ఓం శ్రీమతి

శ్రీ అక్షరం రూపంలో శ్రీ వెంకటేశ్వరస్వామిని చిత్రించిన మొట్టమొదటి చిత్రం.

శ్రీ అనే పదాన్ని తెలుగు భాషలోను, సంస్కృతంలోను, సంబంధిత భారతీయ భాషలలోను వివిధ భావాలలో వాడుతారు. వాటిలో ప్రధానమైనవి.

  • సిరిసంపదల దేవత లక్ష్మీదేవి
  • దైవ సూచకం (శ్రీ మహావిష్ణువు, శ్రీ ఆంజనేయా, శ్రీ గణేషా, శ్రీమదాంధ్ర ...)
  • ధన సూచకం (శ్రీలు పొంగిన జీవగడ్డరా, శ్రీకర కరుణాల వాల)
  • గౌరవ సూచకం (శ్రీ సుబ్బారావు గారు, శ్రీయుతులు ...)
  • శుభ సూచకం (శ్రీ
  • ఆరంభ సూచకం (శ్రీకారం) ప్రబంధాలు శ్రీకారంతో ప్రారంభించడం తెలుగు సాహిత్యంలో ఒక ఆనవాయితీ.

లక్ష్మీదేవి మార్చు

శ్రీ వైష్ణవ సంప్రదాయంలో జగన్మాత లక్ష్మీదేవికి విశిష్టమైన స్థానం ఉంది. ఈమె విష్ణుమూర్తి పత్నిగా, జగన్మాతగా, భక్తుల ప్రార్థనలను ఆలకించి, వాటిని నాథుని సన్నిధానంలో నివేదించి, వారిని క్షమింపజేసే పురుషకార రూపిణిగా పలువిధాలుగా పూర్వాచార్యులు నిరూపించారు. వీరి ప్రకారం లక్ష్మీశబ్దానికి "లక్ష్మీః పద్మాలయా పద్మా కమలా శ్రీః హరిప్రియా" అన్నట్లు పర్యాయ వాచకం అయిన శ్రీ శబ్దానికి గల వివిధ వ్యుత్పత్తులను ఆధారం చేసుకొని ఈమె వైభవాన్ని నిరూపించారు.

మూలాలు మార్చు

  • శ్రీ వైభవం: ఐ.భాష్యకారాచార్యులు మార్చి 2008 సప్తగిరి సంచికలో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.
"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీ&oldid=3685364" నుండి వెలికితీశారు