శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయం

ఈ ఆలయం గవరపాలెంలోని సతకంపట్టు ప్రాంతంలో ఉంది[1]. ఈ ఆలయం గవరలచే 1900 లో నిర్మించబడింది. ఇది వారి కుల దైవం.కార్తీక, పుష్య మాసంలో అనకాపల్లిలో గవరపాలెం గౌరీ పరమేశ్వరుని పెద్ద ఉత్సవం.[2]ఈ పండుగ జనవరి చివరిలో ప్రధానంగా శనివారంలో జరుపుకుంటారు.ఈ ఉత్సవకమిటీ చైర్మన్ కొణతాల మనోహరరావు నాయుడు[3],ఉత్సవ కమిటీ సభ్యులుకొణతాల సంతోష్ అప్పారావు నాయుడు,కొణతాల శ్రీనివాస్, కొణతాల నూకమహాలక్ష్మి నాయుడు,కొణతాల మురళీ కృష్ణ.ఆలయ ప్రతినిధులు కర్రి రుద్ర నాయుడు,మద్దాల ఓం శివ,కోరుబిల్లి సత్యనారాయణ,మద్దాల చిరంజీవి[4].సతకంపట్టులోని ఆలయంలో అమ్మవారికి తెల్లవారుజామున నాలుగు గంటలకు పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వాహిస్తరు భక్తులకు దర్శనం కలిపిస్తరు. మధ్యాహ్నం 12 గంటలకు గౌరీపరమేశ్వరులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై ఉంచి పురవీధుల్లో ఊరేగిస్తరు. ఆదివారం రాత్రి వరకు పురవీధుల్లో ఊరేగింపు అనంతరం అనుపు మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించును.ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నేలవేషాలు, విచిత్ర వేషధారణలు, విజయనగరం కళాకారుల పులివేషాలు, బుట్టబొమ్మల ప్రదర్శన, మండపేట కళాకారుల గరిడి కోలాటం, తాడేపల్లిగూడెం కళాకారుల నవదుర్గల నృత్య ప్రదర్శన, అమలాపురం కళాకారుల గరగల నృత్యం, ఏలేశ్వరం కళాకారుల తీన్‌మార్‌, రాజమండ్రి కళాకారుల గోవింద గోవింద ప్రదర్శన, విశాఖపట్నం కోలాటాలు, పొడుగుకాళ్ల మనిషి వేషాలు ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన వారిని ఎంతగానో ఆకట్టు కుంటయ్.[5]అనకాపల్లిలో గవరపాలెం గౌరీ పరమేశ్వర ఉత్సవానికి ప్రముఖ స్థానం.ఈ పండుగ రాష్ట్రం అంతటా ప్రసిద్ధి చెందింది[3]

మూలాలు మార్చు

  1. ABN (2022-01-30). "కన్నులపండువగా గవరపాలెం గౌరీపరమేశ్వరుల ఉత్సవం". Andhrajyothy Telugu News. Retrieved 2023-08-13.
  2. కడలి అన్నపూర్ణ (2000). అనకాపల్లి గ్రామదేవతలు-ఒక పరిశీలనము.
  3. 3.0 3.1 "గౌరీ పరమేశ్వరుల ఉత్సవం". AndhraPatrika. ANDHRAPATRIKA. 1986-01-23. p. 4.
  4. ABN (2023-01-27). "గవరపాలెం గౌరీపరమేశ్వరుల ఉత్సవం రేపు". Andhrajyothy Telugu News. Retrieved 2023-08-13.
  5. ABN (2022-01-30). "కన్నులపండువగా గవరపాలెం గౌరీపరమేశ్వరుల ఉత్సవం". Andhrajyothy Telugu News. Retrieved 2023-08-13.