శార్దా రాం పిల్లౌరీ
శార్దా రాం పిల్లౌరీ (1837 సెప్టెంబరు 30[1] – 1881 జూన్ 24) హిందూ మత ప్రముఖుడు, సామాజిక సంస్కర్త, జ్యోతిష్యుడు, రచయిత. ఆయన పంజాబీ, హిందీ భాషల్లో రాసిన సాహిత్యం చాలా ప్రసిద్ధి చెందినది. ఆధునిక పంజాబీ గద్య సాహిత్య పితగా పేర్కొంటారు.[2]
జీవిత సంగ్రహం
మార్చుశార్దా రాం 1837లో జలంధర్ లోని ఫిల్లౌరీ ప్రాంతంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.[2][3] ఆయన తండ్రి జై దయాలు జ్యోతిషుడు.[2] సాధారణ చదువులు ఏమీ చదువుకోలేదు శార్దా.[1] ఏడవ ఏట మాత్రం గురుముఖీ రాయడం నేర్చుకున్నారు.[2] పదవ ఏట హిందీ, సంస్కృతం, పర్షియా భాష, జ్యోతిష్య శాస్త్రం, సంగీతం నేర్చుకున్నారు.[2] ఆ తరువాత హిందూ మత ప్రబోధకునిగా మారారు.[2][3][4]
ఆయన పుస్తకాల్లో పంజాబీ భాష, సంప్రదాయం గురించీ వివరించారు.[2][3]
1865లో శార్దా రాం మహాభారతం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల బ్రిటిష్ అధికారులు తమ ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు ఆరోపణలు తెచ్చారు.[2][3] అందువల్ల ఆయన స్వంతూరు పిల్లౌరీ నుండి కొంత కాలం దూరంగా వెళ్ళమని శిక్ష విధించారు.[2][3]
అమృత్ సర్, లాహోర్ ప్రాంతాల్లో జ్యోతిష్యం చెప్తూ తిరిగేవారు ఆయన.[2] అప్పుడే ఆయన మంచి వాసి గల జ్యోతిష్యునిగా పేరొందారు. అదే సమయంలో ఆయన హిందీ భాషలో ఎన్నో పుస్తకాలు రాశారు.[2]
హిందీలో మొదటి నవల రాసింది శార్దారమేనని ఈ మధ్యనే నిరూపింపబడింది.[2][3][5] ఆయన అమృత్ సర్ లో రాసిన భాగ్యవతి నవలే హిందీలో మొదటగా ప్రచురింపబడింది. 1888లో ఆయన చనిపోయిన తరువాత ప్రచురించారు.[2] ఆ నవలలో మహిళల అభ్యుదయం గురించి రాశారాయన. ఆ సమయానికి అదంతా చాలా అభ్యుదయకరమైన విషయం.[2][3]
శార్దా రాం 1881 జూన్ 24న లాహోర్లో చనిపోయారు.[2] Shardha Ram died on 24 June 1881 at Lahore.[2]
రచనలు
మార్చుపుస్తకం | సంవత్సరం | |
---|---|---|
సిఖన్ దే రాజ్ దీ విథై (సిక్కు రాజ్యం గురించిన కథ) [2][3] | 1866 | |
పంజాబీ బట్చీత్[2][3] | ||
ఓం జై జగదీశ్ హరే[2][3] | 1870s | |
భాగ్యవతి[2][3] | 1888లో ప్రచురింపబడింది | |
సత్య ధర్మ్ ముక్తావళి[3] | ||
శతోపదేశ్[3] | ||
Satyamrit Pravaha[3] |
Notes and references
మార్చు- ↑ 1.0 1.1 Singh Bedi, Harmohinder.
- ↑ 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 2.12 2.13 2.14 2.15 2.16 2.17 2.18 2.19 Walia, Varinda.
- ↑ 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 3.12 3.13 Maitray, Mohan.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-29. Retrieved 2016-08-05.
- ↑ Previously, Lala Sri Niwas was credited with this achievement; his Priksha Guru was written in 1902.
జీవిత సంగ్రహం
మార్చుశార్దా రాం 1837లో జలంధర్ లోని ఫిల్లౌరీ ప్రాంతంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.[1][2] ఆయన తండ్రి జై దయాలు జ్యోతిషుడు.[1] సాధారణ చదువులు ఏమీ చదువుకోలేదు శార్దా.[3] ఏడవ ఏట మాత్రం గురుముఖీ రాయడం నేర్చుకున్నారు.[1] పదవ ఏట హిందీ, సంస్కృతం, పర్షియా భాష, జ్యోతిష్య శాస్త్రం, సంగీతం నేర్చుకున్నారు.[1] ఆ తరువాత హిందూ మత ప్రబోధకునిగా మారారు.[1][2][4]