శ్రీశ్రీ రచనల జాబితా

తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వ యుగకర్తగా, మహాకవిగా ప్రాచుర్యం పొందిన శ్రీశ్రీ ప్రచురిత గ్రంథాల జాబితా ఇది.[1]

శ్రీశ్రీ జీవిత చరిత్రలో పేర్కొన్నవి మార్చు

తొలి ప్రచురణ సంవత్సరం గ్రంథం పేరు ప్రచురణ సంస్థ/ ప్రచురణకర్త మూలరచన (అనువాదం అయితే) భాష ప్రక్రియ ఇతర విశేషాలు
1928 ప్రభవ కవితా సమితి, విశాఖపట్నం తెలుగు పద్యకావ్యం
1946 వారం వారం ప్రతిమా బుక్స్, ఏలూరు తెలుగు
1950 మహాప్రస్థానం నళినీకుమార్, మఛిలీపట్నం తెలుగు కవితా సంకలనం 20వ శతాబ్ది తెలుగు సాహిత్యానికి మేలి మలుపు వంటి రచన, అభ్యుదయ యుగ సాహిత్యంలో అత్యంత ముఖ్యమైన ఖండకావ్య సంకలనం
1952 అమ్మ అరుణ ప్రచురణలు, నెల్లూరు మదర్ (నాటకం), మూల రచయిత.కారల్ ఛెవెక్ తెలుగు నాటకం
1954 మేమే త్రిలింగ పబ్లిషర్స్, విజయవాడ తెలుగు
1956 మరో ప్రపంచం అరుణరేఖ ప్రచురణలు, నెల్లూరు తెలుగు రేడియో నాటికలు 1+1=1 అని శీర్షికను మార్చి విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ ద్వారా 1974, 1984ల్లో ప్రచురించారు
1956 త్రీ ఛీర్స్ ఫర్ మ్యాన్ అభ్యుదయ ప్రచురణలు, మద్రాసు తెలుగు
1957 చరమరాత్రి గుప్తా బ్రదర్స్, విశాఖపట్నం తెలుగు కథా సంకలనం
1958 మానవుడి పాట్లు విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ మైఖేల్ షాలకోవ్ నవల తెలుగు నవల
1958 సౌదామిని అద్దేపల్లి అండ్ కో, రాజమండ్రి పురిపండా అప్పలస్వామి కవితలు ఆంగ్లం కవితా సంకలనం పురిపండా అప్పలస్వామిపై తనకున్న అభిమానంతో ఈ అనువాదం చేశారు
1959 గురజాడ మన సాహితి, హైదరాబాద్ తెలుగు సాహిత్య విమర్శ గురజాడను ఆధునిక కవిత్రయంలో ఒకడిగా, చాలా విషయాల్లో తనకు మార్గనిర్దేశకునిగా పేర్కొన్న శ్రీశ్రీ ఆయన సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యంలో దానికున్న విలువైన స్థానాన్ని వివరిస్తూ చేసిన సాహిత్య విమర్శ ఇది. శ్రీశ్రీ సాహిత్య విమర్శల్లో చాలా అత్యుత్తమమైనదని దీన్ని పరిశీలకులు కొనియాడారు.
1964 మూడు యాభైలు విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ తెలుగు
1966 ఖడ్గ సృష్టి విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ తెలుగు కవితా సంకలనం మహాప్రస్థానం తర్వాత శ్రీశ్రీ రచనల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన రచన ఇది. దీనిలో ఆయన అనేకరకాల ప్రయోగాత్మకమైన కవతా ప్రక్రియలు చేపట్టారు. ఈ రచనకు శ్రీశ్రీ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు.
1969 వ్యూలు రివ్యూలు మినర్వా ప్రెస్, మచిలీపట్నం తెలుగు
1970 శ్రీశ్రీ సాహిత్యం షష్టిపూర్తి సన్మాన సంఘం, విశాఖపట్నం తెలుగు వివిధ ప్రక్రియలు శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భంగా షష్టిపూర్తి సంఘం 5 సంపుటాల్లో అప్పటికి ఆయన రచించిన సాహిత్యాన్నంతా ప్రచురించారు.
1970 Sri Sri Miscellany - English volumes షష్టిపూర్తి సన్మాన సంఘం, విశాఖపట్నం ఇంగ్లీష్ వివిధ ప్రక్రియలు శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భంగా ఆయన ఆంగ్ల రచనలు ఈ పుస్తకంగా ప్రచురించారు.
1971 రెక్కవిప్పిన రివల్యూషన్ ఉద్యమ సాహితి, కరీంనగర్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎన్డ్ తెలుగు
1973 వ్యాసక్రీడలు నవోదయా ప్రచురణలు, విజయవాడ తెలుగు
1974 మరో మూడు యాభైలు ఎమెస్కో, సికిందరాబాద్ తెలుగు
1980 చైనాయానం స్వాతి ప్రచురణలు, విజయవాడ తెలుగు ట్రావెలాగ్
1980 మరో ప్రస్థానం విరసం తెలుగు కవితా సంకలనం
1981 మహాప్రస్థానం విదేశాంధ్ర ప్రచురణలు, లండన్ తెలుగు కవితా సంకలనం శ్రీశ్రీ స్వంతదస్తూరి, స్వంతగొంతులో
1983 పాడవోయి భారతీయుడా! శ్రీశ్రీ ప్రచురణలు, మద్రాసు తెలుగు గేయసంకలనం
1983 New Frontiers విరసం తెలుగు
1986 అనంతం తెలుగు ఆత్మకథ శ్రీశ్రీ ఆత్మకథాత్మకమైన ఈ రచన తనకు తోచిన విధంగా క్రమాతిక్రమణంతో, అన్ ఎడిటెడ్ రచనగా ప్రచురించారు. శ్రీశ్రీ తన జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఒడిదుడుకులు వివరించాడు. అతడి సమకాలీన కవులు, రచయితలు, ప్రసిద్ధ వ్యక్తులు మనకు ఈ పుస్తకంలో పరిచయం చేశాడు.
1990 ప్ర-జ విరసం తెలుగు ప్రశ్నలు-జవాబులు శ్రీశ్రీ 1950ల్లో పత్రికలో నిర్వహించిన శీర్షిక ఇది. ఆయనకు పాఠకులు రాసి పంపిన ప్రశ్నలకు చమత్కారంగా, కొన్ని సార్లు వివాదాస్పదంగా సమాధానాలు రాసేవారు. ఆ ప్రశ్న జవాబుల సంకలనం ఇది.

ఇంకొన్ని రచనలు మార్చు

  • సంపంగి తోట - ప్రచురణ: ప్రజా సాహిత్య పరిషత్, తెనాలి - 1947
  • రేడియో నాటికలు - ప్రచురణ: అరుణరేఖా పబ్లిషర్స్, నెల్లూరు - 1956
  • చరమ రాత్రి - ప్రచురణ: గుప్తా బ్రదర్స్, వైజాగ్ - 1957
  • లెనిన్ - ప్రచురణ: ప్రగతి ప్రచురణ, మాస్కో - 1971
  • శ్రీశ్రీ వ్యాసాలు - ప్రచురణ: విరసం - 1986
  • తెలుగువీర లేవరా (సినిమా పాటలు)- ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1996
  • విశాలాంధ్రలో ప్రజారాజ్యం - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1999
  • ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001
  • ఖబర్దార్ సంఘ శత్రువు లారా - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001
  • ప్సామవేదం అనువాద కవిత [2]

లిమరిక్కులు 1945

మూలాలు మార్చు

  1. రాధాకృష్ణ, బూదరాజు (1999). మహాకవి శ్రీశ్రీ (ప్రథమ ముద్రణ ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ. ISBN 81-260-0719-2.
  2. ప్సామవేదం – శ్రీశ్రీ – అనువాద కవిత