శివరాజు సుబ్బమ్మ

శివరాజు సుబ్బమ్మ (1873 - 1948) భారత స్వాతంత్ర్య సమరయోధురాలు.[1]

శివరాజు సుబ్బమ్మ

జీవిత విశేషాలు

మార్చు

శివరాజు సుబ్బమ్మ 1873 సంవత్సరంలో వెలిచేరు కరణం గారింటిలో జన్మించింది. లక్ష్మీనారాయణను వివాహం చేసుకుంది. రాజమండ్రిలోని టి.నగర్‌లో నివాసం ఉండేది. ఆమె రాజమండ్రిలో శాసనోల్లంఘనోద్యమం లో పాల్గొని 1932 జనవరి 27 నుండి 6 నెలల పాటు వెల్లూరులో జైలుశిక్షను అనుభవించింది. జైలులో స్త్రీ ఖైదీలకు సత్సంగ కార్యక్రమాలు నిర్వహించేదని వీరితో పాటు శిక్ష పొందిన హైద్రాబాదు మాజీ మంత్రి సంగం లక్ష్మీబాయమ్మ రాసింది. ఆమె జైలులో ఉన్న సమయంలో అక్కడి వారికి స్వాతంత్ర్య పోరాటంపై ఉపన్యాసాలిచ్చేది.[2] శ్రద్ధానంద ఘాట్‌లో దువ్వూరి సుబ్బమ్మ గారితో కల్సి, బ్రిటిష్ వారిని నిర్భయంగా విమర్శించేది. ఆమె నిస్వార్థ, నిరాడంబర జీవి. నిత్యం ఖద్దరు దుస్తులు ధరించేది. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేసింది. శివరాజు సుబ్బమ్మ తన బంధువులు లేదా స్నేహితుల ఇళ్ళలో ఏదైనా వివాహాలకు వెళ్ళినప్పుడు, ఆ ఫంక్షన్ లో ఆమె భాగవతం చదివి దాని అర్ధాన్ని చెబుతుండేది. అది విన్న వ్యక్తులు కొంత డబ్బు ఇచ్చేవారు, ఆమె ఆ డబ్బును పేద ప్రజలకు విరాళంగా ఇచ్చేది.[3] ఆచరణయోగ్యమైన వైరాగ్య ధోరణి ఆమెలో ఉండేది.[4]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె లక్ష్మీనారాయణను వివాహం చేసుకొన్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు డాక్టరు వెంకటరామారావు స్వాతంత్ర్య సమరయోధుడు, మునిసిపల్ కౌన్సిలర్. అతను జాతీయ పాఠశాలను కార్యదర్శిగా చిరకాలం సేవ చేసాడు. రెండవ కొడుకు సూర్యప్రకాశరావు, కుమార్తె తురగా రామలక్ష్మమ్మ.

ఆమె 1948లో మరణించింది.

మూలాలు

మార్చు
  1. "రాజమండ్రి వెబ్ సైటులో శివరాజు సుబ్బమ్మ". Archived from the original on 2013-06-30. Retrieved 2013-03-18.
  2. "మన రాజమండ్రి ప్రత్యేకత - Hamara.city". tenali.hamara.city. Archived from the original on 2020-06-25. Retrieved 2020-06-22.
  3. amy polinati (2016-03-06). "Andhra Women in". {{cite journal}}: Cite journal requires |journal= (help)
  4. స్వాతంత్ర్య సమర ఆంధ్ర వీరవనితలు, యాతగిరి శ్రీరామ నరసింహారావు, ముద్రణ:సెప్టెంబరు 2016, ఎమెస్కో ప్రచురణ