శ్రీకాంత్ బొల్లా

భారత పారిశ్రామిక వేత్త

వచ్చింది

శ్రీకాంత్ బొల్లా
జననం7 జులై 1991
విద్యాసంస్థమసాచుసెట్స్‌ యూనివర్సిటీ,
వృత్తివ్యాపారవేత్త
జీవిత భాగస్వామివీర స్వాతి

శ్రీకాంత్‌ బొల్లా భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్త. ఆయన 2012లో హైదరాబాద్ కేంద్రంగా ‘బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌’ పేరుతో పేపర్ ప్లేట్స్ (పేపర్ అరిటాకులు), కప్పులు, ట్రేలు, డిస్పోజబుల్ ప్లేట్లు, స్పూన్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో స్థాపించి రూ.150 కోట్ల టర్నోవర్‌తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా హిందీలో సినిమాగా వచ్చింది.[1]

వ్యక్తిగత జీవితం

మార్చు

శ్రీకాంత్ బొల్లా 1991 జులై 7న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మచిలీపట్టణం మండలంలోని సీతారాంపురం గ్రామంలో జన్మించాడు. వీరి కుటుంబంలో ఈయన మొదటి కుమారుడు, వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రీకాంత్ పుట్టుకతోనే అంధులు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఇతనికి విద్య అభ్యసించడం కఠినమైంది.

అంధుడిగా జన్మించడం మూలాన మామూలు పాఠశాలలో విద్య అభ్యసించడం కష్టం అవ్వడంతో, తమ బంధువుల సహాయంతో హైదరాబాద్ లోని డెన్వర్ స్కూల్ ఫర్ బ్లైండ్ లో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తరువాత ఇంటెర్మీడియట్లో సైన్స్ చదవాలనుకొని కళాశాలలో దరఖాస్తు చేసుకుంటే తనకున్న అంగవైకల్యం మూలాన ఎవరు అడ్మిషన్ ఇవ్వలేదు. విద్య అనేది అందరికి అందుబాటులో ఉండాలన్న కృత నిశ్చయం, ఎటువంటి వైకల్యం ఉన్నాకూడా ఒక వ్యక్తికీ కనీస హక్కైన విద్య అందరికి అందుబాటులో ఉండాలి అన్న ఆలోచనతో, విద్య వ్యవస్థపై కోర్టులో కేసు వేయగా. కోర్టు నిర్ణయంతో ఎట్టకేలకు ఆరునెలల తరువాత ఇంటర్మీడియట్లో సైన్స్ విభాగంలో అడ్మిషన్ సంపాదించాడు శ్రీకాంత్. ఇంటర్మీడియట్లో 98% మార్కులు సాధించినా కూడా భారతదేశంలో ఉన్నత విద్యాసంస్థల్లో చోటు దొరకక, అమెరికాలోని మస్సాచుస్సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్య అభ్యసించారు.

ఏపీజే అబ్దుల్ కలాం ప్రారంభించిన లీడ్ ఇండియా 2020 ఉద్యమంలో భాగంగా ఉన్న శ్రీకాంత్ 2005 నుండి యువ నాయకుడిగా వ్యవహరించాడు.

అమెరికా నుండి తిరిగి వచ్చాక 2012లో రవి మంతా అనే మిత్రుడితో కలిసి బొల్లాంట్ ఇండస్ట్రీస్ ని స్థాపించాడు.[2]

వృత్తి జీవితం

మార్చు

2011లో అంగవైకల్య సమస్యలతో ఉన్న విద్యార్థులకోసం శ్రీకాంత్ "సమవాణి సెంటర్ ఫర్ చిల్డ్రెన్ విత్ మల్టిపుల్ డిసబిలిటీస్" అనే సంస్థని స్థాపించాడు, ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు బ్రెయిలీ భాష, ఒకేషనల్ విద్య అందించడమే కాకుండా ఆర్థికంగా, నైతికంగా తోడుగా నిలిచాడు.

శ్రీకాంత్ 2012లో రవి మంతా అనే మిత్రుడితో కలిసి బొల్లాంట్ ఇండస్ట్రీస్ ని స్థాపించాడు. బొల్లాంట్ ఇండస్ట్రీస్ ద్వారా వందలాది మంది దివ్యాంగులకి ఉపాధి అవకాశాలు కల్పించాడు. ఈ సంస్థ అభివృద్ధికి రతన్ టాటా ఇన్వెస్టర్గా దోహదపడుతున్నాడు. ప్రారంభం నుండి చురుగ్గా అభివృద్ధి చెందుతున్న బొల్లాంట్ ఇండస్ట్రీస్ 2018 నాటికి 150కోట్ల టర్నోవర్ సాధించింది.

2017 ఏప్రిల్ నెలలో శ్రీకాంత్ ఫోర్బ్స్ 30 లోపు 30 పత్రికలో ఆసియా వ్యాప్తంగా జరిగిన పోటీలో ఎంపికయ్యాడు.

పురస్కారాలు \ అవార్డ్స్

మార్చు
  1. విశిష్ట యువజన సేవా పురస్కారం
  2. తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఆఫ్ న్యూజెర్సీ ద్వారా యూత్ ఎక్సలెన్స్ అవార్డు [3]
  3. NDTV ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2015లో వ్యాపారవేత్త ఆఫ్ ది ఇయర్ [4]
  4. SMEలో ఎమర్జింగ్ విజేత - ప్రైడ్ ఆఫ్ టెలిగానా అవార్డ్స్ 2018 [5]
  5. బిజినెస్ లైన్ యంగ్ చేంజ్ మేకర్ అవార్డ్ 2018 [6]
  6. ECLIF మలేషియా ద్వారా ఎమర్జింగ్ లీడర్‌షిప్ అవార్డు - 2016 [7]
  7. CII ద్వారా ఎమర్జింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ - 2016 [7]
  8. 93వ ఇండియా సైన్స్ కాంగ్రెస్‌లో 2వ స్థానం [8]
  9. వన్ యంగ్ వరల్డ్ బై ఇయర్ ఆఫ్ ది ఇయర్ - 2019 [9]
  10. TV9 ద్వారా నవ నక్షత్ర సన్మానం అవార్డు - 2019
  11. యంగ్ గ్లోబల్ లీడర్స్ 2021[10]

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (30 January 2022). "ఏపీకి చెందిన ఈ అంధుడి బ‌యోపిక్ తీయాల‌ని బాలీవుడ్ ఎందుకు ఆరాటపడుతున్నది?". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.
  2. "Srikanth Bolla: First Overseas Blind Student At MIT, Entrepreneur Who Employs The Disabled, And Subject Of A New Bollywood Film". Forbes India (in ఇంగ్లీష్). Retrieved 2024-07-10.
  3. "Srikanth Bolla" (in ఇంగ్లీష్). Archived from the original on 16 జనవరి 2021. Retrieved 29 September 2018.
  4. "NDTV confers Indian of the Year Award 2015". Retrieved 30 December 2019.
  5. "Winners". prideoftelangana.com. Archived from the original on 25 ఫిబ్రవరి 2019. Retrieved 25 February 2019.
  6. "BL Changemaker Award Winners". @businessline (in ఇంగ్లీష్). Retrieved 4 March 2019.
  7. 7.0 7.1 Kumar, V. Rishi. "A catalyst for change". @businessline (in ఇంగ్లీష్). Retrieved 4 March 2019.
  8. "How a blind man from India got into MIT and launched a US$16 million start-up". AsiaOne. 17 December 2016. Retrieved 4 March 2019.
  9. "One Young World Announces 2019 Winners of Entrepreneur of the Year Award". One Young World (in ఇంగ్లీష్). 19 June 2019. Retrieved 26 November 2019.
  10. telugu, NT News (10 September 2021). "శ్రీకాంత్‌ బొల్లాకు 'జేసీఐ' గౌరవం". Namasthe Telangana. Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.