శ్రీ సరస్వతీ నిలయ గ్రంథాలయం (పొలమూరు)

శ్రీ సరస్వతీ నిలయ గ్రంథాలయం పశ్చిమగోదావరి జిల్లా, పొలమూరు గ్రామంలోనున్న గ్రంథాలయం.[1]

సరస్వతీనిలయ గ్రంథాలయం

ఈ గ్రంథాలయం 1913 సంవత్సరంలో కొత్తపల్లి నరసింహం స్థాపిించాడు. మొదట 150 గ్రంథాలతో ప్రారంభింపబడి దినదినాభివృద్ధి గాంచింది. అతను అనేక వార్తాపత్రికలను గ్రంథాలను తమ స్వంత ద్రవ్యం వ్యయపరచి, చదువరుల రప్పించి కందించుచు పరోపకారార్థం మిక్కిలి దీక్షతో పాటుపడ్డాడు. గ్రంథాల గృహాలకు తీసుకుని వెళ్లిన పాఠకులు తిరిగి సరిగా నొసంగకపోవుటచే చాలభాగం గ్రంథాలు కనుమరుగయ్యాయి.[1] మెంబర్లందరును చందాలు సరిగా నిచ్చు పద్ధతియే లేకపోయింది. ఈ రీతిగా గ్రామవాసులకు ఉత్సాహం లేకపోవుటచే క్రమముగా క్షీణదశకు చేరుకుంది. ఈ గ్రామం గ్రామపంచాయితిగా స్థాపింపబడినతరువాత. దానికి కొత్తపల్లి నరసింహం అధ్యక్షులుగా పనిచేసినకాలంలో ఈ గ్రంథాలయం పంచాయితీవారి యాజమాన్యం క్రిందకు చేర్చారు. ఇది పంచాయతీ యాజమాన్యంలో నిర్వహించుచున్నారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "పుట:Grandaalayasarvasvamu sanputi 7sanchika 1jul1928.pdf/21 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2022-04-15.

వెలుపలి లంకెలు

మార్చు