శివజలంధరయుద్ధం
చంద్రకాంత్ దర్శకత్వంలో 1977లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.
శివజలంధరయుద్ధం 1977, సెప్టెంబరు 4న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీ గంగా గౌరీశ్వరప్రొడక్షన్స్ పతాకంపై గాదే సూర్యనారాయణమూర్తి నిర్మాణ సారథ్యంలో చంద్రకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దారా సింగ్, జయశ్రీ గడ్కర్, రాంధవా ప్రధాన పాత్రల్లో నటించగా సి.రామచంద్ర, వేలూరి కృష్ణమూర్తి సంగీతం అందించాడు. "తులసీ వివాహ్" అనే హిందీ సినిమా దీనికి మాతృక. మల్లయోధుడు దారాసింగ్ ఈ సినిమాలో శివునిగా నటించాడు. అతని తమ్ముడు రాంధవా జలంధరుని వేషం ధరించాడు.[1]
శివజలంధరయుద్ధం | |
---|---|
దర్శకత్వం | చంద్రకాంత్ |
నిర్మాత | గాదే సూర్యనారాయణమూర్తి |
తారాగణం | దారా సింగ్, జయశ్రీ గడ్కర్, రాంధవా |
సంగీతం | సి.రామచంద్ర, వేలూరి కృష్ణమూర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ గంగా గౌరీశ్వరప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | సెప్టెంబరు 4, 1977 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: చంద్రకాంత్
- నిర్మాత: గాదే సూర్యనారాయణమూర్తి
- సంగీతం: సి.రామచంద్ర,వేలూరి కృష్ణమూర్తి
- నిర్మాణ సంస్థ: శ్రీ గంగా గౌరీశ్వరప్రొడక్షన్స్
మూలాలు
మార్చు- ↑ "Siva Jalandhara Yuddham (1977)". Indiancine.ma. Retrieved 2020-08-29.