శూలిని రాగం
శూలిని రాగము కర్ణాటక సంగీతం లోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 35 వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్నాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని శైలదేశాక్షి[2] లేదా శైలదేష్[3][4] అని పిలుస్తారు.
రాగ లక్షణాలు
మార్చు- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
- S R3 G3 M1 P D2 N3 S
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
- S N3 D2 P M1 G3 R3 S
ఈ రాగంలోని స్వరాలు : షట్‍శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశృతి ధైవతం, "కాకలి నిషాదం". ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 71 వ మేళకర్త రాగమైన కోసలము రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.
ఉదాహరణలు
మార్చుఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.
- ప్రాణనాథా - త్యాగయ్య
- పరముఖమేదో - కోటేశ్వర అయ్యరు
- నళిననారాయణి - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- పాలయాసుమం శూలిని - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
మూలాలు
మార్చు- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
- ↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras