శ్రీ వరి
(శ్రీవరి నుండి దారిమార్పు చెందింది)
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
"శ్రీ వరి " అనేది వరి సాగులో ఒక వినూత్న రకమైన సాగు పద్ధతి.
సాగు పద్దతి
మార్చు- దీనిలో రెండు రకాలున్నాయి మొదటిది నారు నాటడం, రెండవది విత్తనం నాటడం.
- మొదటి పద్ధతి ద్వారా పొలాన్ని దమ్ము చేసిన తరువాత పరికరంతో చదునుచేస్తారు. ఇప్పుడు నీరు తక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటారు.
- తరువాత దారాల సహాయంతో పొలాన్ని గడులుగా విభజిస్తారు. ఇప్పుడు గడికి ఒక మొక్క చొప్పున నాటుతారు.
- ఇక్కడ లేత నారు (వారం నుంచి పది రోజుల వయస్సు) నే ఉపయోగించాలి. ఇదే శ్రీ వరిలోని ముఖ్యమైనది.
- లేత నారు నాటడం వలన మొక్క ఎదిగే కొద్ది దుబ్బులు ఎక్కువగా వచ్చి మంచి దిగుబది వస్తుంది, సాధారణంగా నాటిన వరిలో మొక్కకి ఆరు నుంచి పది దుబ్బులు (మొలకలు) ఉంటే శ్రీ వరి పద్ధతిలో నాటిన మొక్కకి నలభై నుంచి అరవై వరకు ఉంటాయి.
- ఇక రెండవ పద్ధతి, ఈ పద్ధతిలో పొలాన్ని దమ్ముచేసి చదును చేసిన తరువాత తయారు చేసిన విత్తనాన్ని (విత్తనాన్ని వాడటానికి సుమారు రెండు రోజుల ముందు విత్తనాన్ని నీళ్ళలో నాన బెట్టి ఒక రోజు ఉంచి తరువాత వాటిని గొనే బస్తాలో పోసి నిలవ చేస్తారు రెండవ రోజు నాటికి అవి మొలక వస్తాయి) పొలంలో చల్లాలి ఇవి మొలకెత్తుతాయి.
- ఈ సాగు పద్ధతిలో వరిచేనుని దీర్ఘచతురస్త్రాకారాలుగా గడులుగా విభజించి వాటి మధ్యలో కాలి బాటలు చేస్తారు ఇలా చేయటం వలన పొలానికి గాలి బాగా తగిలి క్రిమికీటకాలు బెడద తగ్గుతుంది.
ఉపయోగాలు
మార్చునీటి ఎద్దడిని తట్టుకుంటంది, నీటి వినియోగంతక్కువ. దిగుబడి ఎక్కువ, ఈ పద్ధతి ద్వారా సుమారు 60 నుంచి 80 బస్తాల (బస్తా 75 కేజీలు) వరకు దిగుబడి వస్తుంది, సాధారణ పద్ధతిలో 30 నుంచి 40 బస్తాలు దిగుబడి వస్తుంది.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో System of Rice Intensificationకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.