శ్రీ గుప్తుడు
శ్రీగుప్తుడు(r. 240 – 280 CE)[1] గుప్తసామ్రాజ్య స్థాపకుడు. ఈయన ఉత్తర భారతదేశంలో గుప్తసామ్రాజ్య చక్రవర్తిగా కీర్తిపొందాడు.ఈ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గుజరాత్, రాజస్థాన్ లోని కొంతభాగం, పశ్చిమ భారతదేశం, బంగ్లాదేశ్ ప్రాంతాలకు విస్తరించింది. వీరి రాజధాని పాటలీపుత్రము, ప్రస్తుత బీహారు రాజధాని పాట్నా.దీనికి అనేక ఆధారాలున్నాయి.
శ్రీ గుప్తుడు | |
---|---|
గుప్త సమ్రాజ్య రాజు | |
పరిపాలన | 240–280 CE |
ఉత్తరాధికారి | ఘటోత్కచ (రాజు) |
Spouse | రచనాదేవి |
వంశము | ఘటోత్కచ |
House | గుప్త సామ్రాజ్యము |
690 CE లో యీజింగ్ వ్రాసిన రచనల ఆధారంగా శ్రీగుప్తుడు పరిపాలించినట్లు ఋజువులున్నాయి. అదే విధంగా మొదటి చంద్రగుప్తుడు|మొదటి చంద్రగుప్తుని(305-335) కుమార్తె ఐన ప్రబహవతి గుప్త వ్రాసిన పూనా రాగిపత్ర శాసనం శ్రీగుప్తుడు గుప్తసామ్రాజ్య స్థాపకుడని తెలియుచున్నది.[1] చైనాదేశపు సన్యాసి అయిన యీజింగ్ 690 CE లో వ్రాసిన రచనల ఆధారంగా ఉత్తర భారతదేశంలోని నలందా కు సమీపంలొ గల మ్ర్గసిఖవాన అనే భౌద్ధ దేవాలయం శ్రీ గుప్తుడు నిర్మించినట్లు తెలియుచున్నది. ఈ దేవాలయం చైనా నుండి వచ్చు భౌద్ధ యాత్రికుల కొరకు నిర్మించినట్లు ఈ దేవాలయ నిర్వహణకు 40 గ్రామాల సిస్తును కేటాయించినట్లు తెలియుచున్నది.[2]: 35
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Mookerji, Radha Krishna. (1995). The Gupta Empire (5th ed.). Motilal Banarsidass. p. 11. ISBN 9788120804401.
- ↑ Narain, A.K. (1983). Bardwell L. Smith (ed.). Essays on Gupta Culture: Religious Policy and Toleration in Ancient India with Particular Reference to the Gupta Age. Motilal Banarsidass Publications. pp. 17–52. ISBN 0836408713. Retrieved 29 September 2014.
Regnal titles | ||
---|---|---|
New title | Gupta Ruler 240–280 CE |
తరువాత వారు Ghatotkacha |