శేషము వేంకటపతి తెలుగు కవి.

జీవిత విశేషాలు

మార్చు

అతను కృష్ణయార్యుని కుమారుడు. కందాళ రామానుజాచార్యుని వద్ద విద్యనభ్యసించాడు.

ఇతడు శశాంక విజయము అను శృంగార ప్రబంధమును రాసి వంగలసీనయార్యునికి అంకితం చేసెను. శశాంకవిజయమునకు తారా శశాంకము అనే వేరొక పేరు కలదు. ఈ గ్రంథంలో చంద్రుడు బృహస్పతి వద్ద విద్యాభ్యాసము కొరకు చేరి గురుపత్ని యగు తారను యింటి నుండి లేవదీసుకొని పోయిన కథ చాలా పచ్చిగా వర్ణింపబడినది. ఈ శేషము వేంకటపతి నియోగి బ్రాహ్మణుడని తోచుచున్నది.

ఈ ప్రబంధమునందలి పద్యములతో సంగీత సుజ్ఞానోదయము అను తారాశశాంకవిజయనాటకము గా రచించబడినది. దీనిని నండూరి రామలింగయ్య, మచిలీపట్నం 1910 లో ప్రచురించారు.[1]

ఈ శశాంకవిజయము గ్రంథాన్ని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు నుండి 1918 లో ముద్రించారు.

మూలాలు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: