శివ పార్వతుల ఆలయం (అనపర్తి)
శివ పార్వతుల ఆలయం తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి లో ఉంది. ఆలయ పైభాగంలో ముందు వైపున కూడా చిన్న చిన్న శిల్పాలు వున్నాయి.
శివ పార్వతుల ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E |
పేరు | |
ప్రధాన పేరు : | శివ పార్వతుల ఆలయం |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | తూర్పు గోదావరి |
ప్రదేశం: | అనపర్తి |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శివ పార్వతుల ఆలయం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
ఆలయ చరిత్ర
మార్చుపూర్వం ఈ గ్రామంలో ఒక వ్యక్తి సారా వ్యాపారం భారీఎత్తున సాగించేవాడు. అది నిరంతరం సాగుతున్నా అతనికి ఎలాంటి తృప్తి వుండేది కాదు. ప్రస్తుతం ఆలయ ప్రదేశంలో అప్పట్లో ఒకరేగి చెట్టు వుండేది. ఒకనాడు ఒకసాధువు ఆ ప్రాంతానికి వచ్చి ఆ రాత్రి రేగి చెట్టు దగ్గర మకాం చేశాడు. తెల్లవారేసరికి ఆ సాధువు లేడు కానీ ఆ రేగిచెట్టు ముందు అమ్మవారి ఫోటో ఒకటి పెద్దది పెట్టివుంది. ఆ రాత్రే గ్రామంలో ఉన్న సారా వ్యాపారికి పార్వతి అమ్మవారు కలలో కన్పించి అతను చేస్తున్న వ్యాపారం- మానెయ్యమని, తనని సేవిస్తూ వుండమని అతనికి శుభంకలుగుతుందని చెప్పి అదృశ్యమయింది. ఆనాటితో అతను తను చేస్తున్న సారా వ్యాపారాన్ని పూర్తిగా వదిలిపెట్టి, అక్కడ చిన్న మందిరంలాంటిదాన్ని నిర్మించి, సాధువు వదిలిపెట్టిన అమ్మవారి పఠాన్ని అందులో ఉంచి పూజలు చేసుకుంటూ ఉండిపోయాడు. క్రమంగా భక్తులు ఆ దేవాలయానికి రావడం ప్రారంభించారు. అమ్మవారికి ఏదయినా మొక్కుకుంటే అది నెరవేరడంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరగడం ప్రారంభమయింది. భక్తుల చందాలతో అమ్మవారి విగ్రహాన్ని కడురమ్యంగా, నేర్పరి అయిన శిల్పులతో చేయించి పెద్దల సమక్షములో ఆలయంలో ప్రతిష్టించారు. [1]
ఉత్సవాలు
మార్చుఈ ఆలయం లో ఈ శివపార్వతుల దేవీనవరాత్రులు,మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తారు.
మూలాలు
మార్చు- ↑ నాగిరెడ్డి, ఎన్. ఎస్. తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధ దేవాలయాలు. 2003.