శాంటియాగో
శాంటియాగో లేదా శాంటియాగో డి చిలీ చిలీ దేశపు రాజధాని, అతిపెద్ద నగరం. అమెరికాస్ లో అతిపెద్ద నగరాల్లో ఒకటి. చిలీ దేశంలో జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రాంతమైన శాంటియాగో మెట్రోపాలిటన్ రీజియన్ లో మొత్తం జనాభా 70 లక్షలు. దీనికి కేంద్రబిందువైన శాంటియాగోలోనే సుమారు 60 లక్షల మంది నివసిస్తున్నారు. ఈ నగరమంతా చిలీ మధ్య లోయలోనే ఉంది. నగరం చాలా భాగం సముద్ర మట్టానికి 500-650 మీటర్ల ఎత్తులో ఉంది.
శాంటియాగో | |
---|---|
రాజధాని నగరం | |
Nickname: "ది సిటీ ఆఫ్ ది ఐలాండ్ హిల్స్" | |
Coordinates: 33°27′S 70°40′W / 33.450°S 70.667°W | |
దేశం | చిలీ |
రీజియన్ | శాంటియాగో మెట్రోపాలిటన్ రీజియన్ |
ప్రావిన్స్ | శాంటియాగో ప్రావిన్స్ |
స్థాపన | 1541 ఫిబ్రవరి 12 |
Founded by | పెడ్రో డి వాల్డివియా |
Named for | సెయింట్ జేమ్స్ |
Government | |
• ఇంటిండెంట్ | ఫెలిప్ గ్వేవెరా స్టీఫెన్స్ |
విస్తీర్ణం | |
• రాజధాని నగరం | 641 కి.మీ2 (247.6 చ. మై) |
Elevation | 570 మీ (1,870 అ.) |
జనాభా (2017) | |
• రాజధాని నగరం | 52,20,161 |
• జనసాంద్రత | 9,821/కి.మీ2 (25,436/చ. మై.) |
• Metro | 61,60,040 |
Demonym | Santiaguinos (-as) |
Time zone | UTC−4 (CLT) |
• Summer (DST) | UTC−3 (CLST) |
Postal code | 8320000 |
ప్రాంతపు కోడ్ | +56 2 |
మానవ అభివృద్ధి సూచీ (2017) | 0.874[1] – very high |
Website | అధికారిక వెబ్‌సైటు |
ఈ నగరాన్ని స్పానిష్ దండయాత్రికుడు పెడ్రో డి వాల్డివియా 1541లో స్థాపించాడు. వలసవాదుల ఆక్రమణ కాలం నుంచి ఇది చిలీకి ముఖ్యపట్టణంగా ఉంది. ఈ నగరం 19 వ శతాబ్దపు నియోక్లాసికల్ ఆర్కిటెక్చర్, వైండింగ్ సైడ్-వీధులను కలిగి ఉంది. ఇంకా ఆర్ట్ డెకో, నియో-గోతిక్, ఇతర శైలులతో నిండి ఉంది. శాంటియాగో యొక్క నగర దృశ్యం ఒంటిగా ఉన్న కొండలు, వేగంగా ప్రవహించే మాపోచో నది, పార్క్ ఫారెస్టల్, బాల్మాసెడా పార్క్ వంటి ఉద్యానవనాలతో నిండిఉంది. ఆండీస్ పర్వతాలను నగరంలోని చాలా ప్రాంతాల నుండి చూడవచ్చు. ఈ పర్వతాలు శీతాకాలంలో, వర్షం లేకపోవడం వల్ల గణనీయమైన పొగమంచు సమస్యకు దోహదం చేస్తాయి. నగర శివార్లలో ద్రాక్షతోటలు ఉన్నాయి. శాంటియాగో పర్వతాలు, పసిఫిక్ మహాసముద్రం రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్నాయి.
శాంటియాగో చిలీ సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక కేంద్రం. అనేక బహుళజాతి సంస్థల ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలకు నిలయం. చిలీ కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ శాంటియాగోలో ఉన్నాయి. కాని కాంగ్రెస్ ఎక్కువగా సమీపంలోని వాల్పారాస్సోలో కలుస్తుంది. శాంటియాగోకు బైబిల్ లో పేర్కొన్న సెయింట్ జేమ్స్ పేరు పెట్టారు. శాంటియాగో 2023 పాన్ అమెరికన్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది.[2]
మూలాలు
మార్చు- ↑ Sub-national HDI. "Area Database - Global Data Lab". hdi.globaldatalab.org (in ఇంగ్లీష్). Archived from the original on 23 September 2018. Retrieved 24 October 2018.
- ↑ Michael Pavitt (4 November 2017). "Santiago confirmed as host of 2023 Pan American Games". Inside the Games. Archived from the original on 7 November 2017. Retrieved 4 November 2017.