శారదా హాఫ్‌మన్
శారదా హాఫ్‌మన్ భరతనాట్య కళాకారిణి, నాట్య గురువు.
శారదా హాఫ్‌మన్ | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | శారద |
జననం | చెన్నై, తమిళనాడు, భారతదేశం | 1929 జూన్ 14
సంగీత శైలి | నాట్యం |
వృత్తి | భరతనాట్యం కళాకారిణి |
విశేషాలు సవరించు
ఈమె 1929, జూన్ 14వ తేదీన మద్రాసులోని అడయార్ దివ్యజ్ఞానసమాజం ప్రాంగణంలో పుట్టింది.[1] ఈమె దివ్యజ్ఞాన సమాజానికి చెందిన మూడవతరం వ్యక్తి. ఈమె తాత అల్లాడి మహాదేవశాస్త్రి దివ్యజ్ఞాన సమాజం లైబ్రరీకి గ్రంథపాలకుడిగా వ్యవహరించాడు. ఈమె తండ్రి ఎం.కృష్ణన్ దివ్యజ్ఞాన సమాజం నడిపిన "ఆల్కాట్ మెమోరియల్ హరిజన స్కూల్"కు మొదటి భారతీయ హెడ్‌మాస్టర్. ఈమె 1939లో తన 10వ యేట రుక్మిణీదేవి అరండేల్ ప్రారంభించిన కళాక్షేత్రలో చేరి పి.చొక్కలింగం పిళ్ళై వద్ద నాలుగు సంవత్సరాలు భరతనాట్యం నేర్చుకొంది. కళాక్షేత్రనుండి పట్టభద్రురాలైన రెండవ వ్యక్తి ఈమె. (మొదటి వ్యక్తి రాధా బర్నియర్) ఈమె తన 14వ యేట ఆరంగ్రేటం చేసింది. ఈమె 16వ యేట కళాక్షేత్రలో రుక్మిణీదేవి అరండేల్‌కు అసిస్టెంట్‌గా చేరి 1947లో పూర్తిస్థాయి గురువుగా మారింది. ఈమె కళాక్షేత్రలో 1996 వరకు నృత్యగురువుగా అనేక మంది శిష్యులకు భరతనాట్యం నేర్పించింది. కళాక్షేత్రలో ఇంకా కొందరు శారదలు ఉండటం వల్ల ఈమె అక్కడ "చిన్నశారద"గా వ్యవహరించ బడింది.[2] ఈమె 1960లో పీటర్ హాఫ్‌మన్‌ను వివాహం చేసుకుంది. ఈమెకు కృష్ణ, గీత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈమె "కుట్రాల కురువంజి" నృత్య నాటకంలో సఖిగా, "గీతా గోవిందం"లో సఖిగా, "పాదుకా పట్టాభిషేకం"లో అప్సరసగా, "శ్రీరామ వనగమనం"లో మందరగా, "ఆండాళ్ చరితం"లో ఆండాళ్‌గా ఇంకా కళాక్షేత్ర రూపొందించిన అనేక నృత్యనాటికలలో నటించింది.
ఈమెకు అనేక పురస్కారాలు లభించాయి. వీటిలో సంగీత నాటక అకాడమీ అవార్డు, కళైమామణి పురస్కారం, నాట్యరంగం పురస్కారం, మద్రాసు సంగీత అకాడమీ వారి "సంగీత కళాచార్య" పురస్కారాలు ముఖ్యమైనవి.
మూలాలు సవరించు
- ↑ ఎడిటర్ (1 February 2009). "Sarada Hoffman In Rukmini Devi's footsteps". SRUTI.MAGAZINE (293). Retrieved 24 April 2021.
- ↑ Jayasri. "Sarada Hoffman". sweetkharacoffee. Retrieved 24 April 2021.