శ్రీలక్ష్మి రేబాల

శ్రీలక్ష్మి రేబాల ప్రముఖ రంగస్థల నటి.

ఈమె 1957 జూలై 12వ తేదీన డా. చయనం వెంకటసుబ్బారావు, దుర్గాంబ దంపతులకు గుంటూరు లో జన్మించింది.

 
శ్రీలక్ష్మి రేబాల

రంగస్థల ప్రస్థానం

మార్చు

7 సంవత్సరాల వయస్సు నుండి 17 సంవత్సరాల వరకు భరతనాట్య ప్రదర్శనలిచ్చింది. బెల్లంకొండ సూర్యప్రకాశరావు రచనకు పి. దాసు దర్శకత్వం వహించిన ‘విధికృతం’ నాటకంతో వీరి నట జీవితానికి అంకురార్పణ జరిగింది. ఆ తదుపరి తెలుగు రాష్ట్రాలలోనేకాక ఇతర రాష్ట్రాలలో కూడా అనేక నాటక ప్రదర్శనల్లో పాల్గొని ఎన్నో బహుమతులను పొందింది.

1976 లో ‘కళాప్రవీణ’ రేబాల రమణ తో వివాహమయ్యాక ‘పల్నాటి యుద్ధం’ నాటకంలో ఈవిడ మాంచలగా రేబాల రమణ నాగమనాయకురాలుగా శతాధిక ప్రదర్శనలిచ్చారు. బాలనాగమ్మ, చింతామణి, చంద్రమతి, శశిరేఖ, పార్వతి, దాక్షాయణి, మోహిని, సత్యభామ, తార, వరూధిని, హిమబిందు, రాధ, పద్మావతి, లక్ష్మి, ద్రౌపది, శాంతిమతి, రుక్మిణి, మేరిమాత ఇలా ఎన్నో పాత్రలను పోషించింది.

1948 నుండి 1996 వరకు ప్రజానాట్యమండలి ప్రదర్శనల్లో పాల్గొన్నది. జన విజ్ఞాన వేదిక, శాస్త్ర కళాజాతా, అక్షర కళాయాత్రా జిల్లా కమిటీ సభ్యురాలుగా ఉంటూ ప్రదర్శనలు ఇవ్వడమేగాక, శిక్షణ శిబిరాలలోకూడా కళాకారులకు నృత్యం, నటనలో శిక్షణ ఇచ్చింది.

అన్నింటికంటే ముఖ్య విషయం రేబాల కుటుంబ జీవితం ఆదర్శవంతమైనది. రమణ శ్రీమతి శ్రీలక్ష్మి భర్తతో పాటు పౌరాణిక నాటకాలు నటిస్తూనే ప్రజా నాట్యమండలి నెల్లూరు జిల్లా బాధ్యులుగా పనిచేశారు. సప్ధర్‌ హష్మీ మరణానంతరం ఢిల్లీ వీధుల్లో ప్రదర్శించిన తెలుగు వీధినాటిక బృందాల్లో ప్రజానాట్యమండలి పూర్వ కార్యదర్శి దేవితో పాటు ఆమె ఒకరు. ఆమెకు ఆ విధమైన విశాలమైన ప్రోత్సాహం ఇచ్చినవారు రమణ. రమణ కుమార్తెలు దివిజ, లలిత విద్యావంతులయ్యారు. అలాగే కళారంగాన్ని అట్టిపెట్టుకునే ఉన్నారు. అలా కొనసాగడం తమ తండ్రి ప్రభావమే అని వారు వినమ్రతగా చెప్తారు. 24వ వర్ధంతి సందర్భంగా శ్రీమతి శ్రీలక్ష్మి తన పిల్లలు, మనమలతొ


నటించినవి: సంస్మృతి, తప్పెవరిది, ఇదేనాదారి, యుగసంధి, జాగృతి, కళ్ళు, సమిధ, శిథిలశిల్పం, కనకపుష్యరాగం, మండువాలోగిలి, ఎర్రమట్టి, పంజరంలో పక్షులు, పల్లెపడుచు, గాలివాన, మరోమొహంజదారో, చిల్లరకొట్టు చిట్టెమ్మ మొదలగు సాంఘిక నాటిక/నాటకములలో నటించింది.

రేడియో నాటకాల్లో కూడా నటించింది.[1] https://m.dailyhunt.in/news/india/telugu/prajasakti-epaper-prajasak/rebaala+ramaniyam-newsid-84569955 https://business.facebook.com/811592058904411/photos/a.811727632224187/3779728275424093/?type=3&theater

మూలాలు

మార్చు
  1. మాగంటి. "పండగరోజు నాటకం". www.maganti.org. Retrieved 5 April 2017.
  • శ్రీలక్ష్మి రేబాల, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 104.

https://m.dailyhunt.in/news/india/telugu/prajasakti-epaper-prajasak/rebaala+ramaniyam-newsid-84569955