శౌర్య చౌహాన్

భారతీయ మోడల్, నటి, టీవీ హోస్ట్.

శౌర్య చౌహాన్ (జననం 7 ఆగస్టు 1977) భారతీయ మోడల్, నటి, టీవీ హోస్ట్.[1] 2006 కింగ్‌ఫిషర్ క్యాలెండర్ కి మోడల్ గర్ల్ గా పనిచేసింది. హృతిక్ రోషన్ నటించిన క్రిష్ 3 సినిమాలో ప్రతినాయిక పాత్రలో నటించింది.[2]

శౌర్య చౌహాన్
Shaurya Chauhan.jpg
జననం (1977-08-07) 1977 ఆగస్టు 7 (వయసు 45)
ఇతర పేర్లుశౌర్య కుమార్ రాజ్‌పుత్, నీలిమ చౌహాన్
వృత్తిమోడల్, నటి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
టీవీ నటి, హోస్ట్
జీవిత భాగస్వామిరిషి చౌహాన్

తొలి జీవితంసవరించు

శౌర్య చౌహాన్ 1977, ఆగస్టు 7న హైదరాబాదులో జన్మించింది. వీళ్ళది రాజస్థాన్ కు చెందిన రాజ్‌పుత్ కుటుంబం. పాఠశాల స్థాయిలోనే జిమ్నాస్ట్, డ్యాన్స్, నాటకం వంటి పాఠ్యేతర కార్యకలాపాల్లో పాల్గొన్నది. జిమ్నాస్టిక్స్ లో పాఠశాలకు ప్రాతినిధ్యం కూడా వహించింది.

వృత్తి జీవితంసవరించు

ఏస్ లెన్స్ మాన్ అతుల్ కస్బెకర్ 2006లో కింగ్ ఫిషర్ స్విమ్సూట్ క్యాలెండర్ కోసం శౌర్య చౌహాన్ తో ఫోటో షూట్ చేశాడు.[3]

బాలీవుడ్సవరించు

శౌర్య చౌహాన్ క్యోన్ కి సినిమాలో చిన్న పాత్రలో నటించింది. తరువాత ముంబై సల్సా సినిమా ముఖ్య పాత్రను పోషించింది. హార్న్ ఓకే ప్లీజ్ లో కూడా నటించింది. రైట్ యా రాంగ్ అనే సినిమా నుండి తప్పుకుంది. క్రిష్ 3 లో ప్రతినాయిక పాత్రలో నటించింది.

వ్యక్తిగత జీవితంసవరించు

రిషి చౌహాన్‌ను వివాహం చేసుకుంది.[4]

సినిమాలుసవరించు

  • క్యోన్ కి (అతిథి పాత్ర)
  • ముంబై సల్సా
  • హార్న్ ఓకే ప్లీజ్
  • సద్దా అడ్డా
  • క్రిష్ 3

మూలాలుసవరించు

  1. "Meet Shaurya Chauhan, the Hottie Villain of Krrish 3". Retrieved 26 May 2021.
  2. Roshans find a hottie for Krrish – Times Of India. (2011-12-13). Retrieved on 26 May 2021.
  3. Caught in the act! – Times Of India. (2008-10-22). Retrieved on 26 May 2021.
  4. "Shaurya Chauhan Biography- Koimoi". Retrieved 26 May 2021.

బయటి లింకులుసవరించు