శివ స్మారక్
శివ స్మారక్ (Shiv Smarak, శివాజీ మెమోరియల్ - Shivaji Memorial) అనేది పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ యొక్క ప్రతిపాదిత నిర్మాణ స్మారక చిహ్నం. దీనిని మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబై వద్ద అరేబియా సముద్రములో నిర్మించనున్నారు. ఈ స్మారకస్తూపం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ప్రత్యేకంగా నిర్మించే 15 హెక్టర్ల దీవిలో శివాజీ భారీ విగ్రహంతో పాటు, మ్యూజియమును నిర్మించనున్నారు, ఇందుకు 3,600 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేశారు. ముంబైలోని రాజ్ భవన్‌కు సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో భారీ రాయి ఉన్న ప్రాంతంలో ఈ స్మారకాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహన్ని 192 మీటర్ల (630 అడుగులు) ఎత్తుతో, పీఠముతో సహా 270 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్నారు.
शिव स्मारक | |
ప్రదేశం | అరేబియా సముద్రము,ముంబై, భారతదేశం |
---|---|
రూపకర్త | Ram V. Sutar |
రకం | విగ్రహం |
నిర్మాన పదార్థం | ఉక్కు చట్రం, రీన్ఫోర్స్డ్ కాంక్రీటు |
ఎత్తు | 192 మీటర్లు |
నిర్మాణం ప్రారంభం | 24 డిసెంబరు 2016 |
అంకితం చేయబడినది | శివాజీ |