శ్రీశైల భ్రమరాంబికా దేవీ శక్తిపీఠం

శ్రీశైల ఖండం స్కంద పురాణం పురాణం ప్రకారం భ్రమరాంబ దేవి, పార్వతీ దేవి దివ్య మూల రూపం. ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీ దేవి పేరుతో ఉపాసన చేసాడు. అతను ఆ ఉపాసనలో అమరత్వాన్ని కోరుకుంటాడు, గాయత్రీ దేవి అటువంటి కోరికను తాను తీర్చలేనని, బ్రహ్మ దేవుడు మాత్రమే దానిని చేయగలడని చెప్పింది. ఆ సలహా తీసుకున్న అరుణాసురుడు 'ఓం బ్రహ్మదేవాయ నమః' అంటూ బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తన తీవ్రమైన తపస్సు చేస్తాడు. అతని ప్రార్థనలు అన్ని లోకాలకు చేరాయి. కష్టాల్లో ఉన్న దేవతలు బ్రహ్మదేవుడిని కలుసుకుంటారు.అరుణాసురుడు కోరిక చాలా త్రీవమైనకోరికఅని,దీనికి ఏదైనా చేయమని బ్రహ్మదేవుడుని అభ్యర్థిస్తారు. బ్రహ్మదేవుడు అరుణాసురుని ముందు ప్రత్యక్షమై అతని కోరిక ఏమిటని అడుగుతాడు.అతని కోరిన కోరిక అమరత్వం గురించి విన్న బ్రహ్మ దేవుడు అలాంటి కోరిక విశ్వ సూత్రాలకు విరుద్ధమని, దానికి బదులుగా ఏదైనా మరొక కోరికను అభ్యర్థించమని కోరతాడు. అరుణాసురుడు లోతుగా ఆలోచించిన తర్వాత 2 కాళ్ల లేదా 4 కాళ్ల జీవుల వల్ల తాను ఎప్పటికీ మరణాన్ని ఎదుర్కోలేనట్లుగా వరం ప్రసాదించమని కోరతాడు. బ్రహ్మ అతని కోరికను మన్నిస్తాడు. తనను తాను అమరుడిగా, అజేయంగా భావించే అరుణాసురుడు తన కోరికను అడ్డంగా పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెడతాడు.ఆ సందర్బంలో దేవతలను కూడా విడిచిపెట్టడు. అతని చేష్టలతో విసిగిపోయిన దేవతలు తమ ఆందోళనలను శివుడు, పార్వతితో పంచుకుంటారు.

వరం పొందిన తరువాత, అరుణాసురుడు దేవతలు, సాధువులకు సమస్యలను కలిగించడం ప్రారంభించాడు. అతని అపారమైన శక్తి కారణంగా, దేవతలు అతన్ని ఓడించలేకపోయారు. దీంతో వారు దుర్గాదేవి వద్దకు వెళ్లి తమను రక్షించమని ప్రసన్నం చేసుకున్నారు. వారి అభ్యర్థనకు సమాధానంగా, దుర్గా దేవి భ్రమరి లేదా భ్రమరాంబిక రూపాన్ని తీసుకుంది. రాక్షసుడిని చంపటానికి అతను పొందిన వరానికి భిన్నంగా వేల ఆరు కాళ్ల తేనెటీగలను సృష్టించి వాటిని అరుణాసురుడు రాక్షసుడుపైకి వదిలింది.తేనెటీగల దాడికి అరుణాసర రాక్షసుడు మరణిస్తాడు. ఆ తర్వాత అమ్మవారు శ్రీశైలంలో భ్రమరాంబిక రూపంలో వెనుదిరిగింది.[1]

భ్రమరాంబికా దేవి వృత్తాంతం

మార్చు

స్మహాదేవి అతి ముఖ్యమైన పీఠమైన శ్రీశైలంలో మహాదేవి స్వయంగా భ్రమరాంబిక దేవిగా కొలువై ఉంటుంది.శ్రీశైలఖండంలోని 23వ అధ్యాయం శ్రీ భ్రమరాంబిక దేవి ప్రాముఖ్యత, చరిత్రను వివరిస్తుంది. భ్రమరాంబిక కథను శివుడు స్వయంగా పార్వతీదేవికి చెపుతాడు. పార్వతీ నీ మహిమవలన అష్టాదశ శక్తి పీఠాలన్నీ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే శరీర భాగాలన్నింటిలో గొంతు ఎంత ముఖ్యమో, అష్టాదశ శక్తి పీఠాలన్నింటిలో శ్రీశైలానికి అంత ప్రాధాన్యత ఉంది.దేవీ నీవు శ్రీశైలంలో నీ భౌతిక రూపం ఉంది. ఈ మహాపీఠంలో, శ్రీశైలంలో నా పక్కనే, భ్రమరాంబికగా దేవతలందరూ నిన్ను సేవిస్తున్నారు.ఆ విధంగా భ్రమరాంబికా దేవి రూపంలో మూడు లోకాలను అనేక రకాలుగా కాపాడుతూ ఉన్నావు.ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.వరాలను ఇచ్చే అనేక దేవుళ్ళలో శ్రీ భ్రమరాంబిక దేవి లాంటి వారు ఎవరూ లేరు. వేదాల తల్లి అని పిలవబడేది ఆమె మాత్రమే అయినప్పటికీ, ప్రపంచాన్ని రక్షించడానికి ఆమె చాలా మందిరూపంలో దేవతా అవతారాలను అలంకరించింది. భ్రమరాంబిక దేవి దివ్య ఆశీర్వాదం చిరకాలం దీర్ఘాయువు, విజయం, ఆరోగ్యం, శ్రేయస్సు, కోరుకునే భక్తులకు వరాలు ప్రసాదిస్తుంది. భ్రమరాంబిక దేవత అనారోగ్యాలను, అకాల మరణాలను నాశనం చేస్తుంది. శుభాలు, అదృష్టం, ఆనందాన్ని ఇస్తుంది.భ్రమరాంబిక దేవి భయాందోళనలను, శత్రువులను నాశనం చేస్తుంది.భక్తులు కోరుకున్నదంతా ప్రసాదిస్తుంది.ఆకర్షణ శక్తిని వరిస్తుంది. అపారమైన జ్ఞానాన్ని అందిస్తుంది.ఈ విధంగా భ్రమరాంబిక సకల వరాలకు దేవతగా ఆలయానికి పడమర దిక్కున నివసిస్తుంది.[2]

మూలాలు

మార్చు
  1. "Srisailam Devasthanam Online". www.srisailadevasthanam.org (in ఇంగ్లీష్). Retrieved 2023-05-15.
  2. "Srisailam Devasthanam Online". www.srisailadevasthanam.org (in ఇంగ్లీష్). Retrieved 2023-05-15.

వెలుపలి లంకెలు

మార్చు