ఏదేని విషయం, సమస్య పైన నిర్ణయాలు తీసుకోడం, పరిష్కరించడం గురించి చదువరులకు పూర్తి అవగాహన కల్పించేందుకు విడుదల చేసే సాధికారిక నివేదిక/గైడు నీ శ్వేతపత్రం (white paper) అంటారు. ఇవి రెండు రకాలు. ప్రభుత్వానికి సంబంధించినవి, వ్యాపారులకు సంబంధించినవి.

సింగపూర్ ప్రభుత్వం జనవరి 2013 లో జారీ చేసిన " ఎ సస్టైనబుల్ పాపులేషన్ ఫర్ ఎ డైనమిక్ సింగపూర్": పాపులేషన్ వైట్ పేపర్ శ్వేతపత్రం కవర్ పేజీ దృశ్యచిత్రం.

ప్రభుత్వాల శ్వేతపత్రాలుసవరించు

శ్వేత పత్రం అనే పరిభావన, ప్రభుత్వాల నిర్వహణ నుండే పుట్టింది. చాలామంది 1922లో చర్చిల్ ప్రభుత్వం విడుదల చేసినదానినే, మొదటి శ్వేతపత్రంగా భావిస్తారు. శ్వేత పత్రాలు, "ఒక విషయం మీద ప్రభుత్వ విధానాలను వివరిస్తూనే, మరో పక్క వాటిపైని అభిప్రాయాలను అహ్వానిస్తాయి". "[1]

ఇతర రంగాల శ్వేతపత్రాలుసవరించు

1990 ప్రాంతాలలో వ్యాపారరంగంలో కూడా శ్వేత పత్రాలు కనిపించడం మొదలుపెట్టాయి. ఇవి ప్రధానంగా మార్కెటింగు, అమ్మకాలకు సంబంధించినవై ఉన్నాయి. ఎక్కువ శాతం, "ఫలాని" వ్యూహం "ఫలానా" సమస్యకు పరిష్కారం అంటూనో, వ్యాపారస్థులు సొంత విడుదలను విశదీకరిస్తూనో ఉంటాయి.[2]

మూలాలుసవరించు

  1. Pemberton, John E. Government Green Papers. Library World 71:49 Aug. 1969.
  2. Kantor, Jonathan (2009). Crafting White Paper 2.0: Designing Information for Today's Time and Attention Challenged Business Reader. Dever, Colorado: Lulu Publishing. p. 167. ISBN 978-0-557-16324-3.

వెలుపలి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.