శ్రీ అమృత తులసి తులసి యొక్క గొప్పదనమును తెలియజేయు మంచి తెలుగు పుస్తకము. దీని రచయిత ప్రముఖ ఆయుర్వేద, హోమియోపతి వైద్యులు డా. టి.కె. గిరిధరన్. దీనిని 2000 సంవత్సరంలో మొదటిసారిగా ముద్రించారు. వైద్య విషయాలే కాకుండా ఆధ్యాత్మిక, ప్రాచీన గ్రంథాల నుండి సేకరించిన అనేక విషయాలను ఇందులో పొందుపర్చడం దీనిలోని ప్రత్యేకత. దీనికి శ్రీ కాళహస్తీశ్వరాలయము నందు అనేక గ్రంథములను ప్రచురించిన విద్వాన్ వీ.రా. ఆచార్య గారి సహాయ సహకారాలు అందించినట్లుగా రచయిత తెలియజేశారు. ఈ గ్రంథ ముద్రణకు తిరుమల తిరుపతి దేవస్థానములు ఆర్థిక సహాయాన్ని అందించినది. తి.తి.దే. ధర్మప్రచార పరిషత్తు కార్యదర్శి శ్రీ సముద్రాల లక్ష్మణయ్య దీనిని "తులసీ సర్వస్వం" అని పేర్కొన్నారు.

శ్రీ అమృత తులసి విషయ సూచిక

విన్నపము

మార్చు

"శ్రీ అమృత తులసి" పేరులోని శ్రీ అనగా లక్ష్మీదేవి; అమృతము అనగా ముదిమిని పోగొట్టి యౌవనమును ప్రసాదించు దివ్యౌషధము; తులసి అనగా సాటి, సాదృశ్యము, పోలిక లేనిది యని అర్థము. అనగా సాక్షాత్తు లక్ష్మీదేవి కంటే వేరు పోలిక లేనిదియైన, అమృత తుల్యమైన తులసి.

ప్రపంచసృష్టిలో తులసి ఒక దివ్యమైన, విశిష్టమైన ఔషధము. శ్రీమహాలక్ష్మీదేవి అంశముగా పరిగణింపబడుచున్నది. చతుర్వేదములందును, సకలశాస్త్రములందును, అష్టాదశపురాణములందును ప్రస్తావించబడిన దివ్యౌషధములలో ఉత్తమమైనది. అందువలననే అన్ని యుగములందును తులసి యొక్క ప్రస్తావన చేయబడియున్నది.

ఈ గ్రంథములో శ్రీతులసిని గురించిన స్తోత్ర, కవచ, పారాయణ, పూజాక్రమములను ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయములను అందరూ పఠించి పాటించవలయును.

విషయసూచిక

మార్చు

ప్రథమ భాగము

మార్చు
  • శ్రీతులసి - విశిష్టత
  • శ్రీతులసి - జననము
  • శ్రీతులసి గాథ
  • శ్రీతులసి వృత్తాంతము
  • శ్రీతులసి ప్రాశస్త్యము శ్రీపాదతీర్థము
  • శ్రీతులసి మహాత్మ్యము
  • శ్రీతులసి - గణపతి
  • శ్రీతులసి కాష్ఠమణిమాల
  • శ్రీతులసి పూజ
  • శ్రీతులసి స్తోత్రము
  • శ్రీతులసి స్తవము
  • శ్రీతులసి ధ్యానము
  • శ్రీతులసి నామాష్టకము
  • శ్రీకృష్ణ భగవాన్ - శ్రీతులసి యంత్రము
  • శ్రీతులసి కవచము
  • శ్రీతులసి కవచపారాయణక్రమము
  • శ్రీతులసి వివాహప్రతిష్ఠ
  • శ్రీతులసి యక్షిణిమంత్రము
  • శ్రీతులసి పూజా విధానము
  • శ్రీతులసి అష్టోత్తర శతనామావళి
  • శ్రీతులసి లక్షప్రదక్షిణ విధిః
  • శ్రీతులసి వ్రతపూజ
  • శ్రీతులసి విష్ణుః వివాహః

ద్వితీయ భాగము

మార్చు
  • శ్రీతులసి ఆధునిక ఆయుర్వేద విజ్ఞానము
  • శ్రీతులసి హోమియోపతి వైద్య విధానము
  • శ్రీతులసి ఆయుర్వేద ప్రాశస్త్యము

తృతీయ భాగము

మార్చు
  • జ్వరప్రకరణము చికిత్స
  • శిరోరోగ చికిత్స
  • నేత్రరోగ చికిత్స
  • నాశికారోగ చికిత్స
  • కర్ణరోగ చికిత్స
  • ముఖరోగ చికిత్స
  • అస్యరోగ చికిత్స
  • దంతరోగ చికిత్స
  • శ్వాసకోశరోగ చికిత్స
  • క్షయరోగ చికిత్స
  • శ్లేష్మరోగ చికిత్స
  • పిత్తరోగ చికిత్స
  • వాతరోగ చికిత్స
  • హృదయరోగ చికిత్స
  • ప్లీహరోగ చికిత్స
  • ఉదరరోగ చికిత్స
  • విషూచి, అర్శస్సు, మూత్రరోగ చికిత్స
  • చర్మరోగ చికిత్స
  • మశూచిరోగ చికిత్స
  • విషకాట్లకు చికిత్స
  • మూలరోగ చికిత్స
  • ఉన్మాదరోగ, భూతబాద చికిత్స
  • సుఖరోగ చికిత్స
  • మేహరోగ చికిత్స
  • స్త్రీరోగ చికిత్స
  • శిశురోగ చికిత్స
  • పుట్టకురుపు వ్యాధి చికిత్స
  • కాయకల్పములు, ధాతుపుష్టి యోగములు
  • భస్మములు
  • కట్లు
  • సింధురములు
  • రసౌషదములు
  • మాందవ్యాదులు - వివరణ

మూలాలు

మార్చు
  • శ్రీ అమృత తులసి, రచన, సంకలనము, వ్యాఖ్యాత : డా. టి.కె.గిరిధరన్, చిత్తూరు, 2000.