శాకటాయన వ్యాకరణము

పాణిని రచించిన గ్రంథము అష్టాధ్యాయి. శబ్ద శాస్త్రమును సూత్ర రూపమున బోధించి కృతకృత్యుడయిన వారిలో ఈతడే ఉత్తమోత్తముడు. వ్రాసినవి నాలుగువేల సూత్రములు. వానికి అనుకూలపడుటకు, అధికారము లనియు అనువృత్తు లనియు మరికొన్నిటిని స్వీకరించెను. అష్టాధ్యాయికి పిదప వైయూకరణులు అనేకులు పాణినీయ తంత్రమునకు వ్యాఖ్యానములు కావించిరి. అష్టాధ్యాయిలో ఉన్నవి ఉన్నట్టు సూత్రములనుంచి ఆక్రముమమున వ్యాఖ్యానములోనర్చినవారు కొందరు. విషయమంతకు ఒకవిధముగ ప్రణాళిక ఏర్పరచుకొని తదనుకూలముగ శీర్షికలను గవించి చక్కగా బోధించువారు కొందరు. ఇటువంటి వ్యాకరణము లలో ఒకటి ఈ శాకటాయన వ్యాకరణము. శాకటాయనులు ఇద్దరు కలరు. ఇతడు అర్వాచీనుడు.శ్వేతాంబర జైనుల కొరకు ఈ వ్యాకరణము ఏర్పడినది. అందు వ్యాఖ్యానములుగ అంగ భూత గ్రంథములను బట్టి ఇది అప్పటికాలకములో బహుళ ప్రచారములో నుండినటులు తెలియుచున్నది. ఆవశ్యకమును బట్టి మతాంతరులు సయితము ఈ గ్రంథమును వాడిరట.ఇందులో నాలుగు అధ్యాయములు ఉన్నాయి.అధ్యాయమునకు నాలుగేసి పాదములు. 3200 సూత్రములు ఉన్నాయి. చాలావరకు పాణినీయ సూత్రములకు సరిపోవు చున్నవట.

మూలాలు

మార్చు

1. భారతి మాస సంచిక.