శ్రీశైలవాసా! శివా!

శ్రీశైలవాసా! శివా! అనే ఈ శతకాన్ని పాశ్చాత్య దేశాలలో ఉన్నత విద్యనభ్యసించి, ఇంజనీరింగు పట్టభద్రుడై, ప్రభుత్వంలో బాధ్యతతో కూడిన ఉన్నత పదవులను నిర్వహించిన బొమ్మన సుబ్బారావు రచించాడు. ఇతడు రచించిన ఈ శతకాన్ని మల్లంపల్లి శరభయ్య సంస్కరించాడు. దీనికి గుంటూరు శేషేంద్రశర్మ ముందుమాట వ్రాశాడు[1].

శ్రీశైలవాసా! శివా!
కవి పేరుబొమ్మన సుబ్బారావు
మొదటి ప్రచురణ తేదీ1985
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంశ్రీశైలవాసా! శివా!
విషయము(లు)భక్తి
పద్యం/గద్యంపద్యం
ప్రచురణ కర్తబొమ్మన సుబ్బారావు, రాజమండ్రి
ప్రచురణ తేదీ1985
మొత్తం పద్యముల సంఖ్య108

ఉదాహరణ

మార్చు

ఈ శతకంలోని ఒక పద్యం మచ్చుకు:

పూవుల్ పూచినట్టులై గగనమున్ పూర్ణేందు తారాధ్యుతిన్
క్రోపుల్ మాపులు నల్దెసల్ ముసరగా క్రొత్తావు లావుల్ గొనన్
మావుల్ కోవెల కీవెలైన యెదలన్ మంద్రస్ఫురన్నాదమై
శ్రీ వాత్సల్యముతోడ మమ్ము గనరా! శ్రీశైలవాసా! శివా!

మూలాలు

మార్చు
  1. ఆంగీరస (1 January 1986). "గ్రంథ విమర్శలు - శ్రీశైలవాసా! శివా!". భారతి. 63 (1): 78. Archived from the original on 8 ఆగస్టు 2020. Retrieved 24 February 2017.