శ్రీ విక్రమసింహపురి మండల సర్వస్వము

"శ్రీ విక్రమసింహపురి మండల సర్వస్వము" బృహద్ గ్రంథం 2000వేల పుటల గ్రంథాన్ని నెల్లూరు జిల్లా పరిషత్తు 1964 లో ప్రచురించింది. అప్పటి జిల్లా పరిషద్ చైర్మన్ శ్రీ నల్లపురెడ్డి చెంద్రశేఖర రెడ్డి కనుక, సంపాదకులుగా పుస్తకం మీద ఆయన పేరు ముద్రించబడింది.ఈ సర్వస్వ సంపాదక వర్గంలో డాక్టర్ ఎన్.గోపాలకృష్ణమూర్తి, యెన్.యెస్.కృష్ణమూర్తి, బడి గురవారెడ్డి, యెన్. గోపాలకృష్ణయ్య, ఏం.రామిరెడ్డి పో.హనుమత్ జానకిరామశర్మ సభ్యులు. సహాయ సంపాదకులు కేసరి సుందరరామమూర్తి, బండి గోపాలరెడ్డి. పై వారందరు వ్యాసాలు రాసారు కానీ మొత్తం సంపాదక బాధ్యతపైన నవేసుకొని వ్యాసాల సేకరణ, ఆయా రంగాలలో ప్రసిద్ధులైన వారిచేత వ్యాసాలు రాయించడం. ప్రెస్సులో ప్రూఫులు సరిచూడడం, ఫోటోలు సేకరించి ఇవ్వడం, అన్ని బాధ్యతలు యెన్.యెస్. కృష్ణమూర్తే చేసారు. ఇప్పడు పరిశోధకులు కృష్ణమూర్తి పేరే సంపాదకులుగా పేర్కొంటున్నారు.

ఇది ఆంధ్రప్రదేశ్ లో తోలి జిల్లాసర్వస్వం.ఇందులో మూడు భాగాలు, మొదటిభాగంలో జిల్లాలో ఆయా ప్రభుత్వ ఆఫీసు విభాగాల చరిత్ర, రెండోభాగంలో జిల్లాచరిత్ర, నైసర్గిక స్వరూపం, కొండలు, నదులు, మైకా గనులు తదితరాలు. మూడవ ఖండంలో జిల్లాలో ప్రసిద్దులయిన రచయితలు, పండితులు, కళాకారుల చరిత్రలు చేర్చబడినవి. అప్పటికి సంపాదకులకున్న వనరులతో, పుస్తకం ఒంటిచేతిమీద నాలుగేళ్లు కష్టించి తయారుచేసారు. సంపాదకులకు నిఘంటువులు, గ్రంథాలయ కేటలాగులు, సర్వస్వాలు కూర్చడంలో గొప్ప శాస్త్రీయమైన అవగాహన ఉంది. ఈనాడు జిల్లాకు సంబంధించిన ఏ విషయమయినా ఇందులో ప్రాథమిక సమాచారం లభిస్తుంది.ఈ గ్రంథమే లేకపోతె ఎందరో స్థానిక రచయితల పేర్లు కూడా తెలిసేవి కాదు. ఈ అనుభవంతో యెన్.యెస్ కృష్ణమూర్తి చేత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అనేక సర్వస్వాలను తయారుచేయించింది.

== మూలాలు == శ్రీ విక్రమ సింహపురి మండల సర్వస్వం, నెల్లూరు జిల్లా పరిషద్ ప్రచురణ, 1964.