శ్రీరంగ నీతులు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
చెంచులు చెప్పే శ్రీరంగ నీతులు
ఏ ఊరు ఏ భామ ....................||నందానా||
ఎవ్వారి భామవేవై భామా ......||నందానా||
వినరో నరసిమ్మ.........................||నందానా||
ఉండు గూడెం మాది....................||నందానా||
చేతిడే ముద్దమ్మ........................||నందానా||
చెయ్యెత్తి దానాలు.......................||నందానా||
వడ్డిచ్చే తల్లి వడ్డిచ్చె తల్లి.
అంటూ భద్రాచల ప్రాంతాల నుండి ఆంధ్ర దేశానికి అప్పుడప్పుడు వచ్చి యాచించి వెళ్ళిపోతూ వుంటారు చెంచులు. వెంట తెచ్చిన నెమలి ఈకలు, పులి గోరులు, మూలికలు అమ్ముకునిని డభ్భు చేసుకుంటారు.
వీరు పాడే పాట బెంబీత పాట అంటారు. వీరు ముగ్గురు నలుగురు కలిసి జట్లుగా వస్తారు. ఒకరు చరణం పాడితే మిగిలిన వారు చరాణ్తంలో బెంబీతా అనీ, తందానా అనీ శృతి కలుపుతారు. అందరూ చిన్న జేగంటలను చేత పట్టుకుని, ఒక పుల్లతో పాడే పాటకకు తాళంగా ఉపయోగిస్తారు. వీరి వేష ధారణ, కాళ్ళకు చాలీచాలని తొడిగిన లాగులు యాచనలో సంపాదించిన చొక్కాలూ, పూల దండలూ, తల పాగాలూ, పాగాలపై నెమిలి ఈకలూ, పులి గోరులూ, పంది కోరలూ మొదలైన వాటిని ధరిస్తారు. ఈ చెంచు పాటల ద్వారా రెండవ ప్రపంచ యుద్ధకాలంలో పాసిస్టు మూకల క్రూర కృత్యాలను ప్రజానాట్య మండలి కళాకారులు, నారజు దళంలోని, రామ కోటి, పురుషోత్తం మొదలైన వారు ఎంతో వుత్తేజంగా పాడి ప్రజలకు పాసిస్టు ప్రమాదాన్ని గురించి, యూద్ధ ప్రమాదాన్ని గురించి వివరించారు.
ఇదే చెంచు పాటల్లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడ లాడించిన అల్లూరు సీతా రామ రాజు మన్యంలో జరిపిన పోరాట చరిత్రను మిక్కిలి నేని, మాచి నేని, మొదలైన వారు ఉత్తేజంగా పాడి ప్రజలను వుత్తేజ పర్చారు.
అదే చెంచు పాట బాణీలో విజయవాడ తాలూకా, నంది గామ వాస్తవ్యులు అయ్యపు వెంకట కృష్ణయ్య గారు భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణా లర్పించిన స్వాతంత్ర్య సమర వీలుల త్యాగాల గురించి ఈ విధంగా వివరించారు. చెంచుల పాట బాణీలో చెంచు నాటకాలు
ఆ కాలంలో చెంచు నాటకాలను కొల్ల వారే ప్రదర్శిస్తూ వుండే వారు. వీరి నాటకాలనూఅనాటి పల్లెటూళ్ళలో చాల పేరు పొందాయి. ప్రతి గ్రామంలోనూ వీరు నాటకాలను ప్రదర్శిస్తూ వుండేవారు. ఆ వీధిలో వారు నాటకం ఆడించారని వీరూ, వీరు ఆండించారని వారు, ఇలా ప్రతి వీధిలోనూ ప్రదర్శించటంతో, ఎక్కువ రోజులు ఒకే గ్రామంలో వుండి, తగిన పారితోషికాలను సంపాదించుకుని మరో గ్రామానికి తరలి వెళుతూ వుండేవారు.
చెంచు నాటకాలలో ముఖ్యమైన ఇతి వృత్తం అహోబల నారసింహ స్వామి చెంచీతను, అంటే చెంచువారి కన్యను మోహించి వివాహం ఆడటం. ఈ ఆహోబల క్షేత్రం కర్నూలు జిల్లాలో చెంచు వారు నివసించే అడవి మధ్య ఒక కొండ ఉంది. ఆ కొండ మీద నరసింహ స్వామి దేవాలయం ఉంది. స్వామి ఉత్సవ సమయంలో చెంచు పడుచులు విల్లంబులు చేతపట్టు కుని చురుగుకా యాత్రికుల మధ్య స్వేచ్ఛాగా చక చకా తిరుగుతూ స్తైర్య విహారం చేస్తూ వుంటారు. ఆ చెంచీత కథనే గరుడాచల మహత్యం అని పూర్వ కవి యక్షగానంగా వ్రాశాడు. దాని ననుసరించి అనేక మంది ఆ యక్షగానాన్ని ప్రదర్శించారు.
మనది భారత దేశమమ్మా
మనది భార జాతి తల్లీ.............||నందానా||
భారతీయులము మనమమ్మ....||నందానా||
బానిసలమినాతు తల్లీ..............||నందానా||
భోగాల పుట్టినిల్లమ్మ...............||నందానా||
భూలోక స్వర్గమే తల్లీ...............||నందానా||
మన బాలచంద్రుడూ................||నందానా||
మన ఖడ్గ తిక్కనా...................||నందానా||
మన్యంపు వీరులూ .................||నందానా||
మన రెడ్డి రాజూలూ .................||నందానా||
రాణా ప్రతాపౌడూ....................||నందానా||
రసపుత్ర వీరులూ....................||నందానా||
తమ శౌర్యమయ రక్త................||నందానా||
ధారా స్రవంతిలో.......................||నందానా||
తడిపి మెదిపిన వీర..................||నందానా||
ధాత్రీ ఇది మాతల్లి.....................||మనది ||
ఇలా దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులందరినీ, స్మరిస్తూ చెంచు పాటలతో ఉర్రూత లూగించే వారు ప్రజా నాట్య మండలి కళాకారులు.
మూలాలు
మార్చుతెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.