ప్రధాన మెనూను తెరువు

నవరసాలలో ఒక రసం శృంగారం . అందంగా కనిపించడానికి ఆరోగ్య రక్షణకు శరీరాన్ని శుభ్రపరచుకొని వివిధ వస్తువులతో అలంకరించుకోవడాన్ని శృంగారం అంటారు. బంగారం అందంగా ఉంటుంది అంతకంటే అందంగా శృంగారం ఉంటుంది, అందుకే అంటారు బంగారాన్ని మించిది శృంగారం అని. దేవాలయాలలో దేవునికి చేసే అలంకరణను శృంగారించడం అంటారు.

తన భాగస్వామి కోసం బాగా ఆకర్షించే విధంగా తయారైన పురుషుడిని శృంగారపురుషుడని, బాగా ఆకర్షించే విధంగా తయారైన స్త్రీని శృంగారవతి అని అంటారు.

సోలా శృంగారంసవరించు

అందంగా శరీరాన్ని అలంకరించు కోవడాన్ని శృంగారం అంటారు. స్త్రీల శృంగార అలంకరణలను సోలా శృంగారం అంటారు.

 1. దంతధావనం.
 2. నలుగు పిండితో స్నానం.
 3. వంటికి పసుపు పూత.
 4. వస్త్రధారణ (చీర, రవిక, దుస్తులు)
 5. శిరోజాలంకరణ. (వాలుజడ, ముడి, కొప్పు, జడకుచ్చులు, పాపిడిబిళ్ళ).
 6. పుష్పాలంకరణ.
 7. పాపిడిలో కుంకుమ.
 8. బుగ్గమీద చుక్క (సౌందర్య బిందు).
 9. లలాట తిలకం (గంధంతో బొట్టు).
 10. చేతులకు గోరింటాకు (మెహందీ, హెన్నా).
 11. తాంబూలం.
 12. పునుగు, జవ్వాది (పరిమళ ద్రవ్యాలు పూసుకొనుట).
 13. అధరాలకు ఎరుపు రంగు (పెదవులకు లిఫ్ స్టిక్).
 14. కళ్లకు కాటుక.
 15. కాళ్ళకు పారాణి.
 16. సర్వాభరణ అలంకరణలు - మెడలో కంఠాభరణం, శతమానం/మంగళసూత్రం, నల్లపూసలు, దండచేతికివంకి, చేతులకు గాజులు, చెవులకు దుద్దులు, కమ్మలు, బుట్టలు, చెంపస్వరాలు, మాటిలు, ముక్కుపుడక, అడ్డబాస, చేతివేళ్ళకు ఉంగరం, నడుముకు వడ్డాణం, కాళ్ళకు పట్టాలు/కడియాలు, కాలివేళ్ళకు మట్టెలు. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం తరువాతనే మంగళసూత్రం, నల్లపూసలు, పాపిడిలో కుంకుమ, కాలివేళ్ళకు మట్టెలు ధరిస్తారు.

శృంగారంతో తెలివితేటలూ పెరుగుతాయిసవరించు

శృంగారంతో ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా.. మానసిక ఒత్తిడి తగ్గడం, ఒంట్లో కొవ్వు కరగడమే కాదు.. తెలివితేటలు కూడా పెరుగుతాయట! మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలలో తేలింది. హిప్పో క్యాంపస్ దీర్ఘకాల జ్ఞాపకశక్తికి ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఎలుకలపై దీనికి సంబంధించిన ప్రయోగాలు చేశారు. వీటికి కొత్తగా న్యూరాన్లు ఏర్పడుతున్నా, లైంగిక కార్యకలాపాలు లేకపోతే మాత్రం జ్ఞాపకశక్తి ఏమాత్రం పెరగలేదని మేరీలాండ్ విశ్వవిద్యాలయముకు చెందిన మానసిక వైద్యనిపుణులు వెల్లడించారు. శృంగారంలో పాల్గొనడం వల్ల మెదడు కణాల్లోకి ఆక్సిజన్ బాగా చేరుతుందని వాళ్లు గుర్తించారు.

అలాగే, దక్షిణ కొరియాలోని కొంకుక్ విశ్వవిద్యాలయము చేసిన పరిశోధనలలో కూడా మరో ప్రబల సాక్ష్యం లభించింది. శృంగారం వల్ల తెలివితేటలు పెరుగుతాయని, దీనివల్ల హిప్పోక్యాంపల్ ప్రాంతంలో న్యూరాన్లు కొత్తవి వస్తాయని వీళ్లు కూడా చెప్పారు. విపరీతమైన ఒత్తిడి కారణంగా మతిమరుపు వస్తే, తగ్గించడానికి ఈ న్యూరాన్లు ఉపయోగపడతాయి. మలి వయసులో కూడా శృంగారాన్ని ఆస్వాదించేవారికి మతిమరుపు దగ్గరకు రాకపోవడం, డిమెన్షియా కూడా దరి చేరకపోవడం ఇందువల్లేనని వాళ్లు తేల్చి చెప్పారు.[1][2][3]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 • రసికప్రియ గ్రంథము ఆధారముగా తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ.
 1. http://indiatoday.intoday.in/story/sex-boosts-intelligence-love-making-hippocampus-long-term-memory/1/345250.html
 2. http://www.theatlantic.com/health/archive/2014/01/how-sex-affects-intelligence-and-vice-versa/282889/
 3. http://guardianlv.com/2014/02/sex-study-suggests-it-increases-intelligence/
"https://te.wikipedia.org/w/index.php?title=శృంగారం&oldid=2166015" నుండి వెలికితీశారు