శ్రియా పిల్గొంకర్

శ్రియా పిల్గొంకర్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె నాన్న సచిన్, అమ్మ సుప్రియ మరాఠీ సినిమా నటులు. శ్రియా ఐదేండ్ల వయసులో తన తండ్రి దర్శకత్వం వహించిన 'తూ తూ మై మై' అనే హిందీ సీరియల్ లో బిట్టు అనే అబ్బాయిగా మొదటిసారి నటించింది. ఆమె 1996లో కరణ్ శెట్టి దర్శకత్వం వహించిన పది నిమిషాల స్టేజీ ప్లే 'ఫ్రీడమ్ ఆఫ్ లవ్'లో నటించింది. ప్రియా 2013లో మరాఠీలో విడుదలైన 'ఏకుర్తి ఏక్' సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టింది. శ్రియా పిల్గొంకర్ మీర్జాపూర్ సిరీస్ లో చేసిన స్వీటీ గుప్తా పాత్ర ద్వారా మంచి గుర్తింపునందుకుంది.[1]

శ్రియా పిల్గొంకర్
జననం
శ్రియా సచిన్ పిల్గొంకర్

25 ఏప్రిల్ 1989
జాతీయత భారతదేశం
వృత్తి
  • నటి
  • దర్శకురాలు
  • నిర్మాత
  • స్టేజి పెరఫార్మెర్
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఫ్యాన్, మీర్జాపూర్
తల్లిదండ్రులు

జననం, విద్యాభ్యాసం

మార్చు

శ్రియా పిల్గొంకర్ 1989 ఏప్రిల్ 25న సచిన్ పిల్గొంకర్, సుప్రియ దంపతులకు ముంబైలో జన్మించింది.[2][3] ముంబైలో సెయింట్ జేవియర్స్ కాలేజీలో సోషియాలిజీలో డిగ్రీ పూర్తి చేసి, పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్టీఐఐ)లో నటనలో శిక్షణ పూర్తి చేసింది.

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాషా ఇతర విషయాలు మూలాలు
2013 ఏకుర్తి ఏక్ స్వర మరాఠీ మొదటి సినిమా [4]
2015 ఉన్ ప్లస్ ఉనే అయిన ఫ్రెంచ్ 2015 టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు [5]
2016 ఫ్యాన్ నేహా సింగ్ హిందీ హిందీలో తొలి సినిమా [6]
2017 జై మాత ది అను హిందీ లఘు చిత్రం
2019 హౌస్ అరెస్ట్ సైరా హిందీ నెట్​ఫ్లిక్స్ [7]
2020 భాంగ్రా పా లే నింమో హిందీ [8]
2021 కాదన్ అరుంధతి త్రిభాషా సినిమా(హిందీ, తెలుగు,తమిళం) తెలుగు తమిళంలో మొదటి సినిమా [9]

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ప్లాట్ ఫార్మ్ ఇతర విషయాలు మూలాలు
2018 13 ముస్సూరీ అదితి బిష్త్ వియూ మొదటి వెబ్ సిరీస్
మీర్జాపూర్ స్వరాగిణి "స్వీటీ" గుప్తా అమెజాన్ ప్రైమ్ వీడియో సీజన్ 1 [10]
2019 బీచమ్ హౌజ్ చంచల్ నెట్​ఫ్లిక్స్ బ్రిటిష్ టెలివిజన్ సిరీస్ [11]
2020 ది గాన్ గేమ్ సుహాని గుజ్రాల్ ఊట్ మినీ సిరీస్ [12]
క్రాక్ డౌన్ దివ్య శిరోద్కర్ / మారియమ్ [13]
2022 గిల్టీ మైండ్స్ కాషాఫ్ అమెజాన్ ప్రైమ్ వీడియో [14]

నిర్మాత & దర్శకురాలు

మార్చు
సంవత్సరం సినిమా ఇతర విషయాలు మూలాలు
2012 పెయింటెడ్ సిగ్నల్ షార్ట్ ఫిలిం
2013 డ్రెస్ వాలా షార్ట్ ఫిలిం
2015 పంచగవ్య డాక్యుమెంటరీ ఫిలిం

మూలాలు

మార్చు
  1. The Indian Express (1 September 2020). "Success of Mirzapur changed the momentum of my career: Shriya Pilgaonkar" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  2. The Times of India (21 June 2020). "Exclusive! Father's Day Special: 'My father is a perfectionist', says Shriya Pilgaonkar" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  3. The Times of India (9 May 2021). "Mom knows everything about my life and I feel that's how the relation should be: Shriya Pilgaonkar" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  4. Khandelwal, Heena (11 November 2019). "I end up associating my character with a song: Shriya Pilgaonkar". The New Indian Express. Retrieved 30 May 2021.
  5. "Toronto to open with 'Demolition'; world premieres for 'Trumbo', 'The Program'". ScreenDaily. 28 July 2015. Retrieved 28 July 2015.
  6. ""I wasn't nervous working with Shah Rukh Khan" – Shriya Pilgaonkar". Archived from the original on 6 ఫిబ్రవరి 2018. Retrieved 6 ఫిబ్రవరి 2018.
  7. "House Arrest: Netflix to premiere Ali Fazal, Shriya Pilgaonkar's upcoming comedy on 15 November". Firstpost. 15 October 2019. Retrieved 5 August 2020.
  8. Hungama, Bollywood (19 January 2019). "BREAKING: Sneha Taurani's directorial debut to star Sunny Kaushal, Rukhsar Dhillon and Shriya Pilgaonkar".
  9. "Shriya Pilgaonkar on bagging Haathi Mere Saathi: Its subject is something I feel strongly about". The Indian Express (in Indian English). 2019-01-14. Retrieved 2019-01-14.
  10. Sheth, Hemani. "'Mirzapur' most searched web series, followed by 'Sacred Games': Report". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2021-01-23.
  11. Clarke, Stewart (20 March 2018). "ITV Orders Period Drama 'Beecham House' From 'Bend It Like Beckham' Director Gurinder Chadha". Variety. Archived from the original on 31 August 2018. Retrieved 31 August 2018.
  12. "The Gone Game web series review: A whodunit that keeps you hooked till the end". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2020-09-17.
  13. "VIDEO: Shriya Pilgaonkar opens up on webseries Crackdown". www.indiatvnews.com (in ఇంగ్లీష్). 2020-09-22. Retrieved 2020-10-01.
  14. "Guilty Minds review: All-desi, hugely entertaining and thought-provoking". The Indian Express. Retrieved 23 April 2022.