శ్రీలంకలో కోవిడ్-19 మహమ్మారి
శ్రీలంకలో కోవిడ్-19 మహమ్మారి కొనసాగుతుంది. మొదటి కేసు 2020 జనవరి 27 న నినిర్ధారించబడింది. 2021 సెప్టెంబరు 1 నాటికి, దేశంలో మొత్తం 462,767 కేసులు నమోదయ్యాయి.386,509 మంది రోగులు వ్యాధి నుండి కోలుకున్నారు.10,140 మంది రోగులు మరణించారు.[3][4][5][6][7]
వ్యాధి | కోవిడ్-19 |
---|---|
ప్రదేశం | శ్రీలంక |
మొదటి కేసు | కోలంబో |
మూల స్థానం | వూహన్చై, చైనా, |
కేసులు నిర్ధారించబడింది | 507,330 [1][2] |
బాగైనవారు | 429,776 [1] |
క్రియాశీలక బాధితులు | 60,906 [1] |
మరణాలు | 12,284 [1] |
అధికార వెబ్‌సైట్ | |
మొదటి వెవ్ లో శ్రీలంక విజయవంతం ఎదుర్కొంది.రెండవ, మూడవ దశలో ప్రభుత్వం వైఫల్యం అయినది.2020 నవంబరు నుండి కోవిడ్-19 మరణాలలో పెరుగుదలకు కారణమైంది. 2021 ఏప్రిల్లో సింహళ, తమిళ నూతన సంవత్సరం సందర్భంగా పరిమితుల సడలింపు తర్వాత కేసులు ఎక్కువ నమోదైనవి. డెల్టా వేరియంట్ వల్ల దేశంలో గణనీయమైన మరణాల ఎక్కువా సంఖ్యలో నమోదయ్యాయి.లాక్‌డౌన్‌ను అమలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడంతో, కేసులు, మరణాల పెరుగుదలకు దోహదం చేశాయి.
2021 ఆగస్టు 20న, కేసుల వ్యాప్తిని అరికట్టడానికి పది రోజుల లాక్‌డౌన్ విధించింది.[8][9].[10][11][12][13][14][15][16][17][18]
నేపథ్య
మార్చుచైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే వైరస్. ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు. పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.ఈ వైరస్ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌లో కొత్త వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో "కరోనావైరస్"గా గుర్తించారు. ఈ వ్యాధికి ప్రస్తుతం చాలా రకాల టీకాలు అభివృద్ధి చేయబడ్డాయి. ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీ వెన్లియాంగ్.[19][20][21][22][23]
కాలక్రమం
మార్చుజనవరి 27కి ముందు, శ్రీలంక ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలోని సిబ్బందిని ప్రయాణికులను పరీక్షించమని ఆదేశించింది.జనవరి 27న, చైనాలోని హుబీ ప్రావిన్స్‌కు చెందిన 44 ఏళ్ల చైనా మహిళకు వైరస్ మొదటి కేసు నమోదైంది.కోవిడ్-19 మొదటి కేసును అనుసరించి, దేశంలో ఫేస్ మాస్క్‌లకు డిమాండ్ పెరిగింది.మాస్క్‌లకు కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది.మార్చి మొదటి వారం నుండి, ఇటలీ, ఇరాన్ నుండి వచ్చే సందర్శకులు రెండు వారాల క్వారంటైన్ ఉండాలని నిబంధనలు జారీ చేసింది. మార్చి 12న, మరొక శ్రీలంక పౌరుడు కోవిడ్ -19కి పాజిటివ్ వచ్చింది.మే 30న, 62 మంది వ్యక్తులు కోవిడ్-19కి పాజిటివ్ పరీక్షించారు దీనితో మొత్తం కేసులు 1620కి చేరుకున్నాయి.
సహాయక చర్యలు
మార్చు- ఈ వ్యాధి నుండి రక్షించడానికి సాధారణ ప్రజలు సరైన పరిశుభ్రత పద్ధతులు, స్వీయ నిర్బంధ పద్ధతులను పాటించాలని శ్రీలంక ప్రభుత్వం అభ్యర్థించింది.
- మార్చి 14న, శ్రీలంక ప్రభుత్వం మహమ్మారిని నియంత్రించడానికి 2020 మార్చి 16ని జాతీయ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది.
- మార్చి 16న, గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ (GMOA) ప్రెసిడెంట్ గోటబయ రాజపక్సే పబ్లిక్ హాలిడేను ఒక వారం వరకు పొడిగించాలని, దేశంలోకి ప్రవేశించే అన్ని ఓడరేవులను మూసివేయాలని అభ్యర్థించింది . ఆరోగ్యం, బ్యాంకింగ్, ఆహార సరఫరా, రవాణా మినహా కొత్త కేసుల పెరుగుదల కారణంగా ప్రభుత్వం ప్రభుత్వ సెలవును మార్చి 17 నుండి మార్చి 19 వరకు మూడు రోజులకు పొడిగించింది.
- కరోనావైరస్ ఎమర్జెన్సీని పరిష్కరించడానికి దాదాపు 24 ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య మంత్రి పవిత్ర వన్నియారాచ్చి వెల్లడించారు.
ప్రభావం
మార్చు- దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా ఎన్నికలు కనీసం రెండుసార్లు వాయిదా పడ్డాయి. చివరికి తేదీని 2020 ఆగస్టు 5గా ఖరారు చేసారు.ఓట్ల లెక్కింపు 2020 ఆగస్టు 6న ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది.
- 2019 ఈస్టర్ బాంబు దాడుల ప్రభావం నుండి నెమ్మదిగా కోలుకుంటున్న దేశ పర్యాటక రంగం కరోనావైరస్ వ్యాప్తి వల్ల పర్యాటక రంగం చాలా నష్టపోయింది.
- కర్ఫ్యూలు అమలులోకి వచ్చినప్పటి నుండి కొలంబోలో గాలి నాణ్యత పెరిగింది.
- మార్చి 12 నుండి ఏప్రిల్ 20 వరకు ఐదు వారాల పాటు పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.పరీక్షలను కూడా రద్దు చేసింది.శ్రీలంక ప్రభుత్వం 2020 జూన్ 29 నుండి నాలుగు దశల్లో పాఠశాలలను తిరిగి తెరవనున్నట్లు ప్రకటించింది.అక్టోబరులో జరగనున్న గ్రేడ్ 5, జీసీఈ అడ్వాన్స్‌డ్ లెవెల్ పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని పరీక్షల కమిషనర్ జనరల్ ప్రకటించారు.
తప్పుడు పుకార్లు
మార్చు- 2020 మార్చి 12న కోవిడ్-19 బారిన పడిన 52 ఏళ్ల టూర్ గైడ్ కొడుకు కూడా సోకినట్లు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం షేర్ అయింది. అయితే, ఆరోపణలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ తిరస్కరించింది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తప్పుడు సమాచారం ద్వారా మోసపోకుండా ఉండమని శ్రీలంక పోలీసులు ప్రజలకు చెప్పారు.
టీకా కార్యక్రమం
మార్చు- భారత ప్రభుత్వం శ్రీలంకకు విరాళంగా అందించిన ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ 500,000 డోసుల 2021 జనవరి 28న శ్రీలంకకి చేరుకున్నాయి.ఫిబ్రవరిలో సాధారణ ప్రజలకు టీకాలు వేయాలని రాజపక్సే ఆరోగ్య అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 16 నుండి పార్లమెంటు సభ్యులకు టీకాలు వేయబడ్డాయి.
- మార్చిలో చైనా నుండి సినోఫార్మ్ బిఐబిపి వ్యాక్సిన్‌ని 600,000 విరాళంగా అందుకుంది. తరువాత మేలో 3 మిలియన్ డోస్‌లను కొనుగోలు చేసింది.
మొదటి దశ
మార్చుమొదటి దశలో, ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకాలు వేయడం ప్రారంభించింది.
రెండవ దశ
మార్చురెండవ దశలో, ప్రభుత్వం 2021 ఫిబ్రవరి చివరిలో 30 ఏళ్లు పైబడిన వ్యక్తులకు టీకాలు వేయడం ప్రారంభించింది. ఏప్రిల్ నాటికి, 30 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు టీకాలు వేయడం ప్రారంభించబడింది
కొరత
మార్చుఏప్రిల్ నాటికి, మూడవ వేవ్ ఇన్ఫెక్షన్‌లలో COVID కేసులు పెరగడంతో, భారతదేశం ఎగుమతి నిషేధం కారణంగా శ్రీలంక ఆస్ట్రా-జెనెకా వ్యాక్సిన్‌కు తీవ్ర కొరతను ఎదుర్కొంది.రష్యాలో కేసుల పెరుగుదల కారణంగా శ్రీలంక స్పుత్నిక్ V వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంది.
మూడవ దశ
మార్చు30 ఏళ్లు పైబడిన వ్యక్తులకు టీకాలు వేయడం పూర్తవడంతో, 18, 30 ఏళ్ల మధ్య ఉన్న ప్రత్యేక కేటగిరీల పరిధిలోకి రాని వారికి టీకాలు వేయడం 2021 సెప్టెంబరు ప్రారంభంలో ప్రారంభించబడింది
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "COVID-19 Situation Report". Health Promotion Bureau (Sri Lanka). Retrieved 24 May 2021.
- ↑ "Epidemiology Unit". Ministry of Health (Sri Lanka). Retrieved 24 May 2021.
- ↑ "First patient with coronavirus reported in Sri Lanka". Colombo Page. 27 January 2020. Archived from the original on 29 January 2020. Retrieved 2 February 2020.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2021-10-21. Retrieved 2021-12-03.
- ↑ "Corona Virus 2020 / 2021". www.epid.gov.lk. Archived from the original on 2020-05-25. Retrieved 2021-09-06.
- ↑ "Establishment of 12 Corona Quarantine Centers Island wide". Hiru News. Retrieved 2020-03-16.
- ↑ "Sri Lanka extends nationwide curfew to fight coronavirus pandemic". www.aljazeera.com. Archived from the original on 24 March 2020. Retrieved 2020-03-24.
- ↑ "Sri Lanka, Vietnam in Coronavirus battle of wits to bust the Covid-19 bug". economynext.com. 25 March 2020. Retrieved 25 March 2020.
- ↑ "SL performs well in fighting Coronavirus & ranked 9 in GRID Index". Sri Lanka News – Newsfirst. 2020-04-17. Retrieved 2020-04-17.
- ↑ "Sri Lanka records world's fourth-highest daily deaths by population amid lockdown calls". EconomyNext (in ఇంగ్లీష్). 2021-08-15. Retrieved 2021-08-20.
- ↑ "Sri Lanka teachers on strike over detention of protesters". AP NEWS (in ఇంగ్లీష్). 2021-07-12. Retrieved 2021-08-20.
- ↑ "As COVID deaths surge, Sri Lanka prepares for 10-day lockdown". www.aljazeera.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-20.
- ↑ "Sri Lanka announces lockdown as coronavirus cases surge; president to address nation". Reuters (in ఇంగ్లీష్). 2021-08-20. Retrieved 2021-08-20.
- ↑ "Sri Lanka rejects lockdown to beat Covid 'bomb'". France 24 (in ఇంగ్లీష్). 2021-08-10. Retrieved 2021-08-20.
- ↑ Nadeera, Dilshan. "Sri Lankan lives matter – Sajith" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-20.
- ↑ "Sri Lanka confirms highest daily COVID-19 deaths yet; lockdown calls grow louder". EconomyNext (in ఇంగ్లీష్). 2021-08-19. Retrieved 2021-08-20.
- ↑ "Sri Lanka extends COVID-19 lockdown till September 6 as deaths rise". The Hindu (in Indian English). PTI. 2021-08-27. ISSN 0971-751X. Retrieved 2021-08-28.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "Sri Lanka Lockdown News: Sri Lanka extends Covid-19 lockdown till September 6 as deaths rise". The Times of India (in ఇంగ్లీష్). PTI. 27 August 2021. Retrieved 2021-08-28.
- ↑ Elsevier. "Novel Coronavirus Information Center". Elsevier Connect. Archived from the original on 30 January 2020. Retrieved 15 March 2020.
- ↑ Reynolds, Matt (4 March 2020). "What is coronavirus and how close is it to becoming a pandemic?". Wired UK. ISSN 1357-0978. Archived from the original on 5 March 2020. Retrieved 5 March 2020.
- ↑ "Crunching the numbers for coronavirus". Imperial News. Archived from the original on 19 March 2020. Retrieved 15 March 2020.
- ↑ "High consequence infectious diseases (HCID); Guidance and information about high consequence infectious diseases and their management in England". Government of the United Kingdom. Archived from the original on 3 March 2020. Retrieved 17 March 2020.
- ↑ "World Federation Of Societies of Anaesthesiologists – Coronavirus". wfsahq.org. Archived from the original on 12 March 2020. Retrieved 15 March 2020.