శాతకర్ణి
భారతదేశంలోని దక్కను ప్రాంతాన్ని పరిపాలించిన శాతవాహన రాజులలో శాతకర్ణి (మొదటి శాతకర్ణి బ్రాహ్మి లిపి: 𑀲𑀸𑀢𑀓𑀡𑀺, సాతకసి) మూడవవాడు. ఆయన పాలన సాధారణంగా క్రీ.పూ 70-60 నాటిది.[2] అయినప్పటికీ కొంతమంది రచయితలు క్రీస్తుపూర్వం 187-177 మధ్యకాలానికి చెందిన వాడని పేర్కొన్నారు.[3]
శాతకర్ణి | |
---|---|
Satavahana King | |
పరిపాలన | 1st century BCE |
పూర్వాధికారి | Kanha |
ఉత్తరాధికారి | Satakarni II Vedasri Satisiri |
Spouse | Nayanika (Naganika) |
వంశము | Vedistri Satisisri |
రాజవంశం | Satavahana |
తండ్రి | Simuka |
జీవితచరిత్ర
మార్చుపురాణాల ఆధారంగా శాతవాహన రాజు సిముకా తరువాత ఆయన సోదరుడు కృష్ణుడు (కన్హా అని కూడా పిలుస్తారు). మత్స్య పురాణం ఆధారంగా కృష్ణుడి తరువాత మల్లకర్ణి, కానీ ఇతర పురాణాల ఆధారంగా ఆయన తరువాత శాతకర్ణి పాలనాధికారం చేబట్టి సింహాసనం అధిష్టించాడు. శాతకర్ణి నానేఘాటు గుహా శాసనం ఆయన కుటుంబ సభ్యులను జాబితా చేస్తుంది: ఇది సిముకా పేరును ప్రస్తావించింది కానీ అందులో కృష్ణుడి పేరు లేదు. దీని ఆధారంగా బహుళ చరిత్రకారులు శాతకర్ణి సిముకా కొడుకు అని తేల్చి వీరు కృష్ణుడి తరువాత వచ్చారని సూచించారు. జి. వి. రావు శాసనం రెండవ శాతకర్ణి అని నమ్ముతారు; సిముకాను శాసనంలో రాజవంశం స్థాపకుడిగా పేర్కొన్నారు.[4][5]
మత్స్య పురాణం ఆధారంగా శాతకర్ణి సుమారు 56 సంవత్సరాల సుదీర్ఘ పాలనను అనుభవించారు.[6] ఆయన పశ్చిమ మాల్వా[6] ప్రాంతాన్ని షుంగాల నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.[7]
నానెఘాటు శిలాశాసనం
మార్చునానేఘాటు శిలాశాసనం మొదటి శాతకర్ణి పాలనలో తయారు చేయబడిందని భావిస్తున్నారు.[9] ఈఈ శాసనం ఆధారంగా ఆయన అమ్గియా (అంబియా) కుటుంబానికి చెందిన మహారాఠీ త్రానకైరో కలాలయ కుమార్తె నయనికా (నాగనికా) ను వివాహం చేసుకున్నాడు.[5] ఆమె నానేఘాటు శాసనాన్ని వ్రాయించింది. దీనిలో ఆమె శాతకర్ణిని "దక్షిణపథ ప్రభువు, సార్వభౌమాధికారం చక్రం" గా అభివర్ణించింది.[6] తన సార్వభౌమత్వాన్ని ప్రకటించడానికి శాతకర్ణి రెండు అశ్వమేధయాగాలు (అశ్వమేధ) చేసినట్లు నాగనికా నానేఘాటు శాసనం సూచిస్తుంది.[10]
ఖరవేలను ఎదుర్కొనడం
మార్చుకళింగ రాజు ఖరవేల హతిగుంప శాసనం "సతకణి" లేదా "సతకమిని" అనే రాజు గురించి ప్రస్తావించింది. ఆయనను శాతకర్ణిగా గుర్తించారు. ఈ శిలాశాసనం ఒక నగరం స్వాధీనం చేసుకోవడానికి సైన్యాన్ని పంపించడం గురించి సూచించింది. ఖరవేల దాడిచేసిన ఆ నగరాన్ని "మాసికా" (మాసికనగర), "ముసికా" (ముసికనాగర) లేదా "ఆసికా" (ఆసికనాగర) అని విభిన్నంగా వివరిస్తుంది.[11]: 127 చరిత్రకారుడు అజయి మిత్రా శాస్త్రి అభిప్రాయం ఆధారంగా ఆసికా-నగరం నాగ్పూరు జిల్లాలోని ప్రస్తుత ఆడం గ్రామంలో ఉంది. అక్కడ అస్సాకాను ప్రస్తావించే ముద్ర కనుగొనబడింది.[12][13]
రెండవ సంవత్సరంలో (ఆయన), సతకామినిని పట్టించుకోకుండా పశ్చిమ ప్రాంతాలకు అశ్వికదళం, ఏనుగులు, పదాతిదళం (నారా), రథాలు (రథా) తో బలమైన సైన్యాన్ని పంపించాడు. ఆ సైన్యం కన్హా-బెమ్నాకు చేరుకున్న తరువాత ఆయన నగరం మీద విరుచుకుని పడి ముసికాలను భయాందోళనకు గురిచేసాడు. "[14]
-హతిగుంప శాసనం.
ఈ శాసనం కృష్ణుడితో లేదా కన్హా-వైంగంగ ప్రవాహంతో విభిన్నంగా గుర్తించబడిన ఒక నది గురించి కూడా ప్రస్తావించింది.[15]
శాసనం పాక్షికంగా మాత్రమే స్పష్టంగా ఉన్నందున వివిధ పరిశోధకులు శాసనంలో వివరించిన సంఘటనలను విభిన్నంగా వివరిస్తారు.
- కె.పి జయస్వాలు అభిప్రాయం ఆధారంగా ఆర్. డి. బెనర్జీ, ఖరవేల సత్కరాని మీద సైన్యాన్ని పంపారు. ఖరవేల కృష్ణ నది వరకు ముందుకు సాగిన సైన్యాన్ని పంపించాడని కృష్ణ, మూసి నదుల సంగమం (ప్రస్తుత నల్గొండ సమీపంలో) ఉన్న ముసికా నగరాన్ని బెదిరించాడని సైలేంద్ర నాథు సేను పేర్కొన్నాడు.[16]
- భగవాలు లాలు అభిప్రాయం ఆధారంగా శాతకర్ణి తన రాజ్యం మీద ఖరవేల దాడి చేయకుండా ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి గుర్రాలు, ఏనుగులు, రథాలు, మనుషులను ఖరవేలాకు తన వినయాన్ని తెలియజేస్తూ నివాళిగా పంపారు. అదే సంవత్సరంలో ఖరవేల కుసుంబ క్షత్రియుల సహాయంతో తిరిగి దాడిచేసి మాసికా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు.[17]
వారసత్వ పాలకులు
మార్చుశాతకర్ణి తరువాత ఆయన కుమారులు వేదశ్రీ (కందశ్రీ లేక స్కందశ్రీ), శక్తి-శ్రీ(సతి సిరిమాతా)లేక హకు-శ్రీ, వారి తల్లి నాయనికా ప్రతినిధులుగా పాలించారు.[5]
మూలాలు
మార్చు- ↑ CNG Coins
- ↑ Carla M. Sinopoli (2001). "On the edge of empire: form and substance in the Satavahana dynasty". In Susan E. Alcock (ed.). Empires: Perspectives from Archaeology and History. Cambridge University Press. pp. 166–168. ISBN 978-0-521-77020-0.
- ↑ Rajesh Kumar Singh (2013). Ajanta Paintings: 86 Panels of Jatakas and Other Themes. Hari Sena. pp. 15–16. ISBN 9788192510750.
- ↑ Sudhakar Chattopadhyaya (1974). Some Early Dynasties of South India. Motilal Banarsidass. pp. 17–56. ISBN 9788120829411.
- ↑ 5.0 5.1 5.2 Raychaudhuri 2006, p. 346.
- ↑ 6.0 6.1 6.2 Singh 2008, p. 382.
- ↑ Rao 1994, p. 11.
- ↑ Carla M. Sinopoli 2001, p. 168.
- ↑ Alcock, Susan E.; Alcock, John H. D'Arms Collegiate Professor of Classical Archaeology and Classics and Arthur F. Thurnau Professor Susan E.; D'Altroy, Terence N.; Morrison, Kathleen D.; Sinopoli, Carla M. (2001). Empires: Perspectives from Archaeology and History (in ఇంగ్లీష్). Cambridge University Press. p. 169. ISBN 978-0-521-77020-0.
- ↑ 10.0 10.1 Sudhakar Chattopadhyaya (1974). Some Early Dynasties of South India. Motilal Banarsidass. pp. 41–45. ISBN 978-81-208-2941-1.
- ↑ N. K. Sahu; Kharavela (King of Kalinga) (1984). Khâravela. Orissa State Museum.
- ↑ Ajay Mitra Shastri (1998). The Sātavāhanas and the Western Kshatrapas: a historical framework. Dattsons. p. 56. ISBN 978-81-7192-031-0.
- ↑ Inguva Karthikeya Sarma; J. Vara Prasada Rao (1 జనవరి 1993). Early Brāhmī Inscriptions from Sannati. Harman Publishing House. p. 68. ISBN 978-81-85151-68-7.
- ↑ Epigraphia Indica, Vol. XX
- ↑ Hasmukhlal Dhirajlal Sankalia; Bhaskar Chatterjee; Rabin Dev Choudhury; Mandira Bhattacharyya; Shri Bhagwan Singh (1989). History and archaeology: Prof. H.D. Sankalia felicitation volume. Ramanand Vidya Bhawan. p. 332. ISBN 9788185205465.
- ↑ Sailendra Nath Sen (1999). Ancient Indian History and Civilization. New Age International. pp. 176–177. ISBN 978-81-224-1198-0.
- ↑ Bhagwanlal Indraji (1885). "The Hâtigumphâ and three other inscriptions in the Udayagiri caves near Cuttack". Proceedings of the Leyden International Oriental Congress for 1883. pp. 144–180.
- ↑ Alain Daniélou (11 ఫిబ్రవరి 2003). A Brief History of India. Inner Traditions / Bear & Co. pp. 139–141. ISBN 978-1-59477-794-3.
వనరులు
మార్చు- Singh, Upinder (2008), A history of ancient and early medieval India : from the Stone Age to the 12th century, New Delhi: Pearson Longman, ISBN 978-81-317-1120-0
- Raychaudhuri, Hemchandra (2006), Political History Of Ancient India
- Sharma, Ram Sharan (1991), Aspects of Political Ideas and Institutions in Ancient India, ISBN 9788120808270
- Rao (1994), History and Culture of Andhra Pradesh: From the Earliest Times To the Present Day, Sterling publishers, ISBN 81-207-1719-8