శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయం (గురజాల)
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఆగస్టు 2018) |
శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారు దేవాలయం గుంటూరు జిల్లా, గురజాల పట్టణంలో ఉంది.[1] భక్తల కొంగుబంగారమై విరసిల్లుతున్న పాతపాటేశ్వరి అమ్మవారును సుమారు 1000 సంవత్సరాల కిందట దుగ్గరాజు వంశం వారిచే ప్రతిష్ఠగావించబడినట్లు దేవాలయంలోని శాసనం ద్వారా తెలుస్తుంది[2].
చరిత్ర
మార్చుఅమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. శ్రీ ఆదిపరాశక్తి స్వరూపిణి అయిన శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారిని సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం గురజాల పట్టణంలో దుగ్గరాజు వంశీకులచే ప్రతిష్ఠించినటు ఆలయంలోని శాసనాల ద్వారా తెలు స్తోంది. సా.శ. 11వ శతాబ్దంలో పల్నాటి నాయకురాలైన నాగమ్మ ఈ అమ్మవారికి భక్తి ప్రపత్తులతో పూజలు జరిపినటు పెద్దలు చెబుతూ ఉంటారు. వీరశైవ భక్తురాలైన నాగమ్మ గురజాల గ్రామంలో ఉన్న శ్రీ ముక్కంటేశ్వరుడు, శ్రీ వీరభద్రస్వామి, శ్రీ పాతపాటేశ్వరి అమ్మవార్లను కొలిచినట్లు ఆలయశాసనాల ద్వారా తెలుస్తోంది. ఎంతో మహిమాన్విత మైన ఈ పుణ్యక్షేత్రం శిథిలమై తిరిగి 1828వ సంవత్సరంలో అప్పటి కలే క్టర్ ఓర్స్ దొర అమ్మ వారి మహిమలకు ముగుడై నిత్య నైవేద్య దీపా రాదనల నిమిత్తం సుమారు 40 ఎకరాల భూమిని ఇనాముగా ఇచ్చారు. అమ్మవారికి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి నుంచి మార్గశిర శుద్ధ పౌర్ణమి వరకు తిరునాళ్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్స వాల్లో ఏకాదశి రోజున బియ్యం కొలిచి, ముడుపుకడితే నాలుగో రోజు అమ్మవారి మహిమ వల్ల రెట్టింపు అవుతాయని భక్తుల విశ్వాసం. සයී రోజు అనగా పున్నమి రోజున అమ్మవారి తిరునాళ్ల చేస్తారు. ఈ ఉత్స వంలో ముఖ్యమైనది సిడిమాను (సిరిమాను) ఉత్సవం. అమ్మవారి సిడి మానుకు రైతులు తమ పొలాల్లో పండించిన గుమ్మడి కాయలు, సౌర కాయలు, ఇతర ధాన్యాలు కడతారు. పూర్వపు రోజులలో అమ్మవారు దేవాలయంలో జంతు బలులు జరిగేవి. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్ట కింద దీనిని నిషేధించారు.[3]
విశేషాలు
మార్చుమహిమ 1826 ప్రాంతాన శిస్తు వసూలు నిమిత్తం గురజాల వచ్చిన కలెక్టర్ ఓర్స్ దొర అధికార గర్వంతో ఆలయ ప్రాంగణంలోనే బస చేసి, గుర్రా లను కట్టివేశాడు. అవి కిందపడి గిలగిల తన్నుకోగా, అప్పటి దేవాలయ సిబ్బంది ఇదంతా అమ్మవారి ఆగ్రహంతో జరిగినదని, వెంటనే క్షమా పణ వేడుకుంటే అవి యధాస్థితి పొందుతాయని చెప్పారు. అప్పుడు ఆయన తన అపరాధాన్ని మన్నించమని అమ్మవారిని వేడుకోగా, గుర్రా లన్నింటికి స్వస్తత చేకూరినట్లు, అప్పుడు ఓర్స్ దొర సంతోషంతో అమ్మ వారికి 40 ఎకరాల భూమిని ఇనాముగా ఇచ్చినట్లు శాసనం చెబుతోంది. అమ్మవారు ఆలయం ప్రతి సంవత్సరం శరన్నవ రాత్రులలో అమ్మవారికి జరిగే పూజలు ఎంతో ప్రశస్తమైనవి. ఈ దేవాలయంలో అమ్మవారికి లలితా సహస్రం, లక్ష్మీ సహస్రం, త్రిశతి ఖడ్గములతో పూజలు జరుపుతారు. శ్రీ పాతపా టేశ్వరి అమ్మవారి ఆలయం పల్నాడులోనే విశిష్టమైనదని పల్నాటివాసులు చెప్పుకుంటారు.
ఉత్సవాలు
మార్చుఐదు రోజుల పాటు ఉత్సవాలు అమ్మవారికి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి మెదలు బహుళ పాడ్యమి వరకు ఐదు రోజులు తిరు నాళ్ల మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఏకా దశి రోజున అమ్మవారికి బియ్యం కొలత జరుగు తుంది. బియ్యం కొలిచి ముడుపు కడితే నాలుగో రోజు అమ్మవారి మహిమతో రెట్టింపు అవుతాయని భక్తుల విశ్వాసం. ఐదో రోజు అనగా పౌర్ణమి నాడు తిరునాళ్ల ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ పున్న మినే కోరల పన్నమి లేదా విష పన్నమి అని కూడా అంటారు. భక్తులు ఉదయాన్నే చేసిన గారే, బూరెలను కొరికి కుక్కలకు వేస్తారు. అలా చేస్తే తమలో ఉన్న విష స్వభావం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.
శిడిమాను ఉత్సవం రైతులు పొలాల్లో పండిన గుమ్మడి, సౌర ధాన్యాలనుశిడిమానుకు కడతారు. అమ్మవారి ఉత్సవ విగ్రహన్ని గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు. భక్తులు ఇండ్ల ముందు హారతులు పట్టి, కానుకలు సమర్పిస్తారు. గురజాల ప్రాంతంలో జన్మించిన, ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్నవారు తిరునాళ్లకు రావటం ఆనవాయితీ. ప్రస్తుతం పిన్నెల్లి వెంకట హనుమంతు గారి కుమా రుడు పిన్నెల్లి వెంకట సుబ్రమణ్యం ఆలయ అర్చకు లుగా కొనసాగుతున్నారు.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-07. Retrieved 2014-12-03.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-07. Retrieved 2014-12-03.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-12-27. Retrieved 2015-12-21.