కాకుత్థ్సం శేషప్పకవి

(శేషప్ప కవి నుండి దారిమార్పు చెందింది)

కాకుత్థ్సం శేషప్పకవి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు కవి. 18 వ శతాబ్ధికి చెందినవాడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతానికి చెందినవాడు.[1] ధర్మపురిలోని నరసింహాస్వామికి జీవితాన్ని అంకితం చేసినవాడు. ఆ స్వామిపై అనేక రచనలు చేశాడు. శతక సాహిత్యంలో ప్రముఖ స్థానం పొందిన నరసింహ శతకం రాసిన కవి ఇతనే.

నరసింహుడు

రచనలు

మార్చు
  1. నరహరి శతకం
  2. ధర్మపురి రామాయణం
  3. శ్రీనృకేసరి శతకం
  4. నరసింహ శతకం

నరసింహ శతకం

మార్చు

శేషప్పకవి రచించిన శతకాలలో నరసింహ శతకం ఒకటి. ఇది సీసపద్యాలలో రచించబడిన ద్విపాద మకుటశతకం.ఈ శతకం ఆధారంగా ఈ కవి పేదవాడనీ, భక్తుడనీ, దేశపరిస్థితులను ఎరిగిన వాడనీ తెలుస్తున్నది. శతకంలోని పద్యములలో శ్రీ మహావిష్ణువును సంబోధించడంలో మృదుత్వం, కాఠిన్యం, బెదిరింపు, కోపము జూపి తన భక్తి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు.[2] ఇందులో మకుటం

భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార నరసింహ దురితదూర!

ఉదా
ఒక పద్యం

సీసం:

లోకమందెవడైన లోభిమానవుడున్న
భిక్షమర్థికి చేత బెట్టలేడు
తాను బెట్టకయున్న తగవు పుట్టదుకాని
యొరులు పెట్టగ జూచి యోర్వలేడు
దాత దగ్గర జేరి తన ముల్లె వోయినట్లు
జిహ్వతో జాడీలు చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన బలుసంతసమునందు
మేలు కల్గిన జాల మిడుకుచుండు

ఆ.వె.

శ్రీరమానాథ! యిటువంటి కౄరునకును
భిక్షకుల శత్రువని పేరుబెట్టవచ్చు
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార నరసింహ దురితదూర!

మూలాలు

మార్చు
  1. నవ వసంతం-2, 7 వ తరగతి-తెలుగు వాచకం, తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ,2015, పుట-22
  2. నేదూరి గంగాధరం విరచిత శ్రీ నరసింహ శతకం, 1945, ప్రచురణ: కొండపల్లి వీర వెంకయ్య, శ్రీ సత్యనారాయణ బుక్ డిపో, రాజమండ్రి