ప్రధాన మెనూను తెరువు

శివశ్రీ శాతకర్ణి

శివశ్రీ శాతకర్ణి పులమాయి అనంతరము రాజ్యభారమును వహించి క్రీ.శ.170 నుండి 177 వరకు ఏడేండ్లు పాలన చేశాడు. ఇతడును గౌతమీ పుత్రశాతకర్ణి పుత్రునకు వాసిష్ఠీ రాణికి జన్మించాడు అగుటవలన పులమాయి సోదరుడు కావలయును. వసిష్ఠీ పుత్రకుడును శాతకర్ణినామధారుడును అగుటచే ఈతడే మహాక్షేత్రపరుద్రదమమని అల్లుడు కావచ్చును.అట్లగుట రుద్రదమనునిచే రెండుసార్లు ఓడింపబడినవాడు ఈతడే అయియుండవలెను. గుజరాతులోని జునారు అందు రుద్రమనుని శాసనము అనుసరించి ఆతడు దక్షిణాపధరాజగు శాతకర్ణిని రెండుమారులు జయించి, అకరావంతి, అపరాంత, అనూప, సూరాష్ట్ర దేశములను లాగికొని మాహాక్షేత్రప బిరుదము వహించినట్లును, తిరిగి స్వాతంత్ర్య రాజ్యము ప్రతిష్ఠించినట్లును తెలియుచున్నది.

ఇతని కాలమునాటి శాసనములు కన్హేరి, అమరావతి ప్రాంతములందు కనబడుచున్నవి. కన్హేరి శాసనములలో ఒకటి ఈతని రాణిదిగా నున్నది. శ్రీశివమాకశాత అను అమరావతి శాసన మీశివశ్రీదైయుండవచ్చును. ఇతనికి వేదశ్రియను మరియొక పేరుండినట్లును, వేదశ్రీ అనువాడు పవత్రములైన ఆహుతులను సమర్పించిననెడు నానాఘట్ట శాసన మాతనిదై యుండునట్లును తెలియుచున్నది. శివశ్రీ వేద సంపత్తుగలవాడై యుండిన కారణమున వేదశ్రీ అను పేరు వచ్చినట్లు ఆంధ్రచరిత్రకారుల అభిప్రాయము. నానా ఘట్ట శాసనములో ఈ వేదశ్రీ తన తండ్రిని అంగీయకులవర్ధను డని పేర్కొనినాడు.

ఈశివశ్రీ శైవమతాధిక్యమును కలిగియుండిన బ్రాహ్మణమతమున అవలంబించిన వాడైనని బౌద్ధులను, మిగతా బ్రాహ్మణులను తండ్రికివలెనే సమానదృష్టితో చూచినవాడు.ఈ ఆంధ్రరాజులు తల్లులు బ్రాహ్మణమత అవలంబించిన శకరాజులయు, పహ్లవరాజులయు పుత్రికలగుటచె ఆంధ్రరాజులు కూడా కడపటివారు బ్రాహ్మణ మతాభిమానులగుటచే వచ్చినట్లు కనపడుచున్నది.

ఈతని తరువాతి వాడు శివస్కంధ శాతకర్ణి . రాజై క్రీ. శ. 177 మొదలు 185 వరకు పాలించెను.

మూలాములుసవరించు

  • 1926 భారతి మాసపత్రిక.