శ్రీ స్వామినారాయణ దేవాలయం (వీలింగ్)
అమెరికాలోని చికాగోకు సమీపంలో ఉన్న వీలింగ్‌లో ఉన్న స్వామినారాయణ హిందూ దేవాలయం.
శ్రీ స్వామినారాయణ దేవాలయం, అమెరికాలోని చికాగోకు సమీపంలో ఉన్న వీలింగ్‌లో ఉన్న స్వామినారాయణ హిందూ దేవాలయం. అంతర్జాతీయ స్వామినారాయణ సత్సంగ్ మండలం పరిధిలోని ఈ దేవాలయం,[1] అంతర్జాతీయ స్వామినారాయణ్ సత్సంగ్ ఆర్గనైజేషన్‌లో భాగస్వామ్యం పొందింది.[2]
శ్రీ స్వామినారాయణ దేవాలయం | |
---|---|
స్థానం | |
దేశం: | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం: | ఇల్లినాయిస్ |
ప్రదేశం: | వీలింగ్ |
వెబ్‌సైటు: | http://www.shriswaminarayan.com/ |
చరిత్ర
మార్చు1991, మే 26న ఆచార్య శ్రీ అజేంద్రప్రసాద్‌జీ మహారాజ్‌చే ఈ దేవాలయం ప్రారంభించబడింది. దీనిని రెండు ఎకరాల స్థలంలో నిర్మించారు.[3] నారాయణుని ఇతర అవతారాలతోపాటుగా స్వామినారాయణుడు చిత్రరూపంలో ఇక్కడ పూజలందుకుంటాడు.[4] 40వేలమందికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది.
నిర్మాణ వివరాలు
మార్చుఈ దేవాలయం $1.7 మిలియన్ల వ్యయంతో నిర్మించబడింది. ఫ్లాట్ టాప్ భవనం ముందుభాగంలో మూడంచెలలో గోపురం ఏర్పాటుచేయబడింది.
మూలాలు
మార్చు- ↑ Williams 2004
- ↑ Williams 2001
- ↑ Mitchell, Kathie (1991-07-18). "Believers build house of worship Hindu group opens 1st new U.S. temple in Wheeling". Chicago Tribune. Archived from the original on 2012-10-22. Retrieved 2022-03-26.
- ↑ Padma Rangaswamy (2000), Namasté America: Indian immigrants in an American metropolis, Penn State Press, p. 258, ISBN 0-271-01981-6
ఉపయుక్త గ్రంథాలు
మార్చు- Williams, Raymond (2001), Introduction to Swaminarayan Hinduism, Cambridge University Press, ISBN 978-0-521-65422-7
- Williams, Raymond (2004), Williams on South Asian Religions and Immigration: Collected Works, Ashgate Publishing Ltd., ISBN 0-7546-3856-1