శీతకుండ
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఆగస్టు 2018) |
పైరు ఉన్న పొలాలలో లేదా తోటలలో తెల్లని బొట్టులు పెట్టిన నల్లని కుండ కర్రపై బోర్లించబడి ఉంటుంది, ఈ కుండనే శీత కుండ అంటారు. పైరుకు ఎక్కువగా చీడపీడలు ఆశించే శీతాకాలంలో ఈ కుండలను ఏర్పాటు చేయడం వలన ఈ కుండకు శీతకుండ అనే పేరు వచ్చింది. ముఖ్యంగా కనుమ పండుగ రోజు ఈ శీతకుండలను ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా శీతకుండలను ఏర్పాటు చేయడం ఒక సాంప్రదాయంగా మారింది.
శీతకుండ తయారు చేసే విధానం
మార్చుపాతదైనా, కొత్తదైనా ఒక కుండను తీసుకొని ఆ కుండను బాగా కడిగి దానిపై తెల్లగా సున్నం పూసి ఆపై బొగ్గును రంగరించి నల్లని బొట్లు, కుంకుమతో ఎర్రని బొట్లు పెడతారు. ఈ విధంగా తయారు చేసుకున్న కుండ బాగా ఆరినాక పొలంలో మనిషి ఎత్తులో ఒక కర్రను పాతి దానిపై ఈ కుండను బోర్లిస్తారు.
ఉపయోగాలు
మార్చుతోటలో మనిషి ఉన్నట్లుగా భ్రమకలిగించడం వలన చోరుల నుంచి, పక్షుల నుంచి పంట రక్షణ.