాడు. ఆ తరువాత, కల్మషపాదుడు వశిష్ఠ మహర్షి 100మంది కుమారులు వరుసగా చంపి తినేశాడు.[5]

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Wife of Sakti Maharsi".
  2. https://www.sacred-texts.com/hin/m01/m01179.htm
  3. "Vashista: By N. RANGANATHA SHARMA, Litent". Retrieved 2020-07-15.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Immortal India". Retrieved 2020-07-15.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Puranic encyclopaedia : a dictionary with special reference to epic and Puranic literature". archive.org. 1975. Retrieved 2020-07-15.{{cite web}}: CS1 maint: url-status (link)