శరీర నిర్మాణ శాస్త్రము

(శరీర నిర్మాణ శాస్త్రం నుండి దారిమార్పు చెందింది)

శరీర నిర్మాణ శాస్త్రము (Anatomy) జీవ శాస్త్రములో ఒక ముఖ్యమైన విభాగము. ఇది జీవం ఉన్న ప్రాణుల శరీర నిర్మాణము గురించి తెలియజేస్తుంది. దీనిలో మానవులు, జంతువులు, వృక్షాలు కొన్ని విభాగాలు. కొన్ని స్థూలనిర్మాణము తెలిపితే కొన్నిసూక్ష్మవిషయాలు కోసం సూక్ష్మదర్శిని అవసరం ఉంటుంది. వైద్య విజ్ఞానములో ఇదొక మూలస్థంభము.

Mondino dei Liuzzi, Anathomia, 1541


పెద్దల దేహాన్ని, అంతర్గత భాగముల వివరాలని గూర్చి వివరించే శాస్త్రాన్ని human anatomy అంటారు. అనాటమీ శాస్త్రాభివృద్థి నాటు పద్థతుల నుండి జంతు దేహాలను పరిశీలించడం, వైద్య పద్థతులలో నిలవ చేసిన మానవ దేహాలను పరిశీలించడం, మైక్రొస్కోప్ ద్వారా పరిశీలించడం అనే సనాతన పద్థతుల వరకూ అనేక విధాలుగా సాగింది.

విభాగాలు

మార్చు
  • మానవ శరీర నిర్మాణము (Human Anatomy) :
  • జంతువుల శరీర నిర్మాణము (Animal Anatomy) :
  • మొక్కల శరీర నిర్మాణము (Plant Anatomy) :

రకాలు

మార్చు

అనాటమీ స్థూలంగా 2 రకాలు:

  • 1) గ్రాస్ అనాటమీ (Gross Anatomy) : మన కంటికి కనిపించే శరీర భాగాల నిర్మాణము.
  • 2) మైక్రొస్కోపిక్ అనాటమీ (Microscopic Anatomy) : సూక్ష్మదర్శిని తో చూసినప్పుడు కనిపించే నిర్మాణ సంబంధమైన వివరాలు.