శ్రీ కుమారశతకము[1] సంస్కృతములో రావు భాస్కరరావు చేత రచింపబడి దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి చేత ఆంధ్రీకరించబడింది. ఇది 1900 ఆగస్టు 1వ తేదీన కోలంక వీరవరం జమీందారిణి రాజా చెల్లయ్యమ్మ రావుబహద్దూరు ఆజ్ఞానుసారం మద్రాసు లారెన్స్ అసైలమ్ ప్రెస్సులో క్రొత్తపల్లి పద్మనాభశాస్త్రిగారిచే ముద్రించబడింది. ఈ శతకంలో 101 శ్లోకాలు, ప్రతి శ్లోకానికి వెనువెంటనే ఆంధ్రీకృతపద్యము ఉన్నాయి. రావు వంశపు కులవృద్ధుడైన రావు భాస్కరరావు పిఠాపురం మహారాజా రావువేంకటకుమార మహీపతి సూర్యారావును ఉద్దేశించి రాజనీతిని బోధించిన శతకము ఇది. రావు వంశపుటౌన్నత్యము, మహారాజా వారి మాతృపితృ నగర మహిమ, మహారాజా వారి విద్వత్తు మొదలైన విషయాలు ఈ శతకంలో పొందుపరచబడి ఉంది. "కుమార!" అనేది ఈ శతకానికి మకుటంగా ఉంది.

కుమార శతకము
కవి పేరురావు భాస్కర రావు
అనువాదకుడుదేవులపల్లి సుబ్బరాయశాస్త్రి
వ్రాయబడిన సంవత్సరం1897
మొదటి ప్రచురణ తేదీ1900
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంకుమార!
విషయము(లు)రాజనీతి
పద్యం/గద్యంపద్యం
ఛందస్సుతేటగీతి
ప్రచురణ కర్తక్రొత్తపల్లి పద్మనాభశాస్త్రి
ప్రచురణ తేదీ1900
మొత్తం పద్యముల సంఖ్య101
అంకితంరావు వేంకటకుమార మహీపతి సూర్యారావు
ముద్రాపకుని పేరుక్రొత్తపల్లి పద్మనాభశాస్త్రి
ముద్రణా శాలలారెన్స్ అసైలం ప్రెస్, మద్రాసు

మచ్చుతునకలుసవరించు

తే|| తత్తనూజులు సర్వజ్ఞ మాధవులనంగ
శైవవైష్ణవ ధర్ములై ఠీవి గనిరో
మీదయిన యన్వయంబున కాదిపురుషు
లట్టి వంశోచ్ఛ్రయముఁ బొందుమా కుమారా!
తే||చేయఁదగినట్టి పనియును జేయరాని
పనియుఁదెలియ నశక్యమైపరఁగుఁగాన
మహిని బండి తులైన బ్రహ్మణుల నీదు
సభల నిలుపబంగఁ దగును నిచ్చలుఁ గుమార!

మూలాలుసవరించు

  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973


శతకములు
ఆంధ్ర నాయక శతకము | కామేశ్వరీ శతకము | కుక్కుటేశ్వర శతకము | కుప్పుసామి శతకము | కుమార శతకము | కుమారీ శతకము | కృష్ణ శతకము | గాంధిజీ శతకము | గువ్వలచెన్న శతకము | గోపాల శతకము | చక్రధారి శతకము | చిరవిభవ శతకము | చెన్నకేశవ శతకము | దాశరథీ శతకము | దేవకీనందన శతకము | ధూర్తమానవా శతకము | నరసింహ శతకము | నారాయణ శతకము | నీతి శతకము | భారతీ శతకము | భాస్కర శతకము | మారుతి శతకము | మందేశ్వర శతకము | రామలింగేశ శతకము | విజయరామ శతకము | విఠలేశ్వర శతకము | వేమన శతకము | వేంకటేశ శతకము | వృషాధిప శతకము | శిఖినరసింహ శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | శ్రీ కాళహస్తీశ్వర శతకము | శ్రీవేంకటాచల విహార శతకము | సర్వేశ్వర శతకము | సింహాద్రి నారసింహ శతకము | సుమతీ శతకము | సూర్య శతకము | సమాజ దర్పణం | విశ్వనాథ పంచశతి | విశ్వనాథ మధ్యాక్కఱలు | టెంకాయచిప్ప శతకము | శ్రీగిరి శతకము | శ్రీకాళహస్తి శతకము | భద్రగిరి శతకము | కులస్వామి శతకము | శేషాద్రి శతకము | ద్రాక్షారామ శతకము | నందమూరు శతకము | నెకరు కల్లు శతకము | మున్నంగి శతకము | వేములవాడ శతకము | శతకము