శెట్టిబలిజఅనే కులం ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన తరగతులకు చెందినవారు. మీరు బీసీ-బి విభాగానికి చెందుతారు.వీరు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో అధికంగా కనిపిస్తారు;[1] ఈ కులాన్ని భారత ప్రభుత్వం వెనుక బడిన కులంగా గుర్తించింది. ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా గుర్తించారు. [2][3]

చరిత్ర మార్చు

వీరిని శెట్టి లేదా శెట్టిగార్లు అని పిలిచేవారు. సంఘపెద్దలుగా గురువులుగా దార్మికులుగా ఉండేవారు. వీరిని మోతుబర్లు అనికూడా పిలిచేవారు. కాలక్రమేన వెనకబడి వీరి కులవృత్తి గాని కల్లుగీతను జీవనోపాధిగా మార్చుకోవడం వలన అదే వీరి కులవృత్తిగా స్థిరడిపోయింది అందువలన శెట్టిగార్లు అని పిలవబడే వీరిని శెట్టిగాళ్లు అని చులకనగా పిలవడం మొదలైనది. 20వ శతాబ్దపు తొలినాళ్లలో గోదావరిజిల్లాల్లోని కల్లును కొట్టేవారిని వారి వృత్తి పరంగా ఆర్థిక స్థితి కారణంగా అగ్రవర్ణ ప్రజలు చిన్నచూపు చూసేవారు.25 సెప్టెంబరు 1920న, తూర్పుగోదావరి జిల్లా (ప్రస్తుతం కోనసీమ జిల్లా ) బోడసకుర్రులో ఈ కులానికి చెందిన ధనిక వ్యాపారి దొమ్మేటి వెంకట రెడ్డి కులసమావేశాన్ని ఏర్పాటు చేసి ఇకపై శెట్టిగార్లు కులం నుండి శెట్టిబలిజగా పేరు మార్చుకోవాలని తీర్మానించారు.ఈ కులస్తులకి బలిజ వర్గానికి సంబంధం లేనప్పటికీ గౌరవనీయమైన పేరుగా భావించి వారి కులం పేరుతో 'బలిజ' పదాన్ని చేర్చారు.వెంకటరెడ్డి తన తోటి కులస్తుల భూమి పత్రాలు, జనాభా లెక్కలు, ఇతర ప్రభుత్వ రికార్డులలో వారి కొత్త పేరుతో వారి కులాన్ని నమోదు చేయాలని కోరారు కల్లు కుట్టే కుటుంబాల పేర్లకు -గాడు అనే పదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించరాదని తీర్మానం చేసి , జిల్లా కలెక్టర్‌కి ఒక మెమోరాండం సమర్పించారు.అతను ఒక ఉన్నత పాఠశాలను కూడా స్థాపించాడు తన కుల విద్యాభివృద్ధికి ఇతర కార్యక్రమాలను చేపట్టాడు.2020లో, సంఘం సభ్యులు తమ కులం పేరును శెట్టిగార్లు నుండి సెట్టిబలిజగా మార్చిన 100వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. నేడు కోనసీమ లో అధికం గా ఉండే శెట్టి బలిజలు ఆధునిక సమాజం లో అనేక కుల వృత్తి ల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఇరు రాష్ట్రాల్లోనే కాక శెట్టిబలిజలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ వీరు కనిపిస్తారు.శెట్టిబలిజలకి,గౌడ కులానికి అలాగే ఈడిగ కులానికి ఎటువంటి సంబంధమూ లేదు.రాయలసీమలో ఉన్న సెట్టిబలిజలతో కూడా వీరికి సంభందం లేదు.అయితే శెట్టిబలిజ అనే పేరుతో ముందుగా కుల రిజిస్ట్రేషన్ చేసుకుంది మాత్రం వీరే. ప్రస్తుతం వీరు ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన వర్గంగా (బీసీ) ఉన్నారు. వీరి పూర్వ చరిత్ర వంశ నామ గోత్రాలు ఒడిషాలోని పర్లాకిమిడి సంస్థానంలో తాళపత్ర రూపంలో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. National Commission for backward classes, Andhra Pradesh Bench Findings (PDF) (Report). 2 July 2002. Archived from the original (PDF) on 4 February 2013.
  2. "Gouda, Settibalija conference". The Hindu. 27 February 2004. Archived from the original on 1 ఆగస్టు 2004. Retrieved 24 January 2012.
  3. ""Rice bowl" voters may tilt the scales". The Hindu. 23 March 2004. Archived from the original on 18 జనవరి 2005. Retrieved 25 January 2012.