23 పేజీలలో 100 పద్యములు కల శ్రీ సూర్యరాయ శతకము[1] దేవగుప్తాపు భరద్వాజము చేత రచింపబడి 1916లో చెన్నపురి ఆంధ్రపత్రికాలయములో ముద్రింపబడింది. పిఠాపురం మహారాజా రావు సూర్యారావు దాతృత్వాన్ని వర్ణించి, కొన్ని నీతులు బోధింపబడిన ఈ శతకములో "సూర్యనృపా" అనే మకుటం కలదు. ఇది కాక కవి "సూర్యరాయ విబుధవిదేయా!" "సూర్యరాయ సజ్జనగేయా!" "సూర్యరూప! చిత్తజరూపా!" అని కూడా సంబోధించాడు. అపాత్రదానము పనికి రాదని, ప్రభువెన్నడు తనకున్నదంతయు వెచ్చింపరాదని, వెనుక ముందు చూచి ఇవ్వవలెనని కవి ఈ శతకము ద్వారా ప్రభువుకు హితబోధ చేశాడు.

శ్రీ సూర్యరాయ శతకము
కవి పేరుదేవగుప్తాపు భరద్వాజము
మొదటి ప్రచురణ తేదీ1916
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంసూర్యనృపా!
విషయము(లు)నీతిబోధ
పద్యం/గద్యంపద్యం
ఛందస్సుకందపద్యాలు
ప్రచురణ తేదీ1916
మొత్తం పద్యముల సంఖ్య100
మొత్తం పుటలు23
అంకితంరావు సూర్యారావు
ముద్రాపకుని పేరుకాశీనాథుని నాగేశ్వరరావు పంతులు
ముద్రణా శాలఆంధ్రపత్రిక కార్యాలయము, చెన్నపురి
కం. పండితున కొక్కడబ్బిడఁ
గొండగు, మఱి వేనవేలు కొండీండ్రకిడన్
బెండగు పాత్రాపాత్రల్
ఖండితముగ నెంచి చూడ ఘనసూర్యనృపా!

మూలాలుసవరించు

  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973


శతకములు
ఆంధ్ర నాయక శతకము | కామేశ్వరీ శతకము | కుక్కుటేశ్వర శతకము | కుప్పుసామి శతకము | కుమార శతకము | కుమారీ శతకము | కృష్ణ శతకము | గాంధిజీ శతకము | గువ్వలచెన్న శతకము | గోపాల శతకము | చక్రధారి శతకము | చిరవిభవ శతకము | చెన్నకేశవ శతకము | దాశరథీ శతకము | దేవకీనందన శతకము | ధూర్తమానవా శతకము | నరసింహ శతకము | నారాయణ శతకము | నీతి శతకము | భారతీ శతకము | భాస్కర శతకము | మారుతి శతకము | మందేశ్వర శతకము | రామలింగేశ శతకము | విజయరామ శతకము | విఠలేశ్వర శతకము | వేమన శతకము | వేంకటేశ శతకము | వృషాధిప శతకము | శిఖినరసింహ శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | శ్రీ కాళహస్తీశ్వర శతకము | శ్రీవేంకటాచల విహార శతకము | సర్వేశ్వర శతకము | సింహాద్రి నారసింహ శతకము | సుమతీ శతకము | సూర్య శతకము | సమాజ దర్పణం | విశ్వనాథ పంచశతి | విశ్వనాథ మధ్యాక్కఱలు | టెంకాయచిప్ప శతకము | శ్రీగిరి శతకము | శ్రీకాళహస్తి శతకము | భద్రగిరి శతకము | కులస్వామి శతకము | శేషాద్రి శతకము | ద్రాక్షారామ శతకము | నందమూరు శతకము | నెకరు కల్లు శతకము | మున్నంగి శతకము | వేములవాడ శతకము | శతకము