శ్రీకాంత్ షిండే

శ్రీకాంత్ ఏకనాథ్ షిండే ( మరాఠీ: श्रीकांत शिंदे షిండే ; జననం 4 ఫిబ్రవరి 1987) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 17వ లోక్‌సభకు మహారాష్ట్రలోని కళ్యాణ్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

డా. శ్రీకాంత్ షిండే

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
16 May 2014 – ప్రస్తుతం
ముందు ఆనంద్ పరాంజపే
నియోజకవర్గం కళ్యాణ్

వ్యక్తిగత వివరాలు

జననం (1987-02-04) 1987 ఫిబ్రవరి 4 (వయసు 37)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ శివసేన
తల్లిదండ్రులు ఏక్‌నాథ్ షిండే, లతా షిండే
జీవిత భాగస్వామి
వృషాలి షిండే
(m. 2016)
[1]
నివాసం వాగ్లే ఎస్టేట్, థానే, మహారాష్ట్ర
వృత్తి ఆర్థోపెడిక్ సర్జన్, పొలిటిషన్

ఆయన మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఉన్న ఏక్‌నాథ్ షిండే కుమారుడు. [2] ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి నాటికీ ఆర్థోపెడిక్స్ చివరి సంవత్సరం మాస్టర్స్ విద్యార్థిగా ఉన్నాడు. [3]

  • 2014: 16వ లోక్‌సభకు ఎన్నిక

డాక్టర్ శ్రీకాంత్ షిండే కళ్యాణ్ 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో శివసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్సీపీ అభ్యర్థి ఆనంద్ పరంజ్పే పై  2.50 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. [4] ఆయన 1 సెప్టెంబర్ 2014 నుండి  ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై స్టాండింగ్ కమిటీ సభ్యునిగా ఆ తరువాత, 15 సెప్టెంబర్ 2014 నుండి లోక్ సభ సభ్యునితో ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన, ప్రభుత్వ అధికారుల ధిక్కార ప్రవర్తనపై కమిటీ సభ్యునిగా నియమితుడయ్యాడు.

  • 2019: 17వ లోక్‌సభకు ఎన్నిక

డాక్టర్ షిండే కళ్యాణ్ 2019లో జరిగిన ఎన్నికల్లో కళ్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్సీపీ అభ్యర్థి బాబాజీ బలరాం పాటిల్‌ పై  3,44,343 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 13 సెప్టెంబర్ 2019 నుండి  రక్షణపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా,  గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.

మూలాలు

మార్చు
  1. "खासदार श्रीकांत शिंदेंच्या 'शाही लग्नाची गोष्ट'..." 24taas.com. 2016-11-19. Retrieved 2022-05-14.
  2. "Devendra Fadnavis team portfolios allocated".
  3. "Juggling medical careers and politics with elan: Doctors who became MPs". 2014-05-17.
  4. "मोदीमय हुआ कल्याण, जीते डॉ़ श्रीकांत शिंदे". Nav Bharat Times (in హిందీ). Retrieved 2014-05-17.