• 1.శ్వేతుఁడు విరాటరాజు కొడుకు. ఉత్తరుని యన్న.
  • 2.శ్వేతుడు ఒకానొక రాజర్షి. ఇతడు ఒకప్పుడు కాళాంజనము అను తీర్థమున శివునిగూర్చి తపము చేయుచు ఉండఁగా ఇతనిని యముఁడు పట్టి కట్టి కొంపోవ శివుడు చూచి కోపించి యమునిని తన్నెను.
  • 3. శ్వేతుడు విదర్భదేశపు రాజు. తండ్రి సుదేవుఁడు. సోదరుఁడు సురథుడు. ఇతఁడు చిరకాలము రాజధర్మము తప్పక రాజ్యము చేసి వెనుక అతినిష్ఠతో తపము ఆచరించి దేవత్వమును పొందియు అన్నదానము చేయనందున ఆకలి విడువక బాధింపగా బ్రహ్మయొద్దకు పోయి తన దుఃఖమును చెప్పుకొనెను. అప్పుడు బ్రహ్మ నీవు అన్నదానము లేశమైన చేయని నిమిత్తమున నీకు ఈబాధ కలిగెను. కనుక ముందు నీవు భూలోకమునందు వదలివచ్చిన నీదేహమును భక్షించి ఆఁకలి తీర్చుకొనుచు ఉండుము. ఆదేహము చిరకాలము చెడక ఉండుటయె కాక నీవు కోసి తినిన అవయవములును మరల ఎప్పటివలె ఏర్పడి ఉండుచుండును అని చెప్పెను. అది విని ఇతడు అట్లే చేయుచు బహుకాలము కడపి కడపట అగస్త్యమహర్షిని తన మెడలోని మణులు కూర్చిన తులసి పూసలపేరు ఇచ్చి ఆకలి పోగొట్టుకొనెను.
"https://te.wikipedia.org/w/index.php?title=శ్వేతుడు&oldid=1815440" నుండి వెలికితీశారు