శ్వేతాశ్వతరోపనిషత్తు

శ్వేతాశ్వతర ఉపనిషత్తు శ్వేతాశ్వతర ఉపనిషత్తు కృష్ణయజుర్వేద శాఖకు చెందినది. ఈ ఉపనిషత్తులో ఆరు అధ్యాయములు ఉన్నాయి. ఈ ఆరు అధ్యాయాల్లో మొత్తం 113 మంత్రములు ఉన్నాయి.ఈ ఉపనిషత్తు శ్వేతాశ్వతర బ్రహ్మర్షి తన శిష్యులకు బోధించగా ఆయన పేరిటనే ఈ ఉపనిషత్తు విఖ్యాతమైంది. శ్వేతాశ్వతరం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇంద్రియనిగ్రహం అని ఒక అర్థం (శ్వేత = శుభ్రమైన + అశ్వతర = ఇంద్రియములు), మంచి కోడెదుడ అని ఇంకొక అర్థం (శ్వేత = స్యచ్ఛమైన + అశ్వతర = కోడెదూడ)

శ్వేతాశ్వతర ఉపనిషత్ లో పాఠ్యం

ప్రాముఖ్యతసవరించు

ఎంతోమంది భాష్యకారులు ఈ ఉపనిషత్తుకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. మనం వినే ప్రవచనాలలో ఏ ఒక్క సిద్ధాంతాన్ని ఈ ఉపనిషత్తు బలపరచదు. ద్వైతానికీ, విశిష్టాద్వైతానికీ, అద్వైతానికీ, తదితర వేదాంత శాఖలకూ కూడా సంబంధపడే మంత్రాలు ఇందులో ఉన్నాయి. కొన్ని మంత్రాల్లో సాంఖ్యము, యోగముల భావాలు ప్రముఖ స్థానాన్ని వహిస్తాయి. కొన్ని మంత్రాల్లో వైదిక శైలి, ఊహ, భావ ప్రకటనలు కుడా ఉన్నాయి.

స్వదేహమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్। ధ్యాననిర్మథనాభ్యాసాద్దేవం పశ్యేన్నిగూఢవత్॥ (1 - 14) ( తన శరీరాన్ని క్రింది కట్టెగానూ ప్రణవాన్ని మథించే పై కట్టెగానూ చేసుకొని ధ్యానమే మథించడంగా అభ్యాసంగా చేస్తూ దాగివున్న వస్తువును కనుగొన్నట్లుగా మనం భగవంతుని సాక్షాత్కరించుకోవాలి)

తత్వ వివేచనసవరించు

ఈ ఉపనిషత్తులో తత్వ వివేచన చేసే ఉదాహరణ శ్లోకం ఒకటి.

కిం కారణం బ్రహ్మ కుతఃస్మజాతాః
జీవాను కేన క్వచ సంప్రతిష్ఠా
అధిష్ఠతాః కేన సుఖేతరేషు
వర్తామహే బ్రహ్మ విద్యో వ్యవస్థాం

తాత్పర్యం

ఈ మహాసృష్టికి కారణం ఏమిటి? ఎక్కడ నుంచి ఎందుకు మనం జన్మించాము? దేనివల్ల మనం జీవిస్తున్నాము? తుదకు మనం విశ్రాంతి స్థలం ఎక్కడ? మన సుఖదుఃఖాలన్నీ ఎవరివల్ల, దేనివల్ల నిర్ణయం అవుతున్నాయి? ఏశాసనాలు మనల్ని నడుపుతున్నాయి? పరబ్రహ్మ అంటే ఏమిటి?[1]

మూలాలుసవరించు

  1. నండూరి, రామమోహనరావు (2015). విశ్వదర్శనం - భారతీయ చింతన. విజయవాడ: విక్టరీ పబ్లిషర్స్. p. 19.